WorldWonders

హిమాచల్ శివుడికి ధుమపానమే నైవేద్యం

HImachal Pradesh Shiva Takes Cigarettes As Offering

దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్‌ జిల్లాలో మాత్రం వింత ఆచారం ఉంది. జిల్లాలోని లూట్రా మహాదేవ్‌ ఆలయంలో కొలువైన శివుడికి ఇతర ఆలయాల కంటే భిన్నంగా సిగరెట్లతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆ సిగరెట్లను అక్కడి శివలింగంపై ఉంచగానే వాటంతట అవే వెలుగుతాయన్నది భక్తుల విశ్వాసం.