NRI-NRT

“ఆటా” సభలకు భారీ ఏర్పాట్లు

“ఆటా” సభలకు భారీ ఏర్పాట్లు

2020 అమెరికా తెలుగు సంఘం(ఆటా) 16వ ద్వైవార్షిక మహాసభలు కాలిఫోర్నియాలోని లాస్ఏంజిల్స్ యాన్‌హెయిం కన్వెన్షన్ సెంటరులో జులై 3,4,5 తేదీల్లో నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు సాహితీ, సాంస్కృతిక, సాంప్రదాయలను ప్రతిబింబించేలా స్థానిక తెలుగు సంస్థలు లాటా, తత్వల సహకారంతో ఈ వేడుకల విజయవంతానికి స్వచ్ఛంద కార్యకర్తలు విరివిగా కృషి చేస్తున్నారని అధ్యక్షుడు భీంరెడ్డి పరమేశ్, తదుపరి అధ్యక్షుడు బూజాల భువనేశ్‌లు తెలిపారు. ఈ మహాసభలకు హాజరు కావాల్సిందిగా అందరికి ఆహ్వానాలు పంపుతున్నట్లు వారు తెలిపారు. ఈ మహాసభకు సంబందించిన ఏర్పాట్లన్నీ శరవేగంగా జరుగుతున్నాయని వారు తెలిపారు. మరిన్ని వివరాలకు www.ataconference.orgను సందర్శించవల్సిందిగా కోరారు.