Fashion

శివరాత్రికి స్పెషల్ సాదా ఫ్యాషణ్

Telugu Festival Fashion-Sivaratri Special Silk Saree Fashion

బ్రహ్మమురారి సురార్చిత లింగం.. అంటూ ఆ దేవదేవుడిని పూజించే రోజు రానే వచ్చింది.. మహా శివరాత్రి సందర్భంగా.. భక్తిగా దేవుడిని కొలుస్తారు.. పైగా వచ్చేదంతా పెండ్లిళ్ల కాలం.. ఈ సందర్భంలో మనసు పట్టు కట్టాలని ఆశపడుతుంది.. గుడికైనా.. ఇంట్లోనైనా పట్టుదే ప్రథమస్థానం.. అందుకే గద్వాల్‌ పట్టుచీరలు మీకోసం..
1. ఎర్రని గద్వాల్‌ పట్టుకి క్లాసిక్‌ బ్లూ బార్డర్‌ క్లాసిక్‌ టచ్‌ ఇచ్చింది. అక్కడక్కడా గోల్డెన్‌, సిల్వర్‌ జరీ బుటీస్‌ వచ్చాయి. ఒక వైపు చిన్న బార్డర్‌,మరో వైపు పెద్ద బార్డర్‌ వచ్చి మరింత కళగా కనిపిస్తున్నది. బ్లూ కలర్‌ పల్లూ మీద గోల్డెన్‌ జరీ డిజైన్‌ సూపర్‌గా కనిపిస్తున్నది. బ్లూ కలర్‌ సిల్క్‌ బ్లౌజ్‌ మీద గోల్డెన్‌ జరీ బుటీస్‌ వచ్చాయి. వర్క్‌ ఏమీ చేయకుండా సింపుల్‌గా బ్లౌజ్‌ని డిజైన్‌ చేశాం.
2. నల్లని రంగు చాలా క్లాస్‌గా కనిపిస్తుంది. నల్లని గద్వాల్‌ పట్టుకి ఎర్రని జరీ బార్డర్‌ సరిగ్గా సరిపోయింది. దీని మీద టెంపుల్‌ బార్డర్‌ చూడచక్కగా మెరిసిపోతున్నది. ఎర్రని పల్లూ మీద వచ్చిన నెమలి డిజైన్‌, ఫుల్‌ జరీ డిజైన్‌ రాయల్‌ లుక్‌ తెచ్చింది. చీర మొత్తం అక్కడక్కడా గోల్డెన్‌ జరీ బుటీస్‌ వచ్చాయి. నల్లని సిల్క్‌ బ్లౌజ్‌ మీద గోల్డెన్‌ జరీ, సీక్వెన్స్‌తో వర్క్‌ చేశాం.
3. పర్పుల్‌ కలర్‌ గద్వాల్‌ పట్టు చీర ఇది. దీని మీద అక్కడక్కడా గోల్డెన్‌, సిల్వర్‌ జరీలతో నెమలి బుటీస్‌ వచ్చాయి. చీరకి ఆరెంజ్‌ కలర్‌ బార్డర్‌ నప్పినట్టుగా ఉంది. పైన చిన్నగా, కింద వైపు డబుల్‌ బార్డర్‌ ఆకట్టుకునేలా ఉంది. అన్నింటికి మించి ఆరెంజ్‌ మీద గోల్డెన్‌ జరీ పల్లూ అదనపు ఆకర్షణగా నిలిచింది. ఆరెంజ్‌ కలర్‌ పట్టు బ్లౌజ్‌ పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌.
4. అరుదైన కాంబినేషన్లలో ఇది ఒకటి. ఎర్రని గద్వాల్‌ పట్టుకి నెమలి బ్లూ కలర్‌ అంచు వచ్చింది. దీనిమీద కూడా ఏనుగులు, నెమళ్లు నాట్యమాడుతున్నాయి. డబుల్‌ బార్డర్‌, కింద పర్పుల్‌ కలర్‌ డిఫరెంట్‌ లుక్‌ని తెచ్చింది. పల్లూ కూడా రిచ్‌గా వచ్చింది. అక్కడక్కడా సిల్వర్‌, గోల్డెన్‌ నెమళ్ల బుటీస్‌ వచ్చాయి. బ్లౌజ్‌ మొత్తానికి కాంట్రాస్ట్‌ తీసుకున్నాం. తెల్లని పట్టుకి గోల్డెన్‌ జరీతో గళ్ల డిజైన్‌ వచ్చింది. దీన్ని బ్లౌజ్‌గా ఎంచుకున్నాం.
5. సింపుల్‌గా మెరిసిపోయేందుకు ఈ చీర కట్టాల్సిందే! ఆకుపచ్చని గద్వాల్‌ పట్టుకి పింక్‌ కలర్‌ బార్డర్‌ వచ్చింది. ఈ బార్డర్‌కి కింద పైన చిన్న గోల్డెన్‌ జరీ బార్డర్‌, ఆపైన టెంపుల్‌ బార్డర్‌ చీర అందాన్నిరెట్టింపు చేసింది. పల్లూ కూడా సింపుల్‌గా వచ్చింది. దీనికి ఆకుపచ్చని సిల్క్‌ బ్లౌజ్‌ ఎంచుకున్నాం. మొత్తం సీక్వెన్‌, జర్దోసీతో హెవీగా డిజైన్‌ చేశాం.

Image result for indian silk saree for festivals