జపాన్ నౌకలో చిక్కుకుపోయిన భారతీయుల్లోమరో నలుగురికి కరోనా వైరస్ సోకింది. ఈ నలుగురు నౌక సిబ్బంది. జపాన్ లోని యోకహామ తీరంలో నిలిపి ఉన్న డైమండ్ ప్రిన్సెస్ నౌకలో ఉన్న ఇతరులతో కలిపి నిర్వహించిన పరీక్షల్లో ఈ నలుగురికి వైరస్ సోకినట్టు తెలిసింది. దాంతో, ఈ నౌకలో ఉన్న భారతీయుల్లో కరోనా బాధితుల సంఖ్య 12కు చేరిందని భారత ఎంబసీ ఆదివారం ప్రకటించింది. ఇదివరకే ఎనిమిది మంది భారతీయుల్లో వైరస్ లక్షణాలను గుర్తించారు. ఈ 12 మందికి చికిత్స అందిస్తున్నారని ఎంబసీ తెలిపింది. మరోవైపు నిర్బంధ గడువు ముగియడంతో వైరస్ లక్షణాలు లేని ప్రయాణికులను బయటకు పంపించే ప్రక్రియ మొదలు పెట్టారు. శనివారం దాదాపు 100 మందిని తరలించారు. అయినా మరో వెయ్యి మందికిపైగా ప్రయాణికులు నౌకలోనే ఉంటారని జపాన్ క్యాబినెట్ చీఫ్ సెక్రటరీ యుషిహిడె సుగా తెలిపారు.
మరో నలుగురు భారతీయులకు కొరోనావైరస్
Related tags :