కోయంబత్తూరు వీదుల్ల్లో ఒక విదేశీ మహిళా చేతులు జోడించి భిక్షాటన చేస్తున్న వైనం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఆమధ్యలో వచ్చిన తమిళ డబ్ మూవీ బిచ్చగాడు సినిమాను గుర్తుకు వచ్చే ఉదంతం ఇపుడు దర్శనమిస్తోంది. మానసిక ప్రసంతత కోసం కోయంబత్తూరుకు వచ్చిన స్వీడన్ కు చెందిన మహిళా వీధుల్లో అడుక్కోవడం అందరిని ఆశ్చర్యాన్ని గురి చేసింది. స్వీడన్ దేశానికి చెందిన కిమ్ అనే మహిళ ఒక పారిశ్రామిక వేత్త./ కొద్ది నెలల క్రితం ఆమె కోవైలోని ఈషాయేగా కేంద్రానికి చేరుకున్నారు. అక్కడి బడుగు.. బలహీన వర్గాలకు చెందిన వారికి తనకు తోచిన సాయం చేస్తున్నారు. అయినా తానూ కోరుకున్న మానసిక ప్రసంతత లభించని ఆమె కోవై వీధుల్లో భిక్షాటన చేయటం షురూ చేసారు. ఆమె ఎందుకు భిక్షాటన చేస్తుందో కారణం తెలీయటం లేదు. వీధుల్లో తిరుగుతూ కనిపించిన వారికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఆమెకు ఐదు, పది రూపాయలు ఇస్తున్నారు. అక్కడివారు. సంపన్నమైన ఆ మహిళ ఇలా ఎందుకు భిక్షాటన చేస్తున్నారో అర్ధం కావటం లేదని చెబుతున్నారు. ఒక సంపన్న విదేశీ మహిళ ఇలా వీధుల్లో భిక్షాటన చేయటం స్థానికంగా సంచలనంగా మారింది.
తమిళ వీధుల్లో స్వీడన్ మహిళ యాచకత్వం
Related tags :