DailyDose

ఉరిశిక్ష తీర్పు ఇచ్చిన చిత్తూరు న్యాయమూర్తి-నేరవార్తలు

Chittoor Judge Orders Minor Murderer To Be Hanged-Telugu Crime News Roundup Today

* చిన్నారి హత్య కేసులో సంచలన తీర్పు. నిందితుడు మహ్మద్ రఫీకి ఉరిశిక్ష విధించిన చిత్తూరు సెషన్స్ కోర్టు. తీర్పును వెల్లడించిన మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట హరనాధ్. పొక్సో చట్టం కింద కేసు నమోదై ఏపీలో ఉరిశిక్ష పడ్డ తొలి కేసుగా రికార్డు. గతేడాది నవంబర్ 7 న కురబలకోట మండలం చేనేత నగర్ లోని ఒక కళ్యాణ మంటపానికి తల్లిదండ్రులతో పెళ్లికి వచ్చిన చిన్నారిని అత్యాచారం చేసి హతమార్చిన దుండగుడు. చిన్నారిని హతమార్చిన మదనపల్లి మండలం బసినికొండ గ్రామానికి చెందిన లారీ క్లీనర్ మహమ్మద్ రఫీ. నిందితుడు రఫీని నవంబర్ 16న అరెస్టు చేసిన పోలీసులు. హత్య, పొక్సో చట్టం కింద రఫీపై కేసు నమోదు. పోస్టుమార్టం నివేదికను పరిశీలించి 17 రోజుల్లోనే చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు. కేసులో 41 మంది సాక్షుల విచారణ. శిక్ష ఖరారు చేసి మహ్మద్ రఫీ వాదన విన్న న్యాయమూర్తి. తన కుటుంబం దిక్కులేనిది అవుతుందని జడ్జికి చెప్పిన నిందితుడు మహ్మద్ రఫీ. చివరకు మహ్మద్ రఫీకి ఉరిశిక్ష ఖరారు చేస్తూ న్యాయమూర్తి తీర్పు.

* డిగ్రీ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగు చూసింది. గుమ్మలక్ష్మీపురం మండలం ఎస్‌కె పాడు గ్రామానికి చెందిన కడ్రక భానుమతి డిగ్రీ చదువుతుంది. ఆదివారం (నిన్న) రాత్రి భానుమతి తన తల్లి, తమ్ముడితో కలిసి గుమ్మ జాతరకి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చింది. బహిర్భూమికి వెళ్తానని చెప్పి తన ఇంటి పెరటిలో వాంతులు చేసుకోవడాన్ని గుర్తించిన తల్లి, తన కుమార్తె పురుగుల మందు తాగినట్లు గ్రహించి వెంటనే వైద్యం కోసం బద్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. పరిస్థితి విషమించడంతో ఉన్నత వైద్యం కోసం పార్వతీపురం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో భానుమతి చనిపోయింది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

* ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిపై సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్లు రాసిన నిందితుడు వెంకటేశ్వర్లును విజయనగరం జిల్లా పోలీసులు అరెస్టు చేసిన విషయం మనకు తెలుసు. ఐతే… ఫేస్‌బుక్‌లో అతను ఎందుకు ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు రాశాడన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. అసలీ వివాదం మొదలైంది 2019 అక్టోబర్‌లో. అప్పట్లో ఈ కామెంట్లు కలకలం రేపడంతో… వైసీపీ నేతలు… విజయనగరం జిల్లా… చినమేరంగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అప్పటి నుంచీ పోలీసులు… ఆ కామెంట్లు ఎవరు రాశారా అని దర్యాప్తు జరిపితే ఇవి బెంగళూరు నుంచీ రాసినట్లు టెక్నికల్ అంశాల ద్వారా తెలిసింది. అక్కడకు వెళ్లి దర్యాప్తు చేసిన పోలీసులు… ఎట్టకేలకు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు. ఇతను బెంగళూరులో ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడని తెలిపారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు అతన్ని పార్వతీపురం తీసుకెళ్లారు.

* తనతో సంసారం చేయాల్సిన భర్త మరో మగాడితో రాసలీలలు సాగిస్తుండగా ఓ భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. పెళ్లయి నాలుగేళ్లయినా భర్త తనను దగ్గరికి తీసుకోకపోయినా భరించిన ఆమె.. అతడు స్వలింగ సంపర్కుడని తెలుసుకుని భరించలేకపోయింది. అతడి బాగోతాన్ని అందరి ముందూ బయటపెట్టి పోలీసులకు పట్టించింది. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయి పట్టణానికి చెందిన ఓ యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి నాలుగేళ్ల క్రితం ఓ సంస్థలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్న యువతితో వివాహమైంది. పెళ్లయినప్పటి నుంచి అతడు భార్యతో సక్రమంగా ఉండేవాడు కాదు. జాబ్ టెన్షన్ వల్ల భర్త అలా ఉంటున్నాడేమో అనుకుని ఆమె ఓపిక పడుతూ వస్తోంది. మరోవైపు నాలుగేళ్లయినా పిల్లలు ఇంకా లేరా? అంటూ బంధువుల సూటిపోటి మాటలు అంటున్నా భర్త పరిస్థితి గురించి ఎవరికీ చెప్పుకోలేకపోయింది. నాలుగు రోజుల క్రితం ఆఫీసు నుంచి వచ్చిన ఆమెకు ఇల్లు తాళం వేసి కనిపించింది. తన దగ్గరున్న మారు కీతో తాళం తీసి లోపలికి వెళ్లగా బెడ్రూమ్‌లో చప్పుళ్లు వినిపించాయి.

* ఇఎస్‌ఐ లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ…. సిఐటియు ఆధ్వర్యంలో విజయవాడలోని ఇఎస్‌ఐ ఆసుపత్రి వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. చందాదారులైన కార్మికులు, ఉద్యోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని, ఇఎస్‌ఐ లో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ చేశారు.

* ఇంద్రవెల్లి సమీపంలో కారు. బైక్ ఢీ కొన్నాయి. బైక్‌పై ఉన్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గుంటూరు జిల్లాలో పిడుగురాళ్ళకు చెందిన ఎలుమోలు అంజి, లక్ష్మీగా గుర్తించారు. ఈ దంపతులిద్దరరూ వంట పాత్రలు అమ్ముకుని జీవిస్తున్నారు.

* ఓ జిల్లా అధికారిణికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడి వేధిస్తున్నాడు. తన కోరిక తీర్చాలని, వాట్సా్‌పలో నగ్నచిత్రాలు పంపాలని బెదిరిస్తున్నాడు. ఆమె పట్టించుకోకపోవడంతో తన నగ్నచిత్రాలు, వీడియోలను ఆమె వాట్సాప్‌ నంబర్‌కు పంపాడు. ఆ ఉన్మాది చేష్టలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు. ఆమె హైదరాబాద్‌ శివారులోని ఓ జిల్లాలో కీలకమైన విభాగంలో అధికారిణిగా పనిచేస్తున్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఆమె నివసిస్తున్నారు. గత ఏడాది ఆగస్టులో ఒక నంబర్‌ నుంచి ఆమె ఫోన్‌కు కాల్‌ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి అసభ్యంగా మాట్లాడాడు. ప్రభుత్వ ఉద్యోగి కావడం, కీలక పదవిలో ఉండటంతో ఆమె ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు జంకారు. కొద్ది రోజుల తర్వాత మూడు వేర్వేరు నంబర్ల నుంచి ఆ వ్యక్తి ఫోన్లు చేస్తూ వేధిస్తున్నాడు. అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించాడు. నగ్నచిత్రాలు, వీడియోలు పంపించకపోతే ఇంకా వేధింపులకు గురిచేస్తానని బెదిరించాడు. తాను చెన్నైలో ఉంటానని, హైదరాబాద్‌కు వచ్చేందుకు ప్రయాణ ఖర్చులు రూ.2 వేలు పంపాలని బ్యాంక్‌ ఖాతా వివరాలను ఆమెకు మెసేజ్‌ పంపాడు. ఆ వ్యక్తి వేధింపులతో తీవ్ర మనస్తాపం చెందానని, తన కుటుంబ సభ్యులు మనోవేదనకు గురవుతున్నారని భర్తతో కలిసి ఆమె రాచకొండ సైబర్‌ ఠాణాలో ఇటీవల ఫిర్యాదు చేశారు. ఐపీసీ 354డీ, 506 ఐపీసీ సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని 67, 67ఏ సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.

* కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మరో దారుణం చోటుచేసుకుంది. హోంగార్డ్ మైనర్ బాలికను 5 నెలల గర్భవతిని చేసిన ఘటన మరువక ముందే మరో ఘటన. ముక్కుపచ్చలారని 4 సంవత్సరాల చిన్నారిని పై అత్యాచారం చేసిన మైనర్ బాలుడు. విషయం బయట పడకుండా కప్పేస్తున్నారని అవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు. ఎటువంటి సమాచారం లేదన్న పోలీసులు.

* జిల్లాలో ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామన్న ముఠా మహిళలను మలేషియాలో అమ్మేసింది. ఆ మహిళలను ఐదు రోజుల పాటు బంధించి చిత్రహింసలకు గురిచేశారు. కుటుంబ సభ్యులను సంప్రదించి అతికష్టం మీద మహిళ ఇండియా చేరుకున్నారు. జరిగిన ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడానికి తాడికొండ మండలం రావెలకి చెందిన వెంకాయమ్మ అర్బన్ ఎస్పీని ఆశ్రయించింది. బందీలుగా మరికొందరు మహిళలు ఉన్నారని ఆమె పేర్కొంది. ముఠా సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆ మహిళ అర్బన్ ఎస్పీని కోరింది

* దేశ రాజధాని దిల్లీలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య మరోసారి చోటు చేసుకున్న ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో దిల్లీ పోలీస్‌ కానిస్టేబుల్‌ మృతిచెందారు. మరికొందరు పోలీసులు ఘర్షణలో గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. ఇక్కడి జఫ్రాబాద్‌ ప్రాంతంలోని మౌజ్‌పుర్‌లో రెండోరోజూ పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. స్వల్ప లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో పలు వాహనాలు, దుకాణాలు, ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఓ ఫైరింజన్‌ సైతం ధ్వంసమైందని అధికారులు తెలిపారు.