Movies

రంగమ్మత్త విలన్

Anasuya To Get Into Negative Shades

బుల్లితెర వ్యాఖ్యాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అనసూయ. అంతేకాదు, అప్పుడప్పుడూ వెండితెరపైనా మెరుస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా గుర్తిండిపోయే పాత్రను చేశారు. ఇక ఈ ఏడాది పలు భారీ ప్రాజెక్టుల్లో అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. అందులో ఒకటి ప్రతినాయకురాలిగా నటించబోతున్నారట. యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ నిర్మించనున్న ఓ చిత్రంలో అనసూయకు అవకాశం వచ్చిందని తెలుస్తోంది. ఇందులో ఆమె విలన్‌గా కనిపించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే స్పష్టత రానుంది. ఈ ప్రతినాయకులురాలికి నాయకుడు ఎవరో చూడాలి మరి. గతేడాది తరుణ్‌ భాస్కర్‌ హీరోగా విజయ్‌ నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది అనసూయ. ప్రస్తుతం సుకుమార్‌- అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. దీంతో పవన్‌-క్రిష్‌ల చిత్రంలోనూ అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.