* చిత్తూరు జిల్లా మదనపల్లెలో దారుణం జరిగింది. జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఘర్షణ పడ్డారు. గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ ఆడుతున్న క్రమంలో వివాదం చెలరేగి.. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పదో తరగతి విద్యార్థి అశోక్ చనిపోయాడు. మరో విద్యార్థికి గాయాలయ్యాయి. ఐతే అక్కడ ఎలాంటి గొడవ జరగలేదని.. గ్రౌండ్‌లో ఆడుకుంటూ అతడు కుప్పకూలిపోయాడని స్కూల్ టీచర్లు తెలిపారు. ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయాడని వివరించారు. అశోక్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్కూల్‌లో జరిగిన గొడవ వల్లే.. తమ కుమారుడిని కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
* జర్మనీలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో, జరిగిన కాల్పుల్లో, 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం. నిన్న రాత్రి 10 గంటలు దాటిన తర్వాత హనావ్ నగరంలో, గుర్తు తెలియని సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. నగరం మధ్యలో ఉన్న హుక్కా సెంటర్ వద్ద తొలుత కాల్పులు జరిపిన దుండగులు ఆ తర్వాత మరో ప్రాంతానికి చేరుకుని కాల్పులు జరిపారు. తొలుత జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, రెండోసారి జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల అనంతరం దుండగులు పరారయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. దీనిని ఉగ్రఘటనగా పోలీసులు అనుమానిస్తున్నారు…
* ఆమదాలవలస రైల్వే స్టేషన్ లో, పాసింజర్ రైలు ఢీకొని వ్యక్తి మృతి. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా?. లేక ట్రాక్ దాటుతుండగా, రైలు ఢీ కొన్నదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. దర్యాప్తు చేస్తన్నరు. ఈ కారణంగా రెండు గంటలు ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నాయి…
* విశాఖ ఏవోబీలో ఓ బోటు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన కెచ్చుల సంజీవ రెడ్డి, పాంగి తులసమ్మ గల్లంతవగా. ముగ్గురు సురక్షితంగా ఉన్నారు. గల్లైంతైన వారిది. విశాఖ- తూర్పుగోదావరి- ఒడిశా సరిహద్దుల్లో గల మర్రిగూడెం. వీరంతా మర్రిగూడెం నుంచి అల్లూరు కోట వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది…
* మధురవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం తప్పిన ప్రాణాపాయం.విశాఖపట్నం నుండి తగరపువలస వైపు వెళ్తున్న కూల్డ్రింక్స్ లోడుతో ఉన్న మినీ ట్రాన్స్పోర్ట్. టైరు పేలడంతో అదుపుతప్పి బోల్తాపడింది. 16 వ నంబర్ జాతీయ రహదారిపై రెండు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్. సంఘటన స్థలానికి చేరుకున్న పీఎం పాలెం ట్రాఫిక్ పోలీసులు.
* శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత. సుడాన్ దేశస్తురాలి వద్ద 233.2 గ్రాముల అక్రమ బంగారం పట్టివేత. దుబయ్ నుండి హైదరాబాద్ వచ్చిన మహిళ. నింధితతురాలు బంగారాని వివిధ రకాలైన అభరణల రూపంలో, తయారు చేసి వేసుకున్న. షు లలో లోదుస్తులలో, బంగారం తరలిస్తుండగా, పట్టుబడింది.
* తమిళనాడు రహదారులు రక్తమోడుస్తున్నాయి. వేరువేరు ప్రమాదాల్లో 25మంది మృతి చెందారు. 30మంది గాయపడ్డారు. ఐదుగురు పరిస్థితి విషమంగా మారింది.
* జమ్ము కశ్మీర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు. వీరు ప్రయాణిస్తున్న కారు.. ట్రక్కును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. పఠాన్ కోట్ నేషనల్ హైవేపై జరిగిన ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
* మద్యం షాపు యజమాని నుంచి ప్రతీ నెలా రూ.7 లక్షలు దోపిడీ చేసేందుకు యత్నించిన కేంద్రప్రభుత్వ ఉద్యోగిని ముంబై మెరైన్ డ్రైవ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
* కాకినాడ నగరంలో లారీ డ్రైవర్ దారుణ హత్య.గుడారిగుంట లో ఇంట్లో ఉన్న నక్కా బ్రహ్మానందం అనే వ్యక్తి ని కత్తులతో నరికి చంపిన దుండగుడు.ముఖానికి మాస్క్ లు ధరించి భార్య కళ్ళెదుట భర్త ను చంపిన దుండగులు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ రప్పించి విచారణ ప్రారంభించిన పోలీసులు.సంఘటన స్థలం చెరుకుని విచారణ చేపట్టిన సర్పవరం సి.ఐ గోవింద రాజులు. కాకినాడ రూరల్ సి.ఐ. ఆకుల మురళి కృష్ణ.
* ఎస్సార్‌పురం మండలం చొక్కమడుగు వెలిగారం చెక్‌పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. రూ.10లక్షలు విలువ చేసే 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం స్మగ్లింగ్ వాహనాన్ని పోలీసులు వెంటాడారు.
* నాగర్ కర్నూల్ జిల్లాఅమ్రాబాద్ మండలం నల్లమలలోని ఫర్హాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం. ట్రాలీ ఆటో వాహనం బోల్తాపడి. నవీన్ అనే వ్యక్తి మృతి.పలువురికి తీవ్రగాయాలు.జోగులాంబ గద్వాల జిల్లా దౌదన్ పల్లి, చేనుగొనిపల్లికి చెందిన వారు. శ్రీశైలం నుంచి తిరిగి వస్తుండగా, ప్రమాదం.గాయపడిన వారిని అచ్చంపేట ఆసుపత్రికి తరలింపు…
*కాకినాడలో ఓ వ్యక్తీ దారుణ హత్యకు గురయ్యాడు. లారీ డ్రైవర్ గా పని చేస్తున్న నక్కా బ్రహ్మానందం అనే వ్యక్తిని గుదారి గుంతలో ఉన్న తన ఇంట్లో కత్తులతో నరికి చంపారు.
* మధ్యప్రదేశ్‌లో పెను విషాదం త్రుటిలో తప్పింది. 8 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్న ఓ బోటు బోల్తాపడింది. వాటర్‌స్పోర్ట్స్‌లో భాగంగా భూపాల్‌లోని బోట్ క్లబ్‌లో బోటు రేసును నిర్వహించారు. అయితే వేడుకలో పాల్గొనేందుకు ఫ్యామిలీలతో వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్లు రేసులో పాల్గొన్నారు. 8 మంది ఆఫీసర్లు ఉన్న ఓ బోటు బోల్తాపడింది. ఆ బోటులో ఉన్న వారంతా లైఫ్ జాకెట్ తొడుక్కోవడం వల్ల ప్రాణాలతో బయటపడ్డారు. రెస్క్యూ టీమ్ వెంటనే వారిని రక్షించింది.
* ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ కుమారుడు హజారీ సింగ్‌పై కేసు నమోదైంది. హజారీ సింగ్ 10 మంది అనుచరులతో కలిసి తనను కులం పేరుతో దూషిస్తూ, కొట్టారని రెవెన్యూ అధికారి రాధేశ్యామ్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఫిర్యాదుతో హజారీసింగ్‌పై ఐపీఎస్ సెక్షన్ లోని ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు బైరియా ఎస్‌హెచ్‌వో సంజయ్ త్రిపాఠి తెలిపారు. బైరియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సురేంద్రసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారనే విషయం తెలిసిందే.
* అశ్వారావుపేట పట్టణానికి చెందిన, అంజలి అనే గ్రామ దీపిక ఘరానా మోసం. డ్వాక్రా మహిళా సంఘాల పొదుపు నగదు బ్యాంక్ లో జమ చేయకుండా పరారైన అంజలి.35 లక్షల రూపాయలు కాజేసినట్లు ఆరోపణ. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన డ్వాక్రా మహిళలు…
* ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన లాయర్లే ఓ న్యాయవిద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఫిబ్రవరి 15న న్యాయవిద్యార్థిని (21)ఓ లాయర్ చాంబర్‌కు వెళ్లింది. అయితే అదే సమయంలో ఆ విద్యార్థినిపై లాయర్‌తోపాటు అతని సహచరులు అత్యాచారానికి ఒడిగట్టారు. బాధిత యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నాం. నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ఆపరేషన్ ప్రారంభించామని బహెడి ఎస్‌హెచ్‌వో పంకజ్ పంత్ తెలిపారు.
* తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అర్ధరాత్రి లారీ డ్రైవర్ దారుణహత్యకు గురయ్యాడు. గుడారిగుంటలో నివసిస్తున్న నక్కా బ్రహ్మానందాన్ని గుర్తు తెలియని దుండగుడు కత్తితో నరికి హతమార్చాడు. ముఖానికి మాస్క్ ధరించి వచ్చిన దుండగుడు… భార్య కళ్లెదుటే బ్రహ్మానందాన్ని హతమార్చి పరారయ్యాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు
* శంషాబాద్ విమానాశ్రయంలో మరో సారి భారీగా బంగారం పట్టుబడింది. రాత్రి జెడ్డా నుంచి హైదరాబాద్ వచ్చిన విమానాన్ని భద్రతా సిబ్బంది తనిఖీ చేయగా… ఓ వ్యక్తి లైఫ్ జాకెట్‌లో బంగారం బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం రూ.40లక్షల విలువైన 932 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
* ప్రకాశం బ్యారేజ్ పై నుంచి ఓ మహిళ కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అదృష్టవశాత్తు గజ ఈతగాళ్లు అక్కడే ఉండటంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. తన రెండేళ్ల పిల్లాడితో కలిసి బ్యారేజ్ పైకి వచ్చిన మహిళ ముందుగా పరిసరాలను గమనించింది.
* తమిళనాడులో గురువారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోయంబత్తూరు సమీపంలో కేఎస్‌ఆర్టీసీ బస్సు, కంటైనర్ లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సు బెంగళూరు నుంచి ఎర్నాకులం వస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
* తిహాడ్ జైల్లో నిర్భయదోషి వినయ్ శర్మ ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 16న వినయ్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది. జైలు గోడకు తల బాదుకోవడంతో అతనికి గాయాలయ్యాయి. దీంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నిర్భయ దోషుల్ని మార్చి 3న ఉరి తీయాలని ఇప్పటికే న్యాయస్థానం డెత్ వారెంట్ జారీ చేసింది.
*తాగుడుకు అలవాటుపడి, జాల్సాలు చేస్తూ నగదు, సెల్ఫోన్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
*ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న నాలుగో అంతస్తు భవనం పై నుంచి పడి సెంట్రింగ్ కార్మికుడు మృతిచెందాడు. ఈ ప్రమాదం గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
*స్వాతంత్య్ర సమరయోధుడు ఎలగందుల పాండు(90) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో చింతల్ భగత్సింగ్నగర్లోని తన స్వగృహంలో మృతి చెందారు. 1930లో ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి తాలూకా చిన్న రావులపల్లిలో స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు.
*శంషాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది.
*శంకర్ దర్శకత్వంలో కమల్హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘భారతీయుడు-2’ సినిమా చిత్రీకరణ సందర్భంగా బుధవారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శంకర్కు తీవ్రగాయాలైనట్లు తెలుస్తున్నది. చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో సెట్స్ వేస్తుండగా ఒక క్రేన్ విరిగిపడడంతో ఈ దుర్ఘటన సంభవించింది. శంకర్ వ్యక్తిగత సహాయకుడు మధు, అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ, ఆహార సరఫరాదారు చంద్రన్ మృతిచెందినట్లు సమాచారం.
*అర్ధరాత్రి 12.40 గంటలు.. అదుపు తప్పి దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో హోటల్ బయట బండిపై కూర్చుని ఉన్న ఓ వ్యక్తి పల్టీలు కొడుతూ 3మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఎర్రగడ్డ పైవంతెనపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మరవక ముందే.. మర్నాడే మరో దారుణ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి హఫీజ్పేట్లో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
*ఆమెకు అత్యంత మడి. ఏ పనిచేసినా శుచిగా, శుభ్రంగా ఉండాలి. తనతోపాటు ఇంటిల్లిపాదీ అలాగే ఉండాలనేది ఆమె పట్టు. అదే ఆమె ప్రాణాల మీదకి తెచ్చింది. కర్ణాటక మైసూరు జిల్లా మండహళ్లిలో ఈ విషాదం చోటుచేసుకుంది.
*ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. చింతగుఫా, తొండమరక అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు-డీఆర్జీ దళాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు బుధవారం బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. తొండమరక అటవీ ప్రాంతంలో డీఆర్జీ(డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్), సీఆర్పీఎఫ్, కోబ్రా జవాన్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపడుతుండగా కొంతమంది మావోయిస్టులు జవాన్లపై కాల్పులకు దిగారు.
*లోదుస్తుల్లో బంగారు ఆభరణాలు, బిస్కెట్లను తరలిస్తున్న పయాణికురాల్ని శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతాధికారులు అరెస్టు చేశారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సూడాన్ దేశానికి చెందిన ఓ మహిళ దుబాయ్ నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. ఈ క్రమంలో 233 గ్రాముల బంగారు ఆభరణాలు, బిస్కెట్లను సాక్సులు, లోదుస్తుల్లో పెట్టుకుని విమానం ఎక్కింది. విమానాశ్రయం నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో భద్రతాధికారులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అక్రమ బంగారం తరలింపు గుట్టురట్టయింది. రూ.11లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు
*చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన సంఘటనలో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం ఒకటో అదనపు జిల్లా జడ్జి వి.బాలభాస్కర్రావు బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సింగరాయపాలెం గ్రామానికి చెందిన చదరాసిపల్లి రామారావు(23) గత సంవత్సరం ఏప్రిల్లో 21 నెలల చిన్నారిని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కొణిజర్ల పోలీసులు రామారావును అరెస్ట్ చేసి, కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.
*సర్వేయర్ రూ.7 లక్షల లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. అనంత నగరవాసి ఎం.ఎస్.ప్రసాద్కు చెందిన ఓ స్థలం విషయమై వివాదం నెలకొంది. ఆయన పోలీసులను ఆశ్రయించగా వారు స్థలాన్ని సర్వే చేయించాలని సూచించారు. దీంతో ప్రసాద్ గత నెలలో సర్వే కోసం చలానా కట్టారు. అనంత నగరపాలక సంస్థ సర్వేయర్ కోటేశ్వరరావు స్థలం కొలతలు తీశారు. నివేదిక ఇవ్వడానికి రూ.10 లక్షలు లంచం ఇవ్వాలని తన సహాయకుడు శివ ద్వారా డిమాండ్ చేశారు. తాను అంత ఇవ్వలేనని ప్రసాద్ చెప్పగా రూ.7 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు.
*ఓ బ్యాంకు ఉద్యోగికి చెందిన రెండు సెల్ఫోన్లలో దాదాపు 200 అశ్లీల వీడియోలు ఉన్నట్లు ఆయన భార్య వెల్లడించడం కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడు తిరుచ్చి జిల్లాకు చెందిన ఎడ్విన్ జయకుమార్ (36) పుదుకోట్టై జిల్లాలోని ఓ బ్యాంకులో క్యాషియర్. తంజావూరుకు చెందిన మహిళ(32)తో ఆయనకు రెండున్నర నెలల క్రితం పెళ్లయింది. ఆ సమయంలో నగలు, నగదు కట్నంగా తీసుకున్నాడు. ముందు నుంచి జయకుమార్ తన భార్యతో సన్నిహితంగా ఉండటం లేదు. రాత్రిళ్లు ఎప్పుడూ సెల్ఫోన్లతో కాలక్షేపం చేసేవాడు.
* ఓపక్క తన ఇంటికి నిప్పంటుకొని తగలబడిపోతూఉంటే.. అదేమీ తెలియకుండా టీవీ సీరియల్ ను తదేకంగా చూస్తూ, దానిలోనే నిమగమైపోయిన ఓ మహిళ, ఆపై మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి సజీవ దహనమైంది. ఈ ఘటన తమిళనాడులోని తిరువొత్తియూరు సమీపంలో జరిగింది.
* కాకినాడ నగరంలో లారీ డ్రైవర్ దారుణ హత్య.గుడారిగుంట లో ఇంట్లో ఉన్న నక్కా బ్రహ్మానందం అనే వ్యక్తి ని కత్తులతో నరికి చంపిన దుండగుడు.ముఖానికి మాస్క్ లు ధరించి భార్య కళ్ళెదుట భర్త ను చంపిన దుండగులు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ రప్పించి విచారణ ప్రారంభించిన పోలీసులు.సంఘటన స్థలం చెరుకుని విచారణ చేపట్టిన సర్పవరం సి.ఐ గోవింద రాజులు. కాకినాడ రూరల్ సి.ఐ. ఆకుల మురళి కృష్ణ
క్రీడా గొడవల్లో పదో తరగతి విద్యార్థి హత్య-నేరవార్తలు
Related tags :