DailyDose

మార్కెట్ల నష్టం లక్ష కోట్లు-వాణిజ్యం

Telugu Business News Roundup Today-Indian Stock Markets Under Huge Corona Stress

*గడిచిన మూడు సెషన్లుగా నష్టాల్లో కొనసాగుతున్న భారత స్తాకంర్కెట్లు నేడు కూడా అదే ట్రెండ్ లో పయనిస్తుంది. కరోనా భయాలు వెంటాడుతూ ఉండడం, ఏజీఆర్ చెల్లింపుల అంశం టెలికం కంపెనీల ఈక్విటీలకు కుదేలు చేయడం ఆసియా మార్కెట్ల నష్టాలు వంటి అంశాల ఇన్వెస్టర్ సెంటిమెంటును కృంగ దీసాయి.
* కరోనా వైరస్ వ్యాప్ట్ ఇపై భయాలు ఇంకా స్టాక్ మార్కెట్లను వీడలేదు. కరోనా ఎఫెక్ట్స్ తో పాటు తెల్కోల వ్యవహారంతో స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల బాట పట్టాయి.
* కార్ల తయారీ దిగ్గజం మారుతీ తన ఇగ్నిస్‌ మోడల్‌లో సరికొత్త వెర్షన్‌ను నేడు మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారును ఆటోఎక్స్‌పో-2020లో ప్రదర్శనకు ఉంచింది. బీఎస్‌-6 ఇంజిన్‌తో వచ్చే ఈ కారు ప్రారంభ ధర రూ.4.89లక్షల(దిల్లీ ఎక్స్‌షోరూమ్‌లో) నుంచి రూ.6.72 లక్షల వరకూ ఉంది. ఇక ఆటోగేర్‌ వేరియంట్‌ ధర రూ.6.13లక్షల నుంచి రూ.7.19లక్షలుగా ఉంది. ఈ సరికొత్త కారు కేవలం పెట్రోల్‌ ఇంజిన్లలో మాత్రమే అందుబాటులో ఉండనుంది. లుక్స్‌లో ఈ కారులో స్వల్ప మార్పులు చేశారు. క్రోమ్‌ గ్రిల్‌, సరికొత్త బంపర్‌, స్కిడ్‌ ప్లేట్లు, దీంతోపాటు రూఫ్‌ రెయిల్స్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
*కాంట్రాక్టు పరిశోధన సేవల సంస్థ అయిన సింజెన్‌ ఇంటర్నేషనల్‌ హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో తన మొదటి దశ పరిశోధన- అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించింది. దాదాపు 52 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 150 మంది శాస్త్రవేత్తలతో రూపుదిద్దుకున్న ఈ కేంద్రాన్ని సోమవారం తెలంగాణా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్‌ వ్యవహారాల శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు
*ప్రముఖ కార్ల తయారీ సంస్థ మహీంద్రా నుంచి ఇటీవల విడుదలైన ఎక్స్‌యూవీ 300 కారు సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ కారును అత్యద్భుతమైన భద్రతా ప్రమాణాలతో రూపొందించారని పేర్కొంటూ.. గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌(కొత్త కార్ల అసెస్మెంట్‌ ప్రొగ్రామ్‌) ‘సేఫర్‌ ఛాయిస్‌’ అవార్డు ప్రకటించింది. ఇప్పటికే గత నెలలో ఎక్స్‌యూవీ 300 అడల్ట్‌, చైల్డ్‌ ఆక్యూపెంట్‌ ప్రొటెక్షన్‌ విషయంలో ఎన్‌క్యాప్‌ నుంచి 5, 4 స్టార్‌ రేటింగ్‌ పొంది అవార్డుకు అర్హత సాధించింది
*2021లోపు 700 విద్యుత్‌ వాహన(ఈవీ) ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు టాటా పవర్‌ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ ఉన్నతాధికారి వివరాలు వెల్లడించారు. దిల్లీ, ముంబయి, బెంగళూరు, పుణె నగరాల్లో ఇప్పటికే 100 ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన టాటా పవర్‌.. 2020, మార్చి కల్లా మరో 300 కేంద్రాలకు ప్రణాళికలు రచిస్తోంది.
*టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ భారత్‌లో యువతకు మరిన్ని అవకాశాలు కల్పించనుంది. నోయిడాలో సరికొత్త డెవలప్‌మెంట్‌ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సోమవారం ప్రకటించింది. భారత్‌లో ఈ సంస్థ ఏర్పాటు చేస్తున్న మూడో హబ్‌ ఇది కావడం గమనార్హం. ఇది ఇంజినీరింగ్‌, ఇన్నోవేషన్‌ హబ్‌గా సేవలు అందించనుంది. ‘‘మైక్రోసాఫ్ట్‌ ముందుగా కట్టుబడిన విధంగానే భారత్‌లోని ప్రతిభావంతులు ప్రపంచస్థాయిలో సేవలు అందించడానికి వీలుగా దీనిని నిర్మిస్తున్నాం
*ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ విభాగమైన ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఇష్యూకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి లభించింది. కంపెనీ గత ఏడాది నవంబరులో ఐపీఓ ముసాయిదా పత్రాలను సెబీ వద్ద దాఖలు చేసింది. మార్కెట్‌ వర్గాల ప్రకారం, ఈ ఐపీఓ పరిమాణం రూ.6,000 కోట్లకు పైగా ఉంటుంది. 13,05,26,798 ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో కేటాయించనుంది.
*సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా బీఎస్‌-6 నిబంధనలకు లోబడిన 125సీసీ స్కూటర్‌ బర్గ్‌మన్‌ స్ట్రీట్‌ను విపణిలోకి సోమవారం విడుదల చేసింది. దీని ధర రూ.77,900 (ఎక్స్‌- షోరూమ్‌ దిల్లీ)గా నిర్ణయించారు. కొత్త బర్గ్‌మన్‌ స్ట్రీట్‌ను ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ టెక్నాలజీ, ఇంటిగ్రేడెట్‌ ఇంజిన్‌ స్టార్ట్‌ వంటి వాటితో రూపొందించారు. ఇందులోని కిల్‌ స్విఛ్‌ తక్కువ ఉద్గారాలతో మెరుగైన ప్రయాణాన్ని అందిస్తుంది. 125సీసీ స్కూటర్‌ విపణిలో బర్గ్‌మన్‌ కొత్త ప్రమాణాలు నెలకొల్పిందని, కొత్త మోడల్‌ మరింత మెప్పిస్తుందని సుజుకీ మోటార్‌సైకిల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కోచిరో హిరావో తెలిపారు. అల్యూమినియం ఫోర్‌ స్ట్రోక్‌ సింగిల్‌ సిలిండర్‌ 124 ఇంజిన్‌ గరిష్ఠంగా 8.7 పీఎస్‌ శక్తిని అందిస్తుంది. పొడవైన సీటు, ఫ్రంట్‌ గ్లోవ్‌ బాక్స్‌, మొబైల్‌ ఛార్జింగ్‌ చేసుకునేందుకు వీలుగా డీసీ సాకెట్‌, వస్తువులను భద్రపరుచేందుకు ప్రత్యేక చోటు వంటి సదుపాయాలున్నాయి.
*రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) తొలిసారిగా ప్రారంభించిన దీర్ఘకాల రివర్స్‌ రెపో ఆపరేషన్‌(ఎల్‌టీఆర్‌ఓలు) విజయవంతమైంది. రూ.25,000 కోట్ల విలువైన మూడేళ్ల కాలావధి ఇష్యూకు ఏకంగా రూ.1.944 లక్షల కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. అధిక స్పందన లభించిన నేపథ్యంలో ప్రొ-రేటా పద్ధతిన కేటాయింపు ఉంటుందని తెలిపింది. వ్యవస్థలో శాశ్వత, భారీ ద్రవ్యలభ్యతను ప్రోదిచేయడం కోసం ఒక వైవిధ్యమైన పద్ధతిని ఎల్‌టీఆర్‌ఓ రూపంలో ఆర్‌బీఐ మొదలుపెట్టింది.
*జీఎంఆర్‌ గ్రూపు సంస్థ జీఎంఆర్‌ కమలాంగ ఎనర్జీ లిమిటెడ్‌ను సజ్జన్‌ జిందల్‌ సారథ్యంలోని జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కొనుగోలు చేస్తోంది. ఒడిశా డెంకనాల్‌ జిల్లాలో జీఎంఆర్‌ కమలాంగ ఎనర్జీ 1,050 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్క్రేంద్రాన్ని నిర్వహిస్తోంది. 2018-19లో ఈ కేంద్రం రూ.2,195 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ ప్లాంటు నుంచి ఒడిశా, బిహార్‌, హరియాణ రాష్ట్రాలు విద్యుత్తు కొనుగోలు చేస్తున్నాయి. రూ.5,321 కోట్ల విలువకు దీన్ని సొంతం చేసుకోనున్నట్లు జేఎస్‌డబ్లూ ఎనర్జీ వెల్లడించింది
*హైదరాబాద్‌కు చెందిన అకౌంటింగ్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక వ్యవహారాల నిపుణులు కే నరసింహమూర్తి నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌ఈ) బోర్డు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. మూడేళ్ల కాలానికి ఆయన ఆ పదవిలో ఉంటారని తెలిసింది. ఎన్‌ఎస్‌ఈ పాలనా వ్యవహారాలను పటిష్ఠ పరచాలని, అందులో భాగంగా నిపుణులకు బోర్డులో స్థానం కల్పించాలని ఇటీవల నిర్ణయించారు. అందులో భాగంగా కే నరసింహమూర్తిని డైరెక్టర్‌గా నియమించినట్లు సమాచారం.
*ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు (ఐఓబీ) మరోదఫా పబ్లిక్‌ ఇష్యూకు (ఎఫ్‌పీఓ- ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఇష్యూ) వెళ్లే ఆలోచనలో ఉంది. దీనిపై సంప్రదింపులు చేపట్టామని, త్వరలో డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకోవచ్చని ఐఓబీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ తెలిపారు.
*ఈ ఏడాది జీనోమ్ వ్యాలీ ఎక్స్లెన్స్ అవార్డు యూఎస్లోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పాథాలజీ, లేబొరేటరీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ కార్ల్ హెచ్. జూన్, నొవార్టిస్ సీఈఓ డాక్టర్ నరసింహన్కు లభించింది. బయోఏషియా- 2020 సదస్సు పురస్కరించుకుని ఈ అవార్డులు ప్రకటించారు. ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్ (ఫ్యాబా), తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్లో ఈ నెల 17 – 19వ తేదీల్లో ఈ సదస్సు నిర్వహించనున్నాయి.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ, వ్యాపార పొరుగు సేవల నిర్వహణ (బీపీఎమ్) రంగ ఆదాయాలు గతేడాది కంటే 8.4% వృద్ధితో 192 బిలియన్ డాలర్ల (సుమారు రూ.13.50 లక్షల కోట్ల)కు చేరొచ్చని పరిశ్రమ సంఘం నాస్కామ్ అంచనా వేస్తోంది.
*స్టార్హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ అవుట్ పేషెంట్ సేవలకు అనువైన ఆరోగ్య బీమా పాలసీని ఆవిష్కరించింది. అవుట్ పేషెంట్ సేవలు, కన్సల్టేషన్, వైద్య పరీక్షలు, మందుల బిల్లులు.. తదితర అవసరాలన్నీ ఈ పాలసీలో కవర్ అవుతాయి. 18 – 50 ఏళ్ల వారు ఈ పాలసీ తీసుకోవచ్చు.
*నాట్కో ఫార్మా అక్టోబరు- డిసెంబరులో ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.513 కోట్ల ఆదాయాన్ని, రూ.104.40 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2018-19 ఇదేకాలంలో ఆదాయం రూ.580 కోట్లు, నికరలాభం రూ.159.30 కోట్లు ఉన్నాయి. హెపటైటిస్-సీ ఔషధ విభాగానికి అనుగుణంగా లాభాలు తగ్గాయని కంపెనీ వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలల కాలానికి కంపెనీ ఆదాయం రూ.1,545 కోట్లు కాగా, లాభం రూ. 364.90కోట్లు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్పై రూ.3.50 మధ్యంతర డివిడెండ్ను బోర్డు ప్రతిపాదించింది.
*శాంసంగ్ తన గెలాక్సీ సిరీస్లో కొత్త మోడల్ ఎస్20ని ఆవిష్కరించింది. ఈ శ్రేణిలోని ఎస్20, ఎస్20+, ఎస్20 అల్ట్రా.. అన్నీ కూడా 5జీ కనెక్టివిటీతో వస్తున్నాయని కంపెనీ ప్రెసిడెంట్, మొబైల్ కమ్యూనికేషన్స్ బిజినెస్ అధిపతి టి.ఎమ్. రో పేర్కొన్నారు. ఈ మోడళ్లలో కెమేరా రెజొల్యూషన్ను పెంచినట్లు కంపెనీ చెబుతోంది.
*భారత చార్టర్డ్ డ్ అకౌంటెంట్ల సంస్థ (ఐసీఏఐ) అధ్యక్షుడిగా అతుల్ కుమార్ గుప్తా, ఉపాధ్యక్షుడిగా నిహర్ నిరంజన్ జంబుసరియా ఎన్నికయ్యారు. 2020-21 సంవత్సరానికి వీరు ఎన్నికయ్యారు. మూడు లక్షల మంది సభ్యులు, 7.20 లక్షల మంది సీఏ విద్యార్థులతో కూడిన ఐసీఏఐ ప్రపంచంలోనే అతి పెద్ద అకౌంటింగ్ సంస్థ.