WorldWonders

కూకట్‌పల్లిలో మాయలేడి…శృంగార లీలలు

Kukatpally Lady Seducing Men Over Internet

ఇంటర్నెట్‌ ద్వారా అమాయక యువకులకు వలేసి తర్వాత వారిని బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతున్న కిలేడీ బాగోతం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. స్నేహం పేరుతో యువకులను ముగ్గులోకి దించుతున్న యువతిన వారికి శారీరకంగా దగ్గరవుతుంది. ఆ బాగోతాన్ని సీక్రెట్ కెమెరాలతో రికార్డ్ చేసి ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడి అందినంత దోచుకుంటోంది. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన ఈ కిలేడీ ఓ ఛానల్ ద్వారా కేపీహెచ్‌బీ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమె చీకటి కార్యకలాపాలకు బయటపెట్టారు.
*భర్తకు విడాకులిచ్చి జల్సాలు
ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు చెందిన పతంగి మహేశ్వరి(22) అనే యువతి టెన్త్ క్లాస్ వరకే చదివింది. ప్రస్తుతం హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ పరిధి వసంత్‌నగర్‌లో తండ్రితో కలిసి నివసిస్తోంది. భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టి అతడికి దూరమైంది. జల్సాలకు అలవాటు పడిన ఆమె సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో అడ్డదారులు తొక్కింది.
*పరిచయం ముదిరి శారీరక సంబంధం
తాను బీటెక్ చదివి ఓ కార్పోరేట్ సంస్థలో పనిచేస్తున్నానని, ఇంకా వివాహం కాలేదని, ఆసక్తి గలవారు సంప్రదించాలని కొద్దిరోజుల క్రితం సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇది నమ్మిన మాదాపూర్ కావూరి హిల్స్‌కు చెందిన యువకుడు ఆమెను సంప్రదించాడు. ఇద్దరి పరిచయం కాస్తా శారీరక సంబంధం వరకు వెళ్లింది.
*హోటల్‌లో 3గంటల పాటు ఎంజాయ్
గతేడాది డిసెంబర్ 14న ఇద్దరూ కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ హోటల్‌లో మూడు గంటల పాటు ఎంజాయ్ చేశారు. ఈ సమయంలో సీక్రెట్ కెమెరా ద్వారా రాసలీలలను రికార్డ్ చేసిన మహేశ్వరి తన ఫ్రెండ్ సంతోష్‌తో కలిసి కేపీహెచ్‌బీ పోలీసుల పేరుతో బెదిరించింది. సెక్స్ వీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించడంతో ఆ యువకుడు ఐఫోన్‌తో పాటు రూ4.50లక్షలు వారికి సమర్పించుకున్నాడు.
*ఆ వీడియోలు బయటపెడతామని బెదిరింపులు
అయినప్పటికీ ఇంకా డబ్బులివ్వాలంటూ వేధించడంతో బాధితుడు కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించాడు. వారిద్దరిని ఇనార్బిట్ మాల్‌ వద్దకు రమ్మని చెప్పిన యువకుడు మహేశ్వరి, సంతోష్‌ను పోలీసులకు పట్టించాడు. డిసెంబర్ 26న నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
*కిలేడీ బాగోతాన్ని బయటపెట్టిన కేపీహెచ్‌బీ పోలీసులు
ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన మహేశ్వరి ఓ ఛానల్‌తో మాట్లాడుతూ కేపీహెచ్‌బీ పోలీసులపై తీవ్ర విమర్శలు చేసింది. వారు తనను అన్యాయంగా ఇరికించారని ఆరోపించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె బాగోతాన్ని మరోసారి బట్టబయలు చేశారు. ఆమె పట్ల జాగ్రత్తగా ఉండాలని, సోషల్‌మీడియాలో వచ్చే ప్రకటనలకు స్పందించకపోవడం మంచిదని సూచిస్తున్నారు.