హిందీలో ప్రసారమయ్యే రియాల్టీ షో ‘బిగ్‌బాస్ సీజన్13’. సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘బిగ్‌బాస్ సీజన్13’లో పాల్గొని ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు నటి మహీరా శర్మ. అయితే బాలీవుడ్‌లో ప్రతి ఏటా వేడుకగా నిర్వహించే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ ఈ ఏడాది కూడా అట్టహాసంగా జరిగింది. ఇటీవల నిర్వహించిన ఈ వేడుకలో మహీరాశర్మ పాల్గొన్నారు. అవార్డుల కార్యక్రమం అనంతరం మహీరా.. బిగ్‌బాస్-13లో మోస్ట్ ఫ్యాషనబుల్ కంటెస్టెంట్‌గా తనకి దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు లభించిందని తెలుపుతూ.. ఓ ప్రశంసాపత్రాన్ని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. మహీరా పెట్టిన స్టోరీపై స్పందించిన అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఆమె పోస్ట్‌ను సోషల్‌మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో పలు వెబ్‌సైట్లు దీని గురించి వార్తలు రాశాయి. ఈ నేపథ్యంలో తాము మహీరాకు ఎలాంటి అవార్డును ఇవ్వలేదని దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వారు తేల్చి చెప్పేశారు. అంతేకాకుండా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ అవార్డు విలువను దెబ్బతీసేలా ఇలాంటి పనులకు పాల్పడటం మంచి పద్ధతి కాదని చెబుతూ వారు ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టారు. ‘బిగ్‌బాస్ కంటెస్టెంట్ మహీరా శర్మ ఇటీవల నిర్వహించిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులకు హాజరయ్యారు. అయితే ఫిబ్రవరి 20న రాత్రి 11.30 గంటలకు బిగ్‌బాస్ సీజన్13లో మోస్ట్ ఫ్యాషనబుల్ కంటెస్టెంట్‌గా తాను అవార్డును పొందానని చెబుతూ మహీరా తన ఇన్‌స్టా స్టోరీల్లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఎంతమాత్రం నిజం లేదు. మేము అలాంటి అవార్డు అసలు ఇవ్వలేదు. పబ్లిసిటీని పొందేందుకు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు గురించి ఈ విధంగా ప్రచారం చేయడం మంచి పని కాదు.’ అని పోస్ట్ చేశారు.
ఫేకు ఫాల్కే
Related tags :