Movies

నాకు టాలీవుడ్ మీద మనసైంది

Deepika In Love With Tollywood-Telugu Movie News

గతంతో పోల్చితే ప్రస్తుతం మన టాలీవుడ్ స్థాయి చాలా పెరిగింది. గతంలో తెలుగు సినిమాలనే కాకుండా సౌత్ భాషల సినిమాలన్నింటినీ కూడా హిందీ ఫిల్మ్ మేకర్స్, స్టార్స్ చిన్నచూపు చూసేవారు. అయితే మణిరత్నం, శంకర్, రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్స్ మన దక్షిణాది సినిమాల స్థాయిని బాలీవుడ్‌ను మించేలా చేశారు. అందుకే ఇప్పుడు పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా తెలుగులో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్స్ సౌత్ ఫిల్మ్‌మేకర్స్‌తో కలిసి పనిచేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరోిన్ దీపిక పదుకునే కూడా చేరిపోయింది.ఆమె తాజాగా ‘83’ చిత్రంలో నటించింది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో దీపిక మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో నటించాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. తెలుగు సినిమాలు నచ్చుతాయన్న దీపిక.. మహేష్ బాబు అంటే ఇష్టమని పేర్కొంది. “తెలుగులో నటించాలనుకుంటున్నాను. మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాను. మంచి కథతో వస్తే తప్పకుండా తెలుగులో నటిస్తాను. సౌత్ సినిమాల్లో నటించడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. భాషతో సంబంధం లేకుండా మంచి పాత్రలు చేయాలనేది నా ఉద్దేశ్యం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భాషతో సంబంధం లేకుండా సినిమాలు అన్ని భాషల్లో కూడా వెళ్తున్నాయి. అందుకే సౌత్‌లో కూడా నటించాలనుకుంటున్నాను” అని దీపికా పదుకునే చెప్పింది.