టాలీవుడ్ లో ప్రస్తుతం రష్మిక టైమ్ నడుస్తోంది. మొన్న సంక్రాంతికి మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్‌ను దక్కించుకుంది. ఇక ఇటీవల నితిన్‌తో కలిసి ‘భీష్మ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగులో పలు చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు చాలా బిజీగా ఉంది. ఇంత బిజీగా ఉంటున్న ఈ అమ్మడు త్వరలో హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకోబోతున్నట్లుగా ప్రకటించింది. ఈనేపథ్యంలో రష్మిక మాట్లాడుతూ “హైదరాబాదీ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం.ఇక్కడకు వచ్చిన కొత్తలో బిర్యానీ ఎక్కువగా తినేదాన్ని. ఇప్పటికి కూడా బిర్యానీ అంటే ఇష్టమే. కానీ నాన్ వెజ్ తినకూడదని నిర్ణయించుకున్న కారణంగా బిర్యానీ తినలేక పోతున్నాను. ఇక హైదరాబాద్ లోని కొన్ని రోడ్లు ఎంతో లగ్జరీగా ఉంటాయి. అమెరికాలో ఉన్నామా అన్నట్లుగా ఇక్కడ ఉంటుంది. ఇక హైదరాబాద్ లో నాకు చార్మినార్, గోల్కొండ చూడాలని ఉంది. హైదరాబాద్ కు వచ్చి చాలా సంవత్సరాలు అయినా కూడా వాటిని చూడడం మాత్రం కుదరడం లేదు. త్వరలోనే బుర్ఖా వేసుకుని చార్మినార్ చూసేందుకు వెళ్లాలని ఉంది. అలాగే గోల్కొండకు కూడా ఒకసారి వెళ్లి వస్తాను”అని చెప్పింది.
ఇప్పుడు రష్మిక టైమ్

Related tags :