Politics

నాడు జగన్…నేడు చంద్రబాబు

Chandrababu Protests At Visakhapatnam Airport

ఎయిర్ పోర్టు ముందు బైఠాయించిన చంద్రబాబు..

రోడ్డు పై కూర్చొని నిరసన తెలియజేస్తున్న చంద్రబాబు..

చంద్రబాబు తో పాటు. అచ్చయ్యనాయుడు,అనిత అందరూ చంద్రబాబు కు మద్దతు గా రోడ్డు పై నిరసన

విశాఖ ఎయిర్ పోర్టులో హైడ్రామా…

చంద్రబాబు వెనక్కి పంపే ప్రయత్నాలు చేస్తున్న పోలీసులు..

తిరిగి చంద్రబాబు విజయవాడ కు పంపేందుకు సన్నాహాలు చేస్తున్న పోలీసులు..

పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నటు సమాచారం..

మూడున్నర గంటలుగా ఎయిర్ పోర్టు లో ఉత్కంఠం…

పోలీసుల తీరు పై చంద్రబాబు ఫైర్..

ఉత్తరాంధ్రలో ప్రజా చైతన్య యాత్రను వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ దుర్మార్గంగా తన యాత్రను అడ్డుకుంటుంటే..  పోలీసులు దానికి వత్తాసు పలుకుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజల కష్టాలు వినేందుకు విశాఖలో పర్యటించి తీరుతానని చంద్రబాబు ప్రకటించారు.  పోలీసులు అనుమతి ఉన్నా యాత్ర కూడా సాగని పరిస్థితి ఉందంటే… ఏపీలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతుందన్నారు. ‘‘ఇది శాంతి భద్రతల వైఫల్యం కాదా?, పోలీసులు ఏం సమాధానం చెబుతారు?, ఇవాళ ఎంత సమయమైనా..  విశాఖలో పర్యటన కొనసాగించి తీరుతా. ఎయిర్‌పోర్టు ముందు వైసీపీ గూండాలు గుమికూడితే.. ఏమీ చేయలేక పోలీసులు చేతులెత్తేస్తారా?, ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్ర కొనసాగిస్తా. నన్ను ఎన్‌కౌంటర్ చేసినా వెనక్కి తగ్గను’’ అని చంద్రబాబు హెచ్చరించారు.

ఉత్తరాంధ్రలో ప్రజాచైతన్యయాత్ర చేసేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. విశాఖను పరిపాలన రాజధాని చేయడాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబును ఉత్తరాంధ్రలో పర్యటించబోమని వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో… చంద్రబాబు కొన్ని గంటలుగా విశాఖ ఎయిర్ పోర్టులు సమీపంలోనే నిలిచిపోయారు. చంద్రబాబు కాన్వాయ్ ముందుకు సాగే పరిస్థితి లేకపోవడంతో… అక్కడ ఏం జరుగుతుందో అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబును పోలీసులు మళ్లీ వెనక్కి తిప్పి పంపిస్తారా ? లేక భద్రత నడుము ఆయన ముందుకు సాగుతారా ? అన్నది మరికొద్దిసేపట్లో తేలిపోయే అవకాశం ఉంది. అయితే గతంలో విశాఖలో నాటి ప్రతిపక్ష నేత జగన్‌కు ఎదురైన పరిస్థితే నేడు చంద్రబాబుకు కూడా ఎదురవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. 2017లో జరిగిన ఒక ఘటనను పలువురు గుర్తు చేస్తుకుంటున్నారు. సరిగ్గా మూడేళ్ల క్రితం 2017 జనవరి 26న విశాఖపట్టణంలో ప్రత్యేక హోదా కోసం వైసీపీ క్యాండిల్ ర్యాలీ తలపెట్టింది. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న వైఎస్ జగన్ విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఐతే ఆయన్ను అక్కడే అడ్డుకున్నారు పోలీసులు. భద్రతా కారణాల దృష్ట్యా జగన్, ఇతర వైసీపీ నేతలను అడ్డుకున్నట్లు చెప్పారు. దాంతో జగన్‌, విజయసాయిరెడ్డి, వైబీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు ఎయిర్‌పోర్టులో రన్‌వే పైనే బైఠాయించారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి హైదరాబాద్ పంపించారు. దీంతో నాడు జగన్‌ను తిప్పి పంపిన తరహాలోనే నేడు చంద్రబాబును సైతం పోలీసులు తిప్పి పంపుతారేమో అనే చర్చ జరుగుతోంది