*ఆంధ్రప్రదేశ్‌లోని పలు మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బిల్లింగ్ సెక్షన్లపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఫిర్యాదులు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్‌కు అందడంతో మంగళవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో అధికారులు దాడులు చేశారు. ముఖ్యంగా నెల్లూరు, గుంటూరు, శ్రీకాకుళం, విజయవాడ.. నగరపాలక సంస్థలన్నింటిలో ఇవాళ ఉదయం 11 గంటల నుంచి దాడులు ప్రారంభమయ్యాయి. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో టైన్ ప్లానింగ్ విభాగంలో జరిపిన సోదాల్లో కొన్ని ఫైల్స్ పరిశీలిస్తుండగా అందులో నగదు ప్యాకెట్లు బయటపడ్డాయి. అలాగే నెల్లూరు, శ్రీకాకుళం ప్రాంతాల్లో కూడా అధికారులు అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు.
* తెలంగాణ పోలీసులకు చిరంజీవి కోడలు పాటాలు
ఆరోగ్య చిట్కాలు నేర్పడంలో కొణిదెల వారు కోడలు., అపోలో లైఫ్ నిర్వాహకురాలు ఉపాసన ఎప్పుడూ ముందుంటారు. బీ పాజిటివ్ పేరిట మేగజైన్ నడుపుతూ ఆరోగ్యానికి సంబందించిన విషయాలు చెబుతున్నారు యూట్యూబ్ వేదికగా పలువురు సినీ స్టార్ల దైత్ను ప్రజలు ముందుకు తీసుకొస్తున్నారు యోగాసనాలు తీసుకోవాల్సిన ఆహారం హృద్రోగ ఇతర సంబందించిన వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. అంతేకాదు సమాజ సేవల్లోను ఉపాసన్ ముందుంటారు. తాజాగా తెలంగాణ పోలీస్ కోసం యోగా పాటాలు కూడా నేర్పారు ఆమె. అప్లో హాస్పిటల్స్ సహకరంతో ప్రముఖ యోగా నిపుణుడు ఎడ్డీ స్టెర్న్ ఆద్వర్యంలో పోలీసులకు యోగా నేర్పారు. నిరంతరం ప్రజా సేవలో ఉండే పోలీసులు మానసికంగా శారీరకంగా దృడంగా ఉండేందుకు ప్రత్యెక సిభిరాన్ని ఏర్పాటుచేసి యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దీనికి సంబందించిన వీడియోను ఉపాసన తన ఇన్ స్త్రాగాం వేదికగా ఫలోయర్లుకు తెలియజేశారు. అత్యంత మానసిక శారీరక ఒత్తిడితో ప్రజలకు సేవ చేస్తున్నతెలంగాణా పోలీసులు కోసం యోగా శిభిరాన్ని ఏర్పాటు చేయడం గౌరవంగా భావిస్తున్నా పోలీసులు మరింత ఆరోగ్య వంతంగా ఉండాలి అని ఆమె తెలిపారు. ఈ పోస్టు ను రాం చరణ్ అభిమానులు జోరుగా పార్వర్డ్ చేస్తున్నారు ఉపాసన వేనోళ్ళ పోగుడుతునారు. మా వదిన బంగారం అంటూ సమాజ సేవలో ఎపుడూ ముందుంటారామే అంటూ కామెంటు పెడుతున్నారు.
*2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 5,12,860.72 కోట్ల రూపాయల బడ్జెట్‌ను రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా ప్రవేశ పెట్టారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. గతేడాది బడ్జెట్‌తో పోల్చితే ఇది 33,159 కోట్ల రూపాయలు అధికం. కాగా ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నాకు ఇదే మొదటి పూర్తి స్థాయి బడ్జెట్.
* తెలంగాణలో మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 35 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు.
* చర్లపల్లిలో శాటిలైట్ రైల్వేస్టేషన్ నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ శంకుస్థాపన చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 427 రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సేవలను ప్రారంభించారు.
* ఎన్నికల అఫిడవిట్‌పై విచారణను ఎదుర్కొనాలని ఇచ్చిన తీర్పును సమీక్షించాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం రిజర్వు చేసింది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో తనపైగల పెండింగ్ కేసుల వివరాలను ఆయన వెల్లడించడంలో విఫలమయ్యారని, దీనిపై విచారణను ఎదుర్కొనాలని 2019లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.
* జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట దేవేంద్ర ఫడ్నవీస్ తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఎన్నికల్లో పోటీ చేసే ఇతర అభ్యర్థులపై ఈ అంశం ప్రభావం తీవ్రంగా ఉంటుందని, అందువల్ల అత్యున్నత న్యాయస్థానం 2019 అక్టోబరు 1న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించవలసిన అవసరం ఉందని చెప్పారు.
* బోంబే హైకోర్టు గతంలో దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఈ కేసులో క్లీన్‌చిట్ ఇచ్చింది. ప్రజా ప్రాతినిథ్య చట్టం క్రింద ఆయనపై మోపిన నేరానికి విచారణను ఎదుర్కొనవలసిన అవసరం లేదని పేర్కొంది. ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు గత ఏడాది రద్దు చేసింది.
* క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ మరో ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నారు. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా భారత జట్టు ఆటగాళ్లు లిటిల్ మాస్టర్‌ను తమ భుజాలపై ఎత్తుకున్న ఘటన ఎప్పటికీ అపురూపమే. ఇందుకు గాను సచిన్.. లారస్ స్పోర్టింగ్ మొమెంట్ 2000-2020 అవార్డును గెలుచుకున్నారు. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో ధోనీ.. శ్రీలంక పేసర్ కులశేఖర బౌలింగ్‌లో భారీ సిక్స్ బాది జట్టును రెండోసారి విశ్వవిజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. అప్పుడు భారత ఆటగాళ్లంతా సచిన్‌ను తమ భుజాలపై ఎత్తుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో లారస్ స్పోర్టింగ్ అవార్డుల ప్రదానోత్సవంలో సచిన్‌కు అత్యధిక ఓట్లు రావడంతో అతడిని విజేతగా ప్రకటించారు. ప్రముఖ ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌వా ఈ సందర్భంగా లిటిల్ మాస్టర్‌కు ట్రోఫీని అందజేశారు. అనంతరం సచిన్ మాట్లాడుతూ.. నాటి ఆనందాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ‘అదో అత్యద్భుతం. ప్రపంచకప్ గెలవడమనేది మాటల్లో చెప్పలేనిది. ఎలాంటి భేధాభిప్రాయాలు లేకుండా అందరూ కోరుకునే ఇలాంటి ఘటనలు ఎన్ని సార్లు జరుగుతాయి? ఎప్పుడో ఒకసారి అలా జరుగుతుంది. దానికి దేశం మొత్తం సంబరాలు చేసుకుంటుంది. క్రీడలు మన జీవితాల్లో ఎంత విశేషమో ఈ ఘటన గుర్తుచేస్తుంది. ఇప్పటికీ ఆ మధురజ్ఞాపకం నాతోనే ఉంది’ అని సచిన్ పేర్కన్నారు.
*దేశ రాజధాని డిల్లీలో ఎన్సీఆర్ లో అప్పుడే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే ఈ ఏడాది అత్యధికంగా 45 డిగ్రీలు సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు చేరుకోనున్నాయని అన్నారు.
* చైనా దేశంతో పాటు పలు ప్రపంచ దేహ్సల్లో ప్రబలిన కోవిడ్-19 ప్రభావం వాళ్ళ భారత దేశంలో పారాసిటమాల్ టాబ్లెట్స్ ధరలు నలభై శాతం పెరిగాయని చైనా దేశంలో పారాసిటమాల్ టాబ్లెట్స్ ను ఉత్పత్తి చేసే కంపెనీలు మూతపడటంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ టాబ్లెట్స్ సప్లయి చైనాలో కొరత ఏర్పడింది.
*కరోనా వైరస్ (కొవిడ్-19) ప్రభావం విద్యుత్తు రంగంపైనా పడింది. చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఈ వైరస్ కారణంగా ఇప్పటికే పలురంగాలు ఆర్థికంగా నష్టపోతుండగా.. తాజాగా విద్యుత్తు పరికరాల తయారీ పరిశ్రమకూ ఆ సెగ తాకింది. ట్రాన్స్‌ఫార్మర్ల(డీటీఆర్) తయారీలో వినియోగించే కోర్ మాగ్నటిక్ ప్లేట్లను ఎక్కువభాగం చైనా నుంచి తయారీదారులు దిగుమతి చేసుకుంటున్నారు.
*రాష్ట్రంలో మరో ఏడు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం తాత్కాలిక అనుమతి (లెటర్ ఆఫ్ ఇంటెంట్-ఎల్‌ఒఐ) జారీ చేసింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ జారీ చేసిన ఈ ఉత్తర్వులను అధికారులు సోమవారం ఆయా విద్యా సంస్థల ప్రతినిధులకు అందజేశారు. నాలుగు రోజుల క్రితం మల్లారెడ్డి మహిళా, టెక్ మహీంద్ర విశ్వవిద్యాలయాలకు ఎల్‌ఒఐలు జారీ చేశారు. చట్టంలోని నిబంధనలను పాటిస్తూ సిద్ధమైతే ఆరు నెలల తర్వాత వీటికి పూర్తిస్థాయి అనుమతి ఇస్తారు. వాగ్దేవి (వరంగల్), విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాల సైతం ప్రైవేట్ వర్సిటీ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వచ్చే వారం రోజుల్లో నిపుణుల కమిటీ వీటిని తనిఖీ చేసి, అనుమతి మంజూరుకు ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది.
*పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అథర్‌సిన్హా సోమవారం ఆకస్మికంగా బదిలీ అయ్యారు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆయనను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవలి వరకు సాధారణ పరిపాలనశాఖ బాధ్యతలు నిర్వర్తించిన ఆయనను ఈ నెల మొదటి వారంలోనే పశుసంవర్ధక శాఖకు బదిలీ చేశారు. ఒక ఉత్తర్వుకు సంబంధించి పాలనాపరమైన కారణాలతోనే ఆయన బదిలీ జరిగినట్లు తెలుస్తోంది
*పూర్వం మన పెద్దలు అవలంబించిన సంప్రదాయ పద్ధతులను మళ్లీ తీసుకురావడం ద్వారా జల సంపదను సంరక్షించుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ‘వాటర్ అండ్ వేస్ట్ మేనేజ్‌మెంట్-2020’ అనే అంశంపై హైదరాబాద్‌లో జరిగిన 2వ అంతర్జాతీయ సదస్సు, ఎక్స్‌పోను సోమవారం ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ ప్రారంభించారు.
*కేవలం 10 రోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించిన చైనా ఇప్పుడు ఆరు రోజుల్లో ఓ మాస్కుల తయారీ కర్మాగారాన్ని సిద్ధం చేయబోతోంది. కొవిడ్-19 (కరోనా) ఉద్ధృతి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. బీజింగ్‌లోని ఓ పారిశ్రామిక భవంతిని కేవలం ఆరు రోజుల్లో కర్మాగారంగా తీర్చిదిద్దనుంది. దీనిలో రోజుకు 2.50 లక్షల మాస్కుల్ని ఉత్పత్తి చేయనున్నారు. కర్మాగారం పనులు సోమవారం మొదలయ్యాయి. శనివారం నాటికి అందుబాటులోకి వచ్చేలా షిఫ్టుల వారీగా కార్మికులు పనిచేయనున్నారు.
*రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక స్థాయిలో కరెంటు డిమాండు పెరిగింది. సోమవారం ఉదయం 10.15 గంటలకు 12,137 మెగావాట్ల డిమాండు నమోదైంది. 2019లో ఇదే రోజున 8,962 మెగావాట్లతో పోలిస్తే ఈ ఏడాది 3,175 మెగావాట్లు అదనంగా పెరగడం గమనార్హం. ఇంతకుముందు రాష్ట్ర అత్యధిక డిమాండు గత ఏడాది ఆగస్టు 30న 11,808 మెగావాట్లుండగా ప్రస్తుతం ఆ రికార్డు చెరిగిపోయింది. వ్యవసాయ వినియోగం అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలోనే అదనంగా 2,254 మెగావాట్లు పెరిగింది.
*ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) తాత్కాలిక ఉపకులపతిగా ఉన్న ప్రొఫెసర్ రాజశేఖర్‌ను వెంటనే తొలగించాలని తెదేపా ఎమ్మెల్సీలు, నేతలు, విద్యార్థి సంఘం నాయకులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు విజ్ఞప్తి చేశారు. గతంలో రాజశేఖర్ అవినీతికి పాల్పడినట్లు చక్రపాణి కమిటీ, రంగయ్య కమిటీల విచారణలో రుజువైందని తెలిపారు.
*మెప్మా రిసోర్స్ పర్సన్ల(ఆర్పీ)ను కొనసాగించేందుకు ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలను నిరసిస్తూ ఉత్తరాంధ్రకు చెందిన ఆర్పీలు సోమవారం మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ముట్టడికి యత్నించారు. వీరిని పోలీసులు నిలువరించారు.
*యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిబంధనల మేరకు విశ్వవిద్యాలయాల ఉప కులపతుల(వీసీ) పోస్టుల భర్తీ జరపాలని, ఆ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. యూజీసీ నిబంధనల ప్రకారం వీసీగా నియమితులయ్యేవారు 10 సంవత్సరాలు ప్రొఫెసర్‌గా పనిచేసి ఉండాలని పిటిషనర్ విశ్రాంత ప్రొఫెసర్ వి.ఉమామహేశ్వరరావు అన్నారు. వివిధ వర్సిటీల వీసీల భర్తీకి గత నెల 27న ప్రభుత్వం జారీచేసిన ప్రకటనలో కొంత స్పష్టత లోపించిందని పేర్కొన్నారు.
*ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల పోస్టుల భర్తీకి సంబంధించి ప్రధాన రాత పరీక్షలు ఆన్‌లైన్‌లో సోమవారం ప్రారంభమయ్యాయి. 11,899 మందికి 7,649 మంది మాత్రమే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. వీరిలో 5,998(78.41%)మంది మాత్రమే హాజరయ్యారు. ఈ నెల 20 వరకు పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
*రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీలపై అమలులో ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడి బదిలీలను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే బదిలీలపై నిషేధం మళ్లీ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఒకేచోట మూడేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న వారికి, సొంత గ్రామ పంచాయతీ, సొంత మండలాల్లో పనిచేస్తున్న వారికి బదిలీలు వర్తిస్తాయి. గ్రేడ్-1 కార్యదర్శులకు అదే గ్రేడ్-1 గ్రామ పంచాయతీలకు మాత్రమే బదిలీ చేయాలి.
*రాష్ట్రంలో పలువురు నాన్‌కేడర్ ఎస్పీలకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న ఏడుగురికి పోస్టింగ్‌లు ఇచ్చి, అయిదుగురిని బదిలీచేసి వేరొకచోట పోస్టింగ్ ఇచ్చారు. విశాఖ క్రైమ్ డీసీపీగా వి.సురేష్‌బాబు, ఏసీ జాయింట్ డైరెక్టర్లుగా ఆర్.గంగాధరరావు, పి.వెంకట రవికుమార్, ఇంటిలిజెన్స్ ఎస్పీలుగా షేక్ షరీనా బేగమ్, టి.మోహనరావు, టి.గంగాధరం, డీజీపీ కార్యాలయంలోని ఏఐజీగా ఎ.వెంకటరత్నం, విజయవాడ అడ్మిన్ డీసీపీగా డి.మేరీ ప్రశాంతి, సీఐడీ ఎస్పీగా జీఆర్ రాధిక, 14వ బెటాలియన్ కమాండెంట్‌గా బి.శ్రీరామ్‌మూర్తి, అంబర్‌పేటలోని ఎస్‌ఏఆర్‌సీపీఎల్ కమాండెంట్‌గా కె.నాగరాజు, ఏసీబీ అదనపు ఎస్పీగా పి.సత్తిబాబులను నియమించారు. వెయిటింగ్‌లో ఉన్న నలుగురు అదనపు ఎస్పీలకు పోస్టింగ్‌లు, ఓ అదనపు ఎస్పీని బదిలీ చేశారు. ఇ.సుప్రజ, ఎం.రజని, ఎ.రమాదేవి, కె.చౌడేశ్వరికి వేర్వేరు చోట్ల పోస్టింగ్‌లు, కరీముల్లా షరీఫ్‌కు బదిలీ ఆదేశాలు జారీచేశారు.
*కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపేణా గత అయిదేళ్ల వ్యవధిలో రూ. 2,72,928 కోట్లను తెలంగాణ చెల్లించగా.. అందులో రూ.1,12,854 కోట్లను మాత్రమే రాష్ట్ర వాటాగా కేంద్రం తిరిగి ఇచ్చిందని పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణకు అధిక నిధులు ఇచ్చామని పార్లమెంటు వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం బాధ కలిగించిందని బుధవారం ట్విటర్లో ఆయన వెల్లడించారు.
*ప్రపంచ వాణిజ్యంలో భారతీయ వాటా పెంచేందుకు ఉత్పాదక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. హైదరాబాద్ పార్క్హయత్ హోటల్లో బుధవారం ఇంజినీర్ల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈఈపీసీ- ఇండియా) ఆధ్వర్యంలో.. 2017-18 సంవత్సరానికి దక్షిణాది విభాగ 42వ ఎగుమతుల పురస్కారాల కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు.
*విజయ డెయిరీ ఉత్పత్తులపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తామని, వాటిని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పెద్దఎత్తున విక్రయ కేంద్రాల(ఔట్లెట్లు)ను ఏర్పాటు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ మాదాపూర్ మెట్రోస్టేషన్ సమీపంలోని పశు వైద్యశాలను ఆయన పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి అధర్సిన్హా, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, విజయ డెయిరీ ఎండీ శ్రీనివాస్రావు తదితరులతో కలిసి పరిశీలించారు.
*నార్తర్న్ రైల్వే జోన్ దిల్లీ డివిజన్లో ఇంటర్లాకింగ్ పనుల కారణంగా దిల్లీ వైపు రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. న్యూదిల్లీ-హైదరాబాద్ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్ప్రెస్ (12724) ఈ నెల 28, 29 మార్చి 1 తేదీల్లో.. హైదరాబాద్-దిల్లీ (12723) మధ్య నడిచే ఎక్స్ప్రెస్ ఈ నెల 27, 28, 29 తేదీల్లో రద్దయినట్లు ద.మ.రైల్వే పేర్కొంది
*మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ విద్య మండలి (ఎంజీఎన్సీఆర్ఈ)కి సొంత కార్యాలయం సమకూరనుంది. దానికి కేంద్ర ప్రభుత్వం గచ్చిబౌలిలోని జవహర్ నవోదయ విద్యాలయ ప్రాంగణంలో అర ఎకరం స్థలం కేటాయించింది. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు చొరవతో 1995లో మండలిని హైదరాబాద్లో స్థాపించారు. అప్పటి నుంచి దానికి సొంత కార్యాలయం లేదు. ఎన్సీఆర్ఈ ఛైర్మన్ డబ్ల్యూజీ ప్రసన్నకుమార్ చొరవతో కార్యాలయం కోసం స్థలం కేటాయించారు. ఈ నెల 18న భవన నిర్మాణానికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ శంకుస్థాపన చేయనున్నారు.
*ఏపీలో శ్రీకాకుళం జిల్లా భావనపాడు ఓడరేవు నిర్మాణ ఒప్పందం నుంచి అదానీ సంస్థ వైదొలిగింది. కొద్ది రోజుల కిందట అధికారులతో జరిగిన చర్చలో సంస్థ ప్రతినిధులు ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు లేఖ ఇచ్చారు. పోర్టు నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో అదానీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. భూసేకరణలో జాప్యం కారణంగా నిర్మాణ పనులు మొదలుపెట్టలేదు.
*సివిల్ సర్వీసెస్-2020కు సంబంధించి ప్రాథమిక పరీక్ష మే నెల 31వ తేదీన జరగనుంది. ఈ మేరకు యూపీఎస్సీ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 796 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 2019లో 896 పోస్టులు ఉండగా.. ఈ దఫా ఆ సంఖ్య 100 మేరకు తగ్గడం గమనార్హం. ప్రాథమిక పరీక్షకు 8 లక్షల మంది ఔత్సాహికులు దరఖాస్తు చేస్తారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 80 వేల మంది వరకు ఉంటారు. ప్రిలిమినరీ పరీక్ష 72 నగరాల్లో జరుగుతుంది.
*కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ఈ నెల 16వ తేదీన నిర్మల్ జిల్లా భైంసాలో పర్యటించనున్నారు. ఇటీవల భైంసాలో అల్లర్లు చోటుచేసుకున్న విషయం విదితమే. సంబంధిత ఘటనలోని బాధితులను ఈ సందర్భంగా ఆయన కలవనున్నట్లు కిషన్రెడ్డి కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
*బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ఏ రోజైనా విశాఖ నుంచి పాలన ఉంటుందని గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సచివాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రోజురోజుకు అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నారని, వాటన్నింటినీ అధిగమిస్తామని చెప్పారు. నాలుగు గ్రామాల్లో భూములు కొనుగోలు చేసి, నిరుత్సాహంగా ఉన్నవారి వల్ల స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు.
ఏపీ మున్సిపల్ ఆఫీసులపై ఏసీబీ దాడులు-తాజావార్తలు
Related tags :