Politics

బలహీనంగా పవన్-నాదెండ్ల బంధం

Pawan-Nadendla Relation Under Cracks

జనసేనలో పవన్ కళ్యాణ తరువాత స్థానం ఎవరిదీ అంటే కచ్చితంగా నాదెండ్ల మనోహర్ అని చెబుతారు. ఆయన సీనియర్ నాయకుడు రనెడు సార్లు ఎమ్మెల్యేగా, ఉపసభాపతిగా సభాపతిగా పనిచేడిన అనుభవం కలిగిన నేతగా మంచి గుర్తింపు ఉంది. పైగా తండ్రి నాదెండ్ల భాస్కరరావు రాజకీయ వారసుడిగా కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరాక పార్టీ రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు మార్పులు కూడా వచ్చాయని అంటారు. 2019 ఎన్నికల్లో తెదేపాతో లోపాయికారీ అవగాహనలు బీస్పీ వామపక్షాల్లో పోత్తులకు కూడా నాదెండ్ల మనోహర్ ఆలోచనలే కారణం అంటారు. రాజకీయంగా నాదెండ్ల అనుభవాల్ని పవన్ సైతం బాగానే తీసుకుని పార్టీలో ఆయన్ని నంబర్ టూ గా సెహ్సారు. అయితే ఈ బంధం ఇప్పుడు కొంత బీటలు వారె సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.