Health

మృదుత్వాన్ని తీసుకువచ్చే ఆముదం

Castor Oil Helps Bringing Moisturizer To Skin

జుట్టుకు ఆముదం రాసుకోవడం గురించి తెలిసిందే. సౌందర్య సాధనంగానూ ఇది ఉపయోగపడుతుంది. సహజసిద్ధమైన ఆముదం అందించే చక్కని ఫలితాలెన్నో…
* పెదవులు బాగా పొడిబారితే రాత్రి పడుకునే ముందు కొద్దిగా ఆముదం రాయాలి.
* కనురెప్పలు రాలిపోతుంటే నిద్రపోయే ముందు కొద్దిరోజులపాటు కాస్త ఆముదం రాస్తే చక్కని ఫలితం ఉంటుంది.
* పాదాలు, అరచేతులు గరుగ్గా ఉంటే ఆముదాన్ని రాసి చూడండి. కొన్నిరోజులపాటు ఇలాచేస్తే మృదువుగా మారతాయి.
* పిరుదులు, తొడల దగ్గర సాధారణంగా కొవ్వు పేరుకుపోతుంటుంది. కాస్త ఆముదాన్ని వేడిచేసి పడుకోబోయే ముందు ఆయా ప్రాంతాల్లో రాసుకోవాలి. తరచూ ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది.
* జుట్టు బాగా ఊడిపోతుంటే కొబ్బరినూనెలో కొద్దిగా ఆముదం కలిపి వేడి చేసి తలకు పట్టించాలి. వారానికోసారి ఇలాచేస్తే జుట్టు ఊడటం తగ్గడమే కాకుండా కురులు నల్లగా నిగనిగలాడతాయి.
* ముఖం మీది మచ్చలు, ముడతలను పోగొట్టడానికీ ఆముదం ఎంతగానో తోడ్పడుతుంది.
* ఒక్కోసారి వేలికొనల దగ్గర చర్మం పొడిబారి, ఊడిపోతుంటుంది. అలాంటప్పుడు అక్కడ కొద్దిగా ఆముదం రాస్తే కొన్ని రోజులకు మృదువుగా మారుతుంది.