* దేశీయ మార్కెట్లు బుధవారం వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో నమోదవుతున్నాయి. ఉదయం 9.55 గంటల సమయంలో సెన్సెక్స్ 176 పాయింట్లు నష్టపోయి 40,004 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 84 పాయింట్లు దిగజారి 11,713 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 71.94 వద్ద కొనసాగుతోంది. కరోనా భయాలతో అంతర్జాతీయ మార్కెట్లు ఆచితూచి వ్యవహరిస్తుండడంతో ఆ ప్రభావం దేశీయ సూచీలపై కూడా పడినట్లు కనిపిస్తోంది. కొవిడ్-19 విశ్వవ్యాప్త సాంక్రమిక వ్యాధిగా రూపాంతరం చెందితే ప్రపంచ జీడీపీలో ఒక ట్రిలియన్ డాలర్ల సంపద తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ అంచనా వేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లు కుదుపులకు లోనవుతున్నాయి. హెచ్‌యూఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కంపెనీల షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. టాటా మోటార్స్, సన్ ఫార్మా, హిందాల్కో, విప్రో, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.
* దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం వరుసగా నాలుగో రోజూ నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంతోనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 40వేల మార్కును దిగజారడం గమనార్హం. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 392 పాయింట్లు నష్టపోయి.. 39,888 వద్ద ముగిసింది. నిఫ్టీ 119 పాయింట్లు నష్టపోయి 11,678 వద్ద ముగిసింది. యూఎస్ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.71.62 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా కరోనా భయాలు కొనసాగుతున్నాయి. ఆ ప్రభావమే దేశీయ మార్కెట్లపై పడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. నిఫ్టీలో యస్ బ్యాంకు, భారతీ ఇన్‌ఫ్రాటెల్, ఎస్బీఐ, బ్రిటానియా, హెచ్‌సీఎల్ షేర్లు లాభాల్లో పయనించగా.. గెయిల్, సన్‌ఫార్మా, టాటా మోటర్స్, మారుతీ సుజుకీ, హిందాల్కో షేర్లు నష్టాల్లో ముగిశాయి.
* దశాబ్దకాలంగా మాస్టర్‌కార్డ్‌కు సీఈఓ, ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అజయ్ బంగా.. వచ్చే ఏడాది నుంచి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త ప్రెసిడెంట్, సీఈఓగా మైఖేల్ మిబాక్‌ను మాస్టర్‌కార్డ్ ప్రకటించింది. ప్రస్తుతం చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్‌గా మైఖేల్ విధులు నిర్వహిస్తున్నారు. సీఈఓగా ఆయనను ఏకగ్రీవంగా బోర్డు సభ్యులు ఎన్నుకున్నారని కంపెనీ తెలిపింది. సీఈఓ హోదాలో విక్రయాలు, మార్కెటింగ్, ఉత్పత్తులు, సేవలు లాంటి బాధ్యతలను చూస్తారు. మాస్టర్‌కార్డ్ పురోగతిలో తానూ భాగమైనందుకు ఆనందంగా ఉందని, దీనిని గౌరవంగా భావిస్తున్నానని అజయ్ బంగా అన్నారు.
* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఆద్యంతం అద్భుతంగా సాగినా.. ఓ లోటు మాత్రం కొట్టవచ్చినట్లు కనిపించింది. ..అదే, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కొలిక్కిరాకపోవడం. కనీసం కొన్ని వాణిజ్యాంశాలపైనా ఇరుదేశాలు ఓ అవగాహనకు రాలేకపోయాయి. రాబోయే రోజుల్లో భారీ వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ప్రకటించడం ద్వారా ట్రంప్ ఈ లోటు తీవ్రతను కాస్త చల్లార్చే ప్రయత్నం చేశారు. దాదాపు 300 కోట్ల డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాల్ని ఖరారుచేసుకోవడం, మూడు ఎంఓయూలపై సంతకాలు చేయడం ఒక్కటే చెప్పుకోదగిన పరిణామం. వాణిజ్య విభేదాల పరిష్కారానికి రెండు దేశాలూ శ్రమిస్తున్నప్పటికీ.. ఒప్పందం ఎందుకు ఖరారు కాలేదు? ఇరువురి మధ్య అంతటి తీవ్ర విభేదాలు ఎందుకున్నాయి?
* బంగారం ధర అంతర్జాతీయ విపణిలోనూ కాస్త దిగి వచ్చింది. సోమవారం ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర 1680 డాలర్లకు చేరగా, లాభాల స్వీకరణతో మంగళవారం 1650 డాలర్లకు దిగివచ్చింది. ఇక రూపాయి కూడా 13 పైసల మేర బలపడటంతో, డాలర్ విలువ రూ.71.85కి పరిమితమైంది. ఫలితంగా దేశీయంగా మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1000 తగ్గింది. కిలో వెండి ధర కూడా రూ.1,000 మేర దిగి రావడం గమనార్హం.