Food

చాక్లెట్ తింటే పడకగదిలో చలాకీదనం

Chocolate And Garlic Makes Mood For Bedroom

ప్రేమ కావ్యంలో చాక్లెట్లకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రేమ బంధంతో ఒక్కటైన వారు తమ బంధం మరింత బలపడాలంటే డార్క్ చాక్లెట్స్ తినాలని పరిశోధకులు సూచిస్తున్నారు. డార్క్ చాక్లెట్స్ తింటే పడకగదిలో రెచ్చిపోతారట..తర్వాత వారి మధ్య బంధం మరింత బలపడుతుందంటున్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ప్రేమికుల రోజున గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుని..తమ మధ్య బంధాన్ని మరింత ఇనుమడింపజేసుకుంటున్నారు. ప్రేమికుల వారోత్సవాల్లో మూడో రోజైన నేడు(ఫిబ్రవరి 9) చాక్లెడ్ డేగా జరుపుకుంటున్నారు. ప్రేమ కావ్యంతో శృంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. డార్క్ చాక్లెట్స్ తినడం ద్వారా  సెక్స్ కోరికలుపెరుతాయని పరిశోధనల్లో తేలాయి. చాక్లెట్స్ తిని తమ సంసార జీవితాన్ని మరింత సుఖమం చేసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. 

పడక గదిలో రెచ్చిపోవాలంటే చాక్లెట్స్‌తో పాటు వీటిని కూడా ట్రై చేయాలని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.  పాలకూర తినడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.. దీంతో పాటు కోరికలు పెరుగుతాయి.

వెల్లుల్లి తినడం వల్ల ఆడవారు, మగవారిలోనూ లైంగిక వాంఛ పెరుగుతుందని నిర్ధారణ అయింది.

ధనియాల పొడిని నీటిలో కలిపి కాసింత పసుపు వేసి తాగడం వల్ల సెక్స్ కోరికలు పెరుగుతాయి.

డీ విటమిన్ తగ్గడంతో సెక్స్ కోరికలు తగ్గుతాయి. కాబట్టి డీ విటమిన్ కలిగిన పుట్టగొడుగులు, కార్న్ ఫ్లేక్స్ తీసుకోవాలి. గుడ్లు, తృణధాన్యాలు తీసుకోవడం సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.