Sports

1983 ప్రపంచకప్‌పై చిత్రం

1983 World Cup Kapil Dev Biopic-Deepika Look

బాలీవుడ్‌ క్యూట్‌ కపూల్‌ దీపికా పదుకొనె రణ్‌వీర్‌సింగ్‌ కలిసి నటిస్తున్న సినిమా ‘83’. 1983 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో భారత్‌ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కపిల్‌దేవ్‌ జీవితం ఆధారంగా 83 మూవీ రూపొందుతుంది. ఈ సినిమాలో కపిల్‌దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ నటిస్తుండగా.. ఆయన భార్య రోమి భాటియా(రోమి దేవ్‌) పాత్రలో దీపికా కనిపించనున్నారు. ఇప్పటికే రామ్‌ లీలా, బాజీరావ్‌ మస్తానీ, పద్మావతి వంటి చిత్రాలలో నటించిన వీరు పెళ్లి తరువాత కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇదే కావడంతో అభిమానులకు ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇటీవలే సినిమాకు సంబంధించిన రణ్‌వీర్‌ ఫస్ట్‌ లుక్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో తాజాగా దీపికాకు చెందిన ఫస్ట్‌ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు. కాగా ఈ లుక్‌ను చూస్తూ రోమి దేవి పాత్రలో దీపిక అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. అలాగే సినిమాలో కపిల్‌దేవ్‌, రోమి దేవ్‌ మధ్య అనుబంధం హైలెట్‌గా ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కబీర్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్న ఈ చి త్రం హిందీతో పాటు, తమిళం, తెలుగు వంటి ఇతర భాషల్లోనూ రూపొందుతోంది. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది.