Editorials

ఫిబ్రవరిలో లీపు రోజు ప్రత్యేకత ఇది

2020 Leap Year Story-What is it

Leap Year : ఈసారి ఫిబ్రవరిలో 29వ తేదీ… ఎక్స్‌ట్రా డే ఎందుకు? ఫిబ్రవరిలోనే ఎందుకు?

Leap Year : ప్రతీ నాలుగేళ్లకోసారి మనకు లీప్ ఇయర్ వస్తుంది. ఇందుకు సైంటిఫిక్ కారణాలున్నాయి. ఐతే… ఈ అదనపు రోజు ఎందుకు కలుస్తోంది? ఫిబ్రవరిలోనే ఎందుకు అన్నది తెలుసుకుందాం.

Leap Year : ప్రతీ సంవత్సరం ఫిబ్రవరిలో 28 రోజులే ఉంటాయి. అందువల్ల ఉద్యోగులు ఫిబ్రవరిలో తమకు 28 రోజులకే శాలరీ వస్తుందని, త్వరగా వస్తుందని అనుకుంటారు. అదే లీప్ ఇయర్ వస్తే… ఫిబ్రవరిలో 29వ తేదీ కూడా ఉంటుంది. అందువల్ల శాలరీపొందేందుకు మరో రోజు ఆలస్యమవుతుంది. దీనిపై నిరాశ చెందాల్సిన అవసరం లేదంటున్నారు ఆర్థిక నిపుణులు. నిజానికి ఫిబ్రవరిలో 29వ తేదీ ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. ఏడాది ఆయుష్షులో…. అదనంగా మరో రోజు జీవించినట్లే అంటున్నారు. అసలు ఈ ఎక్స్‌ట్రా డే ఎందుకుంటుందో సింపుల్‌గా తెలుసుకుందాం. మీకు తెలుసు… భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందని. ఇలా ఓ రౌండ్ తిరిగేందుకు 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు పడుతుంది. ఈజీగా చెప్పాలంటే… 365 రోజులకు తోడు మరో పావు రోజు పడుతుంది. ఆ పావు రోజును ఒక రోజుగా తీసుకోలేం కాబట్టి… ప్రతీ నాలుగేళ్లలో నాలుగు పావు రోజుల్ని కలిపి… ఒక రోజుగా మార్చి… లీప్ ఇయర్‌లో ఫిబ్రవరి నెలలో అదనపు రోజును చేర్చుతున్నారు.

ఫిబ్రవరిలోనే అదనపు రోజు ఎందుకు కలుపుతున్నారు అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఫిబ్రవరిలో 28 రోజులే ఉన్నాయి కాబట్టి కలుపుతున్నారని అనుకోవచ్చు కూడా. అది నిజమే కానీ… ఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకున్నాయన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఉంది. క్రీస్తు పూర్వం గ్రీస్, రోమన్‌లు… కేలండర్‌లో రోజుల్నీ, నెలలనూ ఇష్టమొచ్చినట్లు మార్చేసేవాళ్లు. ఉదాహరణకు రోం చక్రవర్తిగా జూలియస్ కాసర్ బాధ్యతలు స్వీకరించేటప్పటికి రోమన్ క్యాలెండర్‌‌లో ఏడాదికి 355 రోజులే ఉండేవి. ప్రతీ రెండేళ్లకూ 22 రోజులు ఉన్న ఒక నెల అదనంగా చేరేది. ఆయన ఎంటరయ్యాక… కేలండర్‌లో చాలా మార్పులు చేశారు. తద్వారా 365 రోజుల కేలండర్ వచ్చింది. అలాగే… ప్రతీ నాలుగేళ్లకూ అదనపు రోజును… ఆగస్టు నెలలో కలిపారు. ఫలితంగా అప్పట్లో ఫిబ్రవరికి 30 రోజులు, జులైకి 31 రోజులు, ఆగస్టుకు 29 రోజులు వచ్చాయి.

జూలియస్ కాసర్ తర్వాత కాసర్ ఆగస్టస్… చక్రవర్తి అయ్యాడు. ఆయన పుట్టింది ఆగస్టులో. తాను పుట్టిన నెలలో రోజులు తక్కువగా ఉండటాన్ని ఇష్టపడలేదు. ఆగస్టు నెలకు 2 రోజులు పెంచుకున్నాడు. జూలియస్ కాసర్ ఫిబ్రవరిలో పుట్టాడు కాబట్టి… ఫిబ్రవరిలో ఆ రెండు రోజులూ తగ్గించాడు. ఫలితంగా ఆగస్టుకి 31 రోజులు, ఫిబ్రవరికి 28 రోజులూ వచ్చాయి. అప్పటి నుంచీ లీపు సంవత్సరంలో 1 రోజును ఆగస్టుకి కాకుండా… ఫిబ్రవరికి కలపడం మొదలుపెట్టారు. అదీ విషయం. ఇప్పట్లో ఈ కేలండర్‌ను మార్చే ఉద్దేశాలు ప్రపంచ దేశాలకు లేవు. అందువల్ల ప్రతిసారీ లీప్ ఇయర్‌లో ఫిబ్రవరికి 1 రోజు యాడ్ అవుతుంది.