Health

మహిళలు పొట్ట ఇలా తగ్గించుకోవచ్చు

How to beat bellies-Women health tips

అనేక కారణాల వల్ల చిన్నవయసులోనే ఊబకాయుల్లా మారుతున్నారు చాలామంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇలా ఎన్నో కారణాల వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి అందవిహీనంగా కనిపిస్తున్నారు. అలాంటి వారు కొన్ని చిట్కాలు పాటించి పొట్టను తగ్గించుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో త్రిఫల చూర్ణం కలిపి తాగితే కొవ్వు కరిగిపోతుంది. రోజూ ఉదయాన్నే పరిగడుపున ఉసిరి రసాన్ని తాగడం వల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడుతారు. రాత్రి పూట మెంతులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగి మెంతులను పరిగడుపున తింటే బరువు తగ్గుతారు. నీటిని ఎక్కువగా తాగుతూ ఆహారాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తీసుకుంటే మంచిది. నల్ల ఉలవలను ఉడికించి అందులో సైందవ లవణం కలిపి తీసుకోవడం వల్ల ఒంట్లోని కొవ్వు కరిగిపోతుంది. ఎక్కువ ఫైబర్‌ ఫుడ్‌, తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల పొట్ట తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. పొటాషియం సమృద్ధిగా లభించే అరటి, బొప్పాయి, పెరుగు వంటివి ఆహారంలో తీసుకుంటే పొట్టను తగ్గించడంలో సహాయపడడమే కాకుండా కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. అల్లంను తురిమి గ్రీన్‌ టీలో వేసుకొని తాగవచ్చు. అల్లం గ్యాస్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మకాయలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఎసిడిటీ తగ్గించి మొండి రోగాల్ని దూరం చేస్తుంది. ఉదయాన్నే గ్లాసెడు గోరువెచ్చని మంచినీళ్లలో అరచెంచాడు రసంలో రెండు చుక్కల తేనె కలిపి తాగాలి. ఇలా నెలరోజుల పాటు చేస్తే పొట్ట తగ్గుతుంది.