Kids

నీటి అడుగున సెల్ఫీ

This indonesian lake lets you take selfies under water

సెలబ్రిటీలు, సినీతారలు, రాజకీయ ప్రముఖులకు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు ఉండడం తెలిసిందే. కానీ ఒక చిన్న సరస్సుకు ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ఉండడం చిన్న విషయం కాదు. ఇంతకీ ఈ సరస్సు ఎక్కడ ఉంది, దీని ప్రత్యేకత ఏమిటి అంటే…. ఇండోనేషియాలో మధ్య జావా ప్రాంతంలో ఉంది ‘ఉంబుల్‌ పొంగ్గాక్‌’ అనే సరస్సు. 40 మంచి నీటి ఊటల నుంచి సెకనుకు 800 లీటర్ల నీరు ఈ సరస్సులోకి ప్రవహిస్తుంది. దాంతో ఇందులోని నీరంతా తేటగా, స్వచ్ఛంగా ఉంటుంది. నీటి లోపల నుంచి చూస్తే ఈ సరస్సు అందాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అరుదైన చేపలను ఇక్కడ చూడొచ్చు. కొంత ఫీజు చెల్లిస్తే డైవింగ్‌ మాస్క్‌, బ్రీతింగ్‌ ట్యూబ్‌ ఇస్తారు నిర్వాహకులు. కొలను అడుగున బైక్‌, కుర్చీల మీద కూర్చొని ‘అండర్‌ వాటర్‌ సెల్ఫీ’ దిగుతూ కొత్త ప్రపంచాన్ని ఆస్వాదించేందుకు సందర్శకులు ఆసక్తి చూపించడంతో ఈ సరస్సు పర్యాటక ప్రాంతంగా మారింది. ఒకప్పుడు కలుషితంగా ఉన్న ఈ లేక్‌ను గ్రామస్థులు తలో చేయి వేసి శుభ్రం చేశారు.సరస్సు అడుగున సెల్ఫీ! సెలబ్రిటీలు, సినీతారలు, రాజకీయ ప్రముఖులకు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలు ఉండడం తెలిసిందే. కానీ ఒక చిన్న సరస్సుకు ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ఉండడం చిన్న విషయం కాదు. ఇంతకీ ఈ సరస్సు ఎక్కడ ఉంది, దీని ప్రత్యేకత ఏమిటి అంటే….ఇండోనేషియాలో మధ్య జావా ప్రాంతంలో ఉంది ‘ఉంబుల్‌ పొంగ్గాక్‌’ అనే సరస్సు. 40 మంచి నీటి ఊటల నుంచి సెకనుకు 800 లీటర్ల నీరు ఈ సరస్సులోకి ప్రవహిస్తుంది. దాంతో ఇందులోని నీరంతా తేటగా, స్వచ్ఛంగా ఉంటుంది. నీటి లోపల నుంచి చూస్తే ఈ సరస్సు అందాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అరుదైన చేపలను ఇక్కడ చూడొచ్చు. కొంత ఫీజు చెల్లిస్తే డైవింగ్‌ మాస్క్‌, బ్రీతింగ్‌ ట్యూబ్‌ ఇస్తారు నిర్వాహకులు. కొలను అడుగున బైక్‌, కుర్చీల మీద కూర్చొని ‘అండర్‌ వాటర్‌ సెల్ఫీ’ దిగుతూ కొత్త ప్రపంచాన్ని ఆస్వాదించేందుకు సందర్శకులు ఆసక్తి చూపించడంతో ఈ సరస్సు పర్యాటక ప్రాంతంగా మారింది. ఒకప్పుడు కలుషితంగా ఉన్న ఈ లేక్‌ను గ్రామస్థులు తలో చేయి వేసి శుభ్రం చేశారు.