ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్లు సత్తాచాటారు. గ్రీకోరోమన్ పురుషుల 57 కేజీల విభాగంలో రవి దహియా స్వర్ణం సాధించగా.. స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా (65 కేజీలు) రజతానికి పరిమితమయ్యాడు. శనివారం జరిగిన ఫైనల్ పోరులో రవి దహియ 10-0తో హిక్మతుల్లా (తజకిస్థాన్)పై విజయం సాధించగా.. బజరంగ్ 2-10తో టకూటో ఒటోగురు (జపాన్) చేతిలో ఓటమిపాలయ్యాడు. భారీ అంచనాల మధ్య బరిలో దిగిన బజరంగ్ ఆకట్టుకోలేక పోయాడు. ఓవరాల్గా శనివారం భారత్కు ఒక స్వర్ణం, మూడు రజత పతకాలు వచ్చా యి. 97 కేజీల ఫైనల్లో సత్యవర్త్ కడియాన్ 0-10 మెజ్తబా (ఇరాన్) చేతిలో ఓడగా.. 79 కేజీల ఫైనల్లో గౌరవ్ బలియాన్ 5-7తో అర్సాలన్ బుడాజపోవ్ (కిర్గిస్థాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు.
రెజ్లింగ్ స్వర్ణం గెలిచిన భారతీయ జట్టు

Related tags :