కుర్తా అందం స్లీవ్స్ డిజైన్‌లో దాగి ఉంటుంది. కాబట్టి సాదాసీదా స్లీవ్స్‌కు బదులుగా వెడల్పుగా ఉండే, ‘బెల్ స్లీవ్స్’ కుట్టించుకుంటే మరింత స్టయిల్‌గా కనిపించవచ్చు. అలాంటి మోడర్న్ లుక్ తెచ్చి పెట్టే బెల్ స్లీవ్స్ కుర్తాలు ఇవే! మోచేతుల దిగువకు పొడవుగా ఉంటేనే బెల్ స్లీవ్స్ ముచ్చటగా కనిపిస్తాయి. కుర్తాతో పాటు రన్నింగ్ మెటీరియల్‌తో స్లీవ్స్ కుట్టించుకుంటే అంచుల్లో డిజైన్ ఉండేలా చూసుకోవాలి. లేదంటే కాంట్రాస్ట్ కలర్ స్లీవ్స్ కుట్టించి కుర్తా హ్యాండ్స్‌కు అటాచ్ చేయవచ్చు. స్లీవ్స్ వెడల్పు ఎంత ఉంటే బాగుంటుంది అనేది ధరించే కుర్తాను బట్టి మారుతుంది. అలాగే సన్నగా కనిపించాలనుకుంటే తక్కువ కుచ్చులతో నిండుగా కనిపించాలనుకుంటే ఎక్కువ కుచ్చులతో వెడల్పాటి బెల్ స్లీవ్స్ ఎంచుకోవాలి. బెల్ స్లీవ్స్ లేయర్స్ రూపంలో కూడా ఎంచుకోవచ్చు. భారీ లుక్ తెప్పించడం కోసం ఇదే సరైన ఎంపిక. టాప్ సాదా రంగులో ఉంటే, ఆ కుర్తాకు అదనపు ఎట్రాక్షన్ తెప్పించడం కోసం ఇలాంటి ట్రిక్ ప్లే చేయవచ్చు.
ఫుల్ స్లీవ్స్ కుర్తా అందాలు
Related tags :