పాము సందేహానికి, భయానికి సంకేతం అంటుంది భరద్వాజుని స్వప్నశాస్త్రం. ఆ శాస్త్ర ప్రకారం చింతిత స్వప్నం, వ్యాధిజ స్వప్నం, యాదృచ్ఛిక స్వప్నం అని స్వప్నాలు మూడు విధాలు. ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామో అవే కలలోకి వస్తాయి. శరీరంలో ఏదైనా జబ్బు ఉన్నప్పుడు రోజూ ఒక్కోతరహా కల వస్తూనే ఉంటుంది. ఇవి రెండూ ఫలించవు. మూడోదైన యాదృచ్ఛిక స్వప్నానికి సరైన ఉదాహరణ రామాయణంలో త్రిజట స్వప్నం. ఎక్కడి నుంచో వచ్చిన కోతి లంక తగలబెట్టిందంటూ త్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతాన్ని చెట్టుపై నుంచి విని, హనుమ అదే నిజం చేశాడు. అందుచేత అనుకోకుండా వచ్చిన కలలే నిజమవుతాయి.
కలలో పాము కనిపించిందా?
Related tags :