Movies

ఉగాదికి అమృతం-2

Amrutham-2 Starting In Zee5 From Ugadhi 2020

బుల్లితెర ప్రేక్షకులకి డబుల్‌ వినోదాన్ని పంచిన సక్సెస్‌ఫుల్‌ సీరియల్‌ అమృతం. ఇప్పుడు ఈ సీరియల్‌కి సీక్వెల్‌ రానుంది. ఉగాది సందర్భంగా మార్చి 25 నుండి జీ5లో ప్రసారం కానుంది. అమృతం ద్వితీయం పేరుతో ప్రసారం కానున్న ఈ సీరియల్‌కి మూర్ఖత్వానికి మరణం లేదు అనే క్యాప్షన్ పెట్టారు. సందీప్‌ డైరెక్షన్‌లో రూపొందనున్న అమృతం ద్వితీయంకి గంగరాజు డైలాగులు రాస్తున్నారు. ఇక ప్రధాన పాత్రలు అయిన అమృతం, అంజి, సర్వం, అప్పాజీలుగా హర్షవర్ధన్, ఎల్భీ శ్రీరామ్‌, వాసు ఇంటూరీ, శివ నారాయణ కనిపించనున్నారు. అంజీగా ఇన్నాళ్ళు అలరించిన గుండు హనుమంతరావు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఆయన పాత్రకి ఎల్భీ శ్రీరామ్‌ బెస్ట్‌ అని భావించి ఫైనల్‌ చేసినట్టు తెలుస్తుంది. మనసులని హత్తుకునే అమృతం సీక్వెల్‌ని కూడా ఆనందించండి.