DailyDose

ప్రభుత్వం ఉసిగొల్పుతోంది-రాజకీయం

Telugu Political News Roundup Today-Kanna On YSRCP

* పోరంకిలోని పద్మావతి కల్యాణ మండపంలో భాజపా రాష్ట్ర శాఖ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… రాష్ట్రంలో భాజపా క్యాడర్‌పై అకారణంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. డీజీపీని కలిసినా కేసులు ఆగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలపై దాడులకు ప్రభుత్వం అండ ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ప్రభుత్వ అండతోనే దాడులు జరుగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అన్ని ధరలు పెంచి రాష్ట్ర ప్రజల రక్తం పీల్చుతున్నారని కన్నా ధ్వజమెత్తారు.భాజపా నేతలు జీవీఎల్‌ నరసింహారావు, పురంధేశ్వరి, కంభంపాటి హరిబాబు, సోము వీర్రాజు, మాణిక్యాలరావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
* పెన్షన్లను తొలగిస్తూ పేదలపై ప్రభుత్వం కక్ష సాధింపు: జేసీ
పవన్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియడం లేదని టీడీపీ పార్లమెంటు ఇన్‌చార్జ్ జేసీ పవన్‌రెడ్డి అన్నారు. పెన్షన్లను తొలగిస్తూ పేదలపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని విమర్శించారు. బతికుండగానే చనిపోయినట్లు రికార్డులో రాసి పెన్షన్లు తొలగిస్తున్నారని, ప్రభుత్వ దుర్మార్గాన్ని తట్టకోలేక ఆవేదనతో చనిపోతున్నారని ఆయన అన్నారు. వాలంటీర్లు పందికొక్కుల్లా డబ్బులు తింటూ ఇష్టం లేని వాళ్ల పేర్లు తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ల జాబితా నుంచి వికలాంగుల పేర్లు కూడా తొలగిస్తున్నారని జేసీ పవన్‌రెడ్డి మండిపడ్డారు. గరంలోని ఎర్రనేలకొట్టాకు చెందిన సుంకమ్మ కుటుంబసభ్యులను జేసీ పరామర్శించారు. బతికుండానే చనిపోయిందంటూ పెన్షన్ నిలిపివేయడంతో మనస్థాపంతో మూడు రోజుల క్రితం సుంకమ్మ మృతి చెందింది. కాగా సుంకమ్మ కుమార్తె గంగమ్మ చనిపోయిందంటూ పెన్షన్ నిలివేశారనే విషయాన్ని కుటుంబసభ్యులు పవన్ రెడ్డి దృష్టి తీసుకెళ్లారు.
* ఉద్యోగాల కోసం పట్టణాలకు వలస వెళ్లే పరిస్థితి మారాలి: లక్ష్మణ్‌
ఎంఎస్‌ఎంఈ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో ఒక జిల్లా-ఒక ఉత్పత్తిపై సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ దశా దిశ మార్చడంలో ఎంఎస్‌ఎంఈ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ఉద్యోగాల కోసం పట్టణాలకు వలస వెళ్లే పరిస్థితి మారాలన్నారు. పెందుర్తి, నిర్మల్, తాండూరు, ఖమ్మం, సిరిసిల్ల, గద్వాలలో ఎంఎస్‌ఎంఈ ప్రాజక్టులకు అనేక అవకాశాలున్నాయన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో చిన్న పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదని విమర్శించారు. పదిమంది కలిసి క్లస్టర్‌గా ఏర్పడి చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు.
* రోజా దొంగదారిన వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?: దివ్యవాణి
ఏపీఐఐసీ చైర్మన్‌ రోజాకు రాజధాని సెగ తగిలింది. గురువారం ఉదయం నీరుకొండ ఎస్‌ఆర్ఎం యూనివర్సటీ సమ్మిట్‌లో రోజా పాల్గొన్నారు. విషయం తెలిసిన రాజధాని రైతులు, మహిళలు అక్కడకు చేరుకుని సమ్మిట్ బయట ఆందోళనకు దిగారు. అమరావతికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకురాలు దివ్యవాణి మాట్లాడుతూ రాజధాని రైతులకు రోజా సమాధానం చెప్పల్సిన అవసరం ఉందన్నారు. ఒకవైపు సీఎం జగన్ దొంగదారిన వెళ్లిపోతున్నారని, ఇప్పుడు రోజా కూడా ప్రజల మధ్యలోకి రాలేక, కారు దిగకుండా దొంగదారిన వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. నవమాసాలు అంటే 9 నెలల జగన్ పాలనలో నవమోసాలు బయటకు వచ్చాయని, అందుకే ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని ఛీ కొడుతున్నారని దివ్యవాణి అన్నారు.
*సీఏఏపై బహిరంగ చర్చకు సిద్ధమా?
పౌరసత్వ సవరణ చట్టాన్ని అర్థం చేసుకోకుండా కొందరు అనవసర ఆందోళనలు కొనసాగిస్తున్నారని ఎంపీ సుబ్రమణ్య స్వామి ధ్వజమెత్తారు. సీఏఏ ముస్లింలకు వ్యతిరేకం కాదని, భారతీయ పౌరులుగా ఇక్కడ ఉంటున్న వారి పౌరసత్వం తొలగించే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టీకరించారు. సీఏఏపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన కాంగ్రెస్కు సవాల్ విసిరారు. సీఏఏ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తుందంటూ కొందరు తప్పుడు వాదన చేస్తున్నారని స్వామి విమర్శించారు. బుధవారం గచ్చిబౌలిలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సీఏఏపై ఏర్పాటుచేసిన ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రోహింగ్యాలను పాకిస్థాన్, బంగ్లాదేశ్ వాళ్లు తీసుకునేందుకు అంగీకరించడం లేదని, అక్రమంగా వారంతా భారత్లోకి ప్రవేశిస్తే ఆదుకునేందుకు మన దేశం ధర్మశాల కాదని ఆయన పేర్కొన్నారు.
*15న ఎల్బీ స్టేడియంలో భాజపా బహిరంగ సభ-హాజరుకానున్న అమిత్షా
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) మద్దతుగా వచ్చేనెల 15న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ముఖ్యఅతిధిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా హాజరుకానున్నారు. జనసేన అధినేత పవన్కల్యాణ్ను కూడా ఆహ్వానించాలని భాజపా నేతలు నిర్ణయించారు.
*తెదేపా అనుబంధ కమిటీల ఏర్పాటుకు కసరత్తు
తెలుగుదేశం పార్టీ అనుబంధ కమిటీల కార్యవర్గాల ఎంపికకు సంబంధించి బుధవారం ఎన్టీఆర్ భవన్లో సమావేశం నిర్వహించారు. పార్టీ నేతలు రావుల చంద్రశేఖరరెడ్డి, అరవిందకుమార్గౌడ్, రమావత్ లక్ష్మణ్ నాయక్, ఎన్.నర్సిరెడ్డి, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారని మీడియా కార్యదర్శి ప్రకాష్రెడ్డి తెలిపారు. జిల్లాలవారీగా ఈ కమిటీలకు అర్హులైన వారి జాబితాలపై చర్చించారు. పదిరోజుల్లో వీటిని ప్రకటించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
*వివక్షకు గురవుతున్న ప్రభుత్వోద్యోగులు-జీవన్రెడ్డి విమర్శ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వోద్యోగులు వివక్షకు గురవుతున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి ఆరోపించారు. పీఆర్సీ వేసి 20 నెలలు గడుస్తున్నా ఇంతవరకూ మధ్యంతర భృతి ఇవ్వలేదన్నారు. ఆయన బుధవారం సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో పది జిల్లాల్లో పనిచేసిన ఉద్యోగులను ఇప్పుడు 33 జిల్లాల్లో పనిచేయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంతవరకూ గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న సీఎం దాన్ని అమల్లోకి తీసుకురాలేదన్నారు.
*యూఐడీఏఐ అధికార దుర్వినియోగానికి పాల్పడింది: అసదుద్దీన్ ఒవైసీ
పలువురికి నోటీసులు జారీచేయడంపై విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)ను ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తప్పుపట్టారు. ఈ విషయంలో యూఐడీఏఐ నిబంధనలు పాటించలేదని.. అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజల్లో భయాందోళనలు నింపిందని పేర్కొన్నారు. పౌరసత్వాన్ని తనిఖీ చేసే అధికారం అసలు ఆ సంస్థకు లేదన్నారు. ఆ 127 మంది జాబితాలో ఎంత మంది దళితులు, ముస్లింలు ఉన్నారో తెలంగాణ పోలీసులు, యూఐడీఏఐ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అసలు భారతదేశంలో నివసించే పౌరుల సమాచారాన్ని అడిగి తెలుసుకునే అధికారం ఎవరు.. ఎవరికి.. ఇచ్చారంటూ ట్విటర్ వేదికగా అసదుద్దీన్ ప్రశ్నించారు.
*సీఏఏపై బహిరంగ చర్చకు సిద్ధమా?
పౌరసత్వ సవరణ చట్టాన్ని అర్థం చేసుకోకుండా కొందరు అనవసర ఆందోళనలు కొనసాగిస్తున్నారని ఎంపీ సుబ్రమణ్య స్వామి ధ్వజమెత్తారు. సీఏఏ ముస్లింలకు వ్యతిరేకం కాదని, భారతీయ పౌరులుగా ఇక్కడ ఉంటున్న వారి పౌరసత్వం తొలగించే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టీకరించారు. సీఏఏపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన కాంగ్రెస్కు సవాల్ విసిరారు. సీఏఏ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తుందంటూ కొందరు తప్పుడు వాదన చేస్తున్నారని స్వామి విమర్శించారు. బుధవారం గచ్చిబౌలిలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సీఏఏపై ఏర్పాటుచేసిన ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రోహింగ్యాలను పాకిస్థాన్, బంగ్లాదేశ్ వాళ్లు తీసుకునేందుకు అంగీకరించడం లేదని, అక్రమంగా వారంతా భారత్లోకి ప్రవేశిస్తే ఆదుకునేందుకు మన దేశం ధర్మశాల కాదని ఆయన పేర్కొన్నారు.
*ప్రజా చైతన్య యాత్రలో చంద్రబాబు పిలుపు
వైకాపా ఆధ్వర్యంలో రాష్ట్రంలో నవ‘మోసాల’ పాలన జరుగుతోందని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఏ ప్రభుత్వానికీ రానంత వ్యతిరేకత జగన్మోహన్రెడ్డి పాలనపై వచ్చిందన్నారు. దానికి కారణం ఆయన అహంకారపూరిత మనస్తత్వం, కక్ష, అర్థంలేని నిర్ణయాలేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి కూడా ఏనాడూ పరిధులు దాటలేదని అన్నారు. ఒక్క అవకాశం ఇస్తే ఏం పోతుందన్న సానుభూతితో జగన్కు ఓట్లేసిన ప్రజలకు అసంతృప్తే మిగిలిందని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా మార్టూరులో బుధవారం ఆయన ప్రజా చైతన్య బస్సు యాత్రను ప్రారంభించారు. దారిలో మేదరమెట్ల, మద్దిపాడు, ఒంగోలు వద్ద జరిగిన సభల్లో మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడదామని ప్రజలకు పిలుపునిచ్చారు.
*తెదేపా ప్రచారాలతో ఐటీకి నష్టం-ఐటీ, పరిశ్రమల మంత్రి గౌతంరెడ్డి
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెదేపా చేస్తున్న అసత్య ప్రచారాలతో ఐటీ సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. విశాఖ ఐటీహిల్స్ ఇన్నోవేషన్ సెంటర్లో బుధవారం ఐటీ సంస్థల సీఈవోలతో సమీక్ష నిర్వహించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెదేపా మాటల వల్ల ఐటీ ఉద్యోగుల్లో అభద్రతాభావం నెలకొందని ఆయా సంస్థల ప్రతినిధులు చెప్పారన్నారు. తమ ఉద్యోగాలు ఉంటాయో, లేదో తెలియక భయపడుతున్నారన్నారు. ప్రభుత్వపరంగా వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించడం లేదని చెప్పారు.
*అధికారులపై ఒత్తిడి పెంచుతున్న ప్రభుత్వం: లోకేశ్
అమరావతిని కాదని రాష్ట్రంలో మూడు ముక్కల రాజధాని ఏర్పాటు చేస్తామనటం సరైందా కాదా అని చర్చించే అవకాశం కూడా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు వైకాపా ప్రభుత్వం ఇవ్వడం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరిలో ప్రజాచైతన్య యాత్రను ప్రారంభించిన సందర్భంగా లోకేశ్ మాట్లాడారు. ఒక జూనియర్ అధికారి మండలి ఛైర్మన్ రాసినదాన్ని వెనక్కి పంపారంటే ఈ ప్రభుత్వం అధికారులపై ఎంత ఒత్తిడి తెస్తుందో ప్రజలకు అర్థమవుతోందని అన్నారు.
*మండలి కార్యదర్శిపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం-తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్
శాసన మండలి చైర్మన్ ఆదేశాల మేరకు పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను మండలి కార్యదర్శి సెలక్ట్ కమిటీలను నియమించకుంటే వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సభాహక్కుల ఉల్లంఘన కింద తీర్మానం పెట్టి చర్యలు తీసుకుంటామని తెదేపా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. విజయవాడలోని ఛైర్మన్ స్వగృహంలో షరీఫ్ను ఆయన బుధవారం కలిసి సన్మానించారు.
*4 నియోజకవర్గాలకు తెదేపా ఇన్ఛార్జులు
4 నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జులను తెదేపా అధినేత చంద్రబాబు బుధవారం నియమించారు. ఏలూరుకు ఇన్ఛార్జిగా బడేటి రాధాకృష్ణయ్య(చంటి)ని, గుడివాడకు రావి వెంకటేశ్వరరావు, బాపట్లకు వేగేశ్ననరేంద్రవర్మ, మాచర్లకు కొమ్మారెడ్డి చలమారెడ్డిని నియమించారు.
*ప్రజల ప్రాణాలు తీసే విధంగా ప్రభుత్వ విధానాలు: కళావెంకటరావు
ప్రభుత్వ సంక్షేమ విధానాలు ప్రజల ప్రాణాలు తీసే విధంగా తయారయ్యాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు ఆరోపించారు. బుధవారం కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం జబర్లపూడిలో మృతి చెందిన వృద్ధురాలు గుడివాడ సుబ్బలమ్మ(75) భౌతికకాయాన్ని కళాతోపాటు జిల్లా తెదేపా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్లు సందర్శించి నివాళులర్పించారు. పింఛను నిలిపివేయడంతో మనస్తాపానికి గురై సుబ్బలమ్మ మృతి చెందడం బాధాకరమన్నారు.
*కార్యదర్శిపై చర్య తీసుకునే అధికారం మండలికి ఉంది-యనమల స్పష్టీకరణ
శాసనమండలి ఛైర్మన్ ఇచ్చిన రూలింగ్ని, ఆదేశాల్ని ధిక్కరిస్తే అధికారులు సహా ఎవరైనా శిక్షార్హులేనని మండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై సెలక్ట్ కమిటీలను నియమించాలన్న ఛైర్మన్ ఆదేశాలను ఉల్లంఘించిన శాసనసభ కార్యదర్శికి సభాధిక్కారం కింద నోటీసు ఇచ్చేందుకు, శిక్షించేందుకు మండలికి అన్ని అధికారాలు ఉన్నాయని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘కార్యదర్శిని అరెస్ట్ చేయాలని నేను అన్నట్టుగా కొందరు ప్రచారం చేస్తున్నారు. అది వాస్తవం కాదు. సభ నిర్ణయాన్ని సభ్యులు సహా ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదు. ఛైర్మన్ ఇచ్చిన రూలింగ్ సభ నిర్ణయం కిందే లెక్క’’ అని ఆయన తెలిపారు. సిబ్బందిని నియమించేది గవర్నరే కాబట్టి.. తన ఆదేశాల్ని ధిక్కరించిన అధికారులపై చర్యలు తీసుకోవలసిందిగా శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ ఆయనను కలసి విజ్ఞప్తి చేశారని యనమల పేర్కొన్నారు