తెరాస చేసిన పాపాలను పట్టణ ప్రగతి పేరు మీద మాఫీ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తోందని మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికల కోసం పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రజలను మోసం చేసేందుకు కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ‘పట్నం గోస’ పేరు మీద కార్యక్రమం చేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తోందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత గోరేటి వెంకన్న పాడిన పాటలు నిజం అవుతున్నాయని రేవంత్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ‘పట్నం గోస’ కార్యక్రమం చేపడితే బాగుంటుందని చెప్పారు. కేసీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా అందులో రాజకీయ కోణం ఉంటుందని విమర్శించారు.
కమీషన్ల కక్కుర్తిలో తరిస్తోన్న తెరాస
Related tags :