వైకాపా, తెదేపా ప్రజల విశ్వాసం కోల్పోయాయని భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి అన్నారు. ప్రస్తుతం కక్షపూరిత పాలన తప్ప అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్‌తో పోలవరం పనులు కుంటుపడ్డాయన్న ఆమె.. ప్రభుత్వ విధానాల వల్ల పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఆర్థిక లోటులో పథకాలు ఎలా అమలుచేస్తారో వాళ్లే చెప్పలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల అంశంతో పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. రాజధాని రైతులకు ఎలా న్యాయం చేస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. మండలి వల్ల ఉపయోగం లేదని అంటున్నారనీ.. తొలి భేటీలోనే రద్దు కోరుతూ తీర్మానం ఎందుకు చేయలేదని పురందేశ్వరి ప్రశ్నించారు.
ఆ రెండు పార్టీలకు ప్రజలు పట్టరు
Related tags :