ఇలా చేస్తే చాలు మీ పార్టనర్‌తో హ్యాపీగా టైమ్‌ని గడుపుతారు….అన్నింటికంటే బంధం అనేది చాలా ముఖ్యమైనది. ఎంత మంది ఉన్నా మనవారు మనకు ఉన్నారనే భావనే బావుంటుంది. దీంతో.. ఎలాంటి కష్టం వచ్చినా ఆ బంధం ముందు దిగదుడుపే. అందుకే ఇలాంటి బంధాలను అపురూపంగా చూసుకోవడం, వాటిని ఆస్వాదించడం చాలా ముఖ్యం. అందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలి.
*** ఆనందమైన బంధానికి..
బంధం విషయంలో చాలా మంది కూడా నిర్లక్ష్యంగా ఉంటారు. రిలేషన్‌షిప్ మొదట్లో ఉన్నంత ప్రేమగా.. రాను రాను ఉండదు. ఇలా ఇద్దరిలో ఏ ఒక్కరికి మొదలైనా మిగతావారికి కూడా దానిపై విసుగు వస్తుంది. కాబట్టి, అలా కాకుండా చూసుకోవాలి. ముందు ఉన్న ప్రేమే రాను రాను కూడా కంటిన్యూ అయ్యేలా చూసుకోవాలి. రోజుకో కొత్త విషయాన్ని నేర్చుకోండి. కొత్త రకంగా ప్రేమను చూపండి. ఆనందంగా ఉండండి.
*** పక్కవారిని పొగొడొద్దు..
రిలేషన్‌లో ఉన్నప్పుడు ఎఫ్పుడూ కూడా మన వారినే ప్రేమగా చూడాలి. వారినే ప్రేమించాలి. అంతే కానీ, కొంతమంది ప్రతి విషయంలోనూ పక్కవారిని పొగుడుతూ ఉంటారు. అలాంటి విషయాలు ఎదుటివారిని బాధపెడతాయి. కాబట్టి, అలాంటివి మీ జీవితంలో ఎదురుకాకుండా చూడాలి. దీనివల్ల సమస్యలు ఎదురవుతాయి. ఇలా మీరు ఎదుటివారిని అన్నప్పుడు వారు మీ ముందు నవ్వుతూ ఉన్నా లోలోపల బాధపడతారు, మదనపడతారు. కాబట్టి ఇలాంటివి ఎప్పుడు కూడా చేయొద్దు.
*** చెప్పినంత ఈజీ కాదు..
చాలా మంది కొన్ని విషయాలు చెబుతుంటారు. కానీ, వాటిని ఆచరించడంలో మాత్రం విఫలం అవుతారు. అందుకే, చెప్పినంత ఈజీ కాదు ఆచరణలో పెట్టడం అని చెబుతుంటారు. అందుకే, ప్రతి విషయంలోనూ మన పార్టనర్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్క విషయాన్ని వారితో పంచుకోవాలి. వారితో ప్రేమగా మెలగాలి. ఏ విషయాన్ని కూడా వారి దగ్గర దాచిపెట్టకూడదు.
*** ఇద్దరూ టైమ్ స్పెండ్ చేయండి..
చాలా మంది ఎక్కువగా వేరే పనులపై శ్రద్ధ పెట్టినట్లుగా పార్టనర్స్ విషయంలో పట్టించుకోరు. కనీసం సోషల్ మీడియాకి కేటాయించే సమయాన్ని కూడా కేటాయించరు. కానీ, ఇది ఎంత మాత్రం మంచిది కాదు. కనీసం వారితో కొద్దిగా సమయాన్ని కేటాయించాలి. అప్పుడే మీ ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. కాబట్టి, మీ పార్టనర్‌తో ఆనందాన్ని పంచుకోండి. ఇద్దరు కలిసి సమయాన్ని గడపండి. ఉదయం నుంచి జరిగిన విషయాలన్నీ పంచుకోండి. అప్పుడే మీ బంధం మరింత బలపడుతుంది.
*** గొడవపడితే..
గొడవల్లేకుండా ఎలాంటి బంధాలు ఉండవు. ఏ విషయంలోనైనా గొడవపడి మళ్లీ కలిస్తేనే ఆ బంధం బావుంటుంది. కాబట్టి, చిన్న చిన్న గొడవలు సహజమే. అంత మాత్రానే.. మొత్తమే విడిపోయినట్లుగా బాధపడాల్సిన అవసరం లేదు. ఏమైనా గొడవలు వచ్చినప్పుడు అది ఆ సమయానికే పరిమితం కావాలని.. అలా పొడిగిస్తూ పోవొద్దు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చిన్న చిన్న గొడవలను వదిలిపెట్టాలి. ఆనందంగా గడపాలి. చిన్ని చిన్న విషయానికే పెద్దగా హైరానా పడిపోతూ ఇబ్బంది పడకూడదు.