కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. మక్కాకు వెళ్లే భక్తులకు సౌదీ ఆరేబియా తాత్కాలిక వీసాలను రద్దు చేసింది. ఈ విషయాన్ని గురువారం ఆ దేశ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఉమ్రా, మహ్మాద్ ప్రవక్త మసీదు దర్శనం కోసం వచ్చేవారికి కొన్ని రోజుల పాటు వీసాల జారీని నిలిపివేయనున్నారు. ప్రతి నెల వేల సంఖ్యలో ముస్లిము భక్తులు ఉమ్రా దర్శనం కోసం సౌదీకి వస్తుంటారు. చైనాలో పుట్టిన కరోనా వైరస్.. మహమ్మారిగా విజఅంభిస్తోంది. దీంతో అనేక ప్రపంచ దేశాల్లో కోవిడ్ 19 మరణాలు సంభవిస్తున్నాయి. కొత్త వైరస్ ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో.. వీసాల జారీని తాత్కాలికంగా నిలిపేసినట్లు సౌదీ చెప్పింది. దేశ ప్రజల రక్షణ, భద్రతల దఅష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. కరోనా ప్రబలుతున్న దేశాలకు కూడా ఎవరూ వెళ్లకూడదని దేశ ప్రజలకు సౌదీ సూచన చేసింది.
మక్కా వీసాలు తాత్కాలిక రద్దు
Related tags :