టాలీవుడ్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా రూపొందించిన `కబీర్‌సింగ్` సినిమాతో ఒక్కసారిగా బాలీవుడ్‌లో పాపులర్ అయిపోయింది హీరోయిన్ కియారా ఆడ్వాణీ. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు కియార తలుపు తడుతున్నాయి. ఒకవైపు వరుస సినిమాలు, మరోవైపు వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూ కియార ఫుల్ బిజీగా ఉంది.అప్పుడప్పుడు హాట్ హాట్ ఫొటోషూట్లలోనూ పాల్గొంటోంది. తాజాగా ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ కేలెండర్‌పై మెరిసింది. ఒక ఆకును ఆడ్డం పెట్టుకుని సెమీ న్యూడ్‌గా కియార గ్లామర్ విందు చేసింది. ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది.
కాక రేపుతున్న కియారా
Related tags :