Movies

నేను చనిపోయినా బాగుండేది

Director Shankar Feels He Should Have Died

ప్రముఖ దర్శకుడు శంకర్‌, విశ్వనటుడు కమల్‌హాసన్‌ కాంబినేషల్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘భారతీయుడు-2’. ఇటీవల ఈ సినిమా సెట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చెన్నైలోని ఈవీసీ స్టూడియోలో లైటింగ్‌ కోసం సెట్‌ వేస్తున్న తరుణంలో 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్‌ తెగి చిత్రబృందం ఉండే టెంట్‌పై పడటం వల్ల శంకర్‌ వ్యక్తిగత సహాయకుడు మధు(29), అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ(34), సహాయకుడు చంద్రన్‌ మృతి చెందారు. ఈ నేపథ్యంలో తాజాగా శంకర్‌ ట్విటర్‌ వేదికగా క్రేన్‌ ప్రమాదంపై స్పందించారు. ప్రమాదం పట్ల తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన ఆ ప్రమాదం ఏదో తనకే జరిగి ఉంటే బాగుండేదంటూ పేర్కొన్నారు. ‘ఎంతో దుఖంతో ఈ ట్వీట్‌ చేస్తున్నాను. నేను ఇంకా ఆ షాక్‌లోనే ఉన్నాను. ఆ ప్రమాదంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ఇతర సిబ్బందిని కోల్పోవడం నాకెంతో బాధగా ఉంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి నిద్రలేని రాత్రులను గడుపుతున్నాను. త్రుటిలో క్రేన్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నాను. ఆ క్రేన్‌ నా మీదే పడి ఉంటే బాగుండేదనిపిస్తుంది. సదరు కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.’ అని శంకర్‌ పేర్కొన్నారు.