కంగనా రనౌత్ కథల ఎంపిక చూస్తే… ఆమె సాహసానికి ఆకాశమే హద్దు అనిపిస్తుంది. ఓ చిత్రంలో ఝాన్సీ లక్ష్మీబాయిగా వీరత్వాన్ని చూపి వహ్వా అనిపించిన ఆమెనే, మరో చిత్రంలో ఆటకు దూరమైన కబడ్డీ క్రీడాకారిణిగా తన మనోవేదనతో అయ్యో అనిపించి కంటతడి పెట్టించింది. ఇప్పుడు మరో సాహసోపేతమైన పాత్రలో కనిపించడానికి సిద్ధమైంది కంగన. ‘తేజస్’ చిత్రంలో ఎయిర్ ఫోర్స్ పైలెట్‌గా నటించ నుంది. ఈ చిత్రాన్ని సర్వేష్ మేవారా తెరకెక్కించనున్నారు. ఈ కొత్త చిత్రానికి సంబంధించిన వివరాలను సోమవారం చిత్రబృందం వెల్లడించింది. దీంతో పాటు కంగన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఎయిర్ ఫోర్స్ విమానం ముందు కంగన పైలెట్ యూనిఫాంలో తేజస్సు ఉట్టిపడేలా ఠీవీగా నిల్చున్న ఆ లుక్ ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రం గురించి కంగన మాట్లాడుతూ ‘‘దేశ రక్షణలో మహిళలు చేసిన త్యాగాలు చాలాసార్లు గుర్తింపునకు నోచుకోవు. ప్రాణం కన్నా దేశం ముఖ్యమని భావించే అలాంటి ఓ సాహసవంతురాలైన మహిళా పైలెట్‌గా నటించే గౌరవం ఈ చిత్రంతో లభించింది. దీని ద్వారా యువతలో దేశభక్తిని పెంపొందించ గలమని భావిస్తున్నా’’ అని చెప్పింది
యుద్ధ విమానం ఎదుట
Related tags :