DailyDose

ఇద్దరు కుమార్తెలతో తండ్రి ఆత్మహత్య-నేరవార్తలు

Telugu Crime News Roundup Today-Father Commits Suicide With Daughters

* తన ఇద్దరు కూతుళ్లనూ బావిలోకి తోసి తండ్రి కూడా దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కడప జిల్లా గోపవరం మండలం శ్రీనివాసపురం గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. తాళ్ల చిన్న బాలకొండయ్య తన ఇద్దరు కూతుళ్లను బావిలోకి తోసి.. తను బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాల కోసం పోలీసులు బావిలో గాలిస్తున్నారు.
* సినీ నటుడు ప్రకాష్ రాజ్ కు చెక్ బౌన్స్ కేసులో సమన్లు జారీ అయ్యాయి. ఆయన నిర్మించిన నడిగర్ అనే తమిళ సినిమా కోసం ఓ బాలీవుడ్ ఫైనాన్సియల్ వద్ద రూ. ఐదు కోట్లు అప్పుగా తీసుకున్నారు. ఇటీవల ఆయానకు ప్రకాశ రాజ్ చెక్ ఇచ్చారు. అయితే ఆ ఫైనాన్సియల్ ఆ చెక్ ను బ్యాంకులో వేయగా బౌన్స్ అవడంతో ఆయన మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.
* ప్రకాశం జిల్లా గిద్దలూరులో పేటీఎమ్ ద్వారా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఐదు మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ఐదు మంది యువకులు ఎల్ఐసి ప్రీమియం బోనస్ వచ్చిందని ధనలక్ష్మి యంత్రాలు పంపిస్తాం అంటూ ప్రజలను మభ్యపెడుతూ ఎల్ఐసి కస్టమర్లకు మీ అకౌంట్లకు బోనస్ ద్వారా వచ్చిన అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామని నమ్మించి మోసాలకు పాల్పడేవారు అని వీరు ఢిల్లీ లో ఉంటూ పేటీఎమ్ ద్వారా ఆన్లైన్ మోసాలు చేస్తున్నారని, గిద్దలూరు బస్ స్టేషన్లో అనుమానస్పదంగా సంచరిస్తుండగా ఐదు మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా సీఐ సుధాకర రావు వెల్లడించారు.
* భార్య తరుచూ ఫోన్‌లో మాట్లాడుతుందని.. ఆమెతో పాటు తన ఇద్దరు పిల్లలను హత్య చేశాడు భర్త. ఆ తర్వాత తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లోని అర్తాలా ఏరియాలో శుక్రవారం చోటు చేసుకుంది.
*తన ఇద్దరు కూతుళ్ళను బావిలోకి తోసి తండ్రి కూడా దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కడప లో తెవేర విషాదాన్ని నింపింది.
* డీఎంకే ఎమ్మెల్యే ఎస్‌. కథావరయణ్‌(58) మృతి చెందాడు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కథావరయణ్‌.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు.
* అక్రమంగా తీసుకువచ్చిన బంగారాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా కస్టమ్స్‌ అధికారులు దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద 826 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. బంగారాన్ని సీజ్‌ చేసిన అధికారులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
* ఓడీ చెరువు మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఇంటి నుంచి తప్పిపోయిందంటూ బాలిక తండ్రి శివానంద గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
* అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పెద్దఅంబర్‌పేట్‌లో పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని అశ్వారావుపేట, భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ముంబైకి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ.24లక్షలు విలువైన 120 కేజీల గంజాయి, 2 కార్లు, రూ.1200 నగదు, 5 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గండికోట కుమార్, నూనె విజయేందర్, రాజేశ్‌‌గా గుర్తించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు రాజు, సమీర్‌‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
* నకిలీ డాక్యూమెంట్‌లతో భూముల అమ్మకాలు చేస్తున్న 7గురు సభ్యుల ముఠాను భువనగిరి ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ మహేష్ భగవత్ మీడియాకు వెల్లడించారు. తూప్రాన్ పేట్‌లో గ్రీన్ సిటీ వెంచర్ పేరుతో ఈ ముఠా మోసాలకు పాల్పడుతోందని వెల్లడించారు
*కడప జిల్లా గోపవరం మండల పరిధిలోని శ్రీనివాసపురంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తాళ్ల చిన్న బాలకొండయ్య (40), కుమార్తెలు భావన(11), శోభన(8)తో కలిసి గురువారం రాత్రి గ్రామ సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
*అక్రమ భూదందాల్లో నిందితుడిగా ఉన్న నయీం అనుచరుడు మహ్మద్‌ మజార్‌ను గురువారం అరెస్ట్‌ చేసినట్లు భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్‌ కాశిరెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి చెందిన మహ్మద్‌ ఫకీర్‌ కుమారుడు మజార్‌.. నయీం అనుచరుడిగా పట్టణ శివారులో ఉన్న సర్వే నంబర్‌ 854లోని 27 ఎకరాల భూమికి సంబంధించిన ఆక్రమణ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఆయన్ను సిద్దిపేటలో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు చెప్పారు.
*విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే వక్రబుద్ధి చూపాడు. కామంతో కళ్లు మూసుకుపోయి పిల్లలపై లైంగిక దాడికి దిగాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ నగరం అక్కయ్యపాలెం 80 అడుగుల రహదారిలో పుట్టబంగారమ్మ ఆలయం దరి జ్ఞానకేశ్వరరావు(42) ఆదిత్య ట్యూషన్‌ సెంటర్‌ పేరిట ఒకటి నుంచి 10వ తరగతి వరకు పిల్లలకు ట్యూషన్లు చెబుతుంటాడు.
*చెప్పకుండా పాఠశాల నుంచి బయటికెళ్లారని ఉపాధ్యాయురాలు కర్రతో కొట్టిన దెబ్బలకు విద్యార్థి కుడిచేతి మణికట్టు వాయడంతో పాటు వేలు విరిగింది. ఈ ఉదంతం చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో చోటు చేసుకుంది.
*హైదరాబాద్‌లోని అల్వాల్‌ ప్రాంతంలో ఒక రౌడీషీటర్‌ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని బండరాళ్లతో మోది, ఆపై పెట్రోలు పోసి తగలబెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
*హైదరాబాద్‌లోని అల్వాల్‌ ప్రాంతంలో ఒక రౌడీషీటర్‌ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని బండరాళ్లతో మోది, ఆపై పెట్రోలు పోసి తగలబెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
*నల్గొండ జిల్లాలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. పీఏ పల్లి మండలం దుంగ్యాల వద్ద కారు అదుపుతప్పి పీఎంఆర్‌పీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, బాలుడిని రక్షించారు. మృతులు పీఏపల్లి మండలం వడ్డెరగూడేనికి చెందిన ఓర్సు రఘు, అతని భార్య అలివేలు, కుమార్తె కీర్తిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు.
*హబీబ్‌నగర్‌ పరిధిలోని అఫ్జల్‌సాగర్‌ రోడ్డు మాన్‌గరి బస్తీలో గురువార రాత్రి విషాదం చోటుచేసుకుంది. మాన్‌గరి బస్తీలో ఓ ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులపై గోడ కూలింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన రోషిణి(6), సారిక(3), నాలుగు నెలల చిన్నారి పావని మృతి చెందారు. చిన్నారుల మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*జాతీయ రహదారిపై ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లో 44వ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న చౌరస్తాలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
*పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు బుధవారం నదిలో పడి 24 మంది మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. బస్సులో మొత్తం 29 మంది ప్రయాణిస్తున్నారు. రాజస్థాన్‌లోని పాప్డీ గ్రామం సమీపంలోని మేజ్‌ నది వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది
*తీవ్రగాయాలతో తల్లీకుమార్తె రక్తపు మడుగులో పడి ఉండగా… మరో గదిలో తండ్రి ఉరికి వేలాడుతూ కనిపించారు. ఈ దారుణ ఉదంతం ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలోని ఛత్రపురం పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.
*నిషేధిత మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డ ఓ నైజీరియన్‌కు న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే మరో 9 నెలలు అదనంగా సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ప్రత్యేక సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి నందికొండ నర్సింగ్‌రావు తీర్పునిచ్చారు.
*జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడుల ఫలితంగా బెంగళూరు నగరంలో మరోసారి ఉగ్రజాడలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక ట్యాని రోడ్డులో ఓ ఇంట్లో దాగిన ఐసిస్‌ ఉగ్రవాది ఫజి ఉర్‌ రహమాన్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. కొన్నాళ్లుగా ఆ ఇంటిపై నిఘా పెట్టారు. ఉగ్రవాది దాగినట్లు గుర్తించి బుధవారం ఉదయం ఒక్కసారిగా ఆ ఇంటిని సాయుధులైన రక్షకులు సినీ ఫక్కీలో చుట్టుముట్టారు. రహమాన్‌ను అంగుళం కూడా కదలనివ్వకుండా కట్టడి చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఆల్‌ హింద్‌ సంస్థలో రహమాన్‌ చురుకుగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. పేరుమోసిన ఉగ్రవాదులు మొహబుబ్‌, ఖ్వజి బృందంలో సభ్యుడిగా కొనసాగుతున్నట్లు గుర్తించారు.
*సింగరేణి సంస్థలో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఉద్యోగాలను ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేస్తున్న వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు సింగరేణి సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఉద్యోగాలకు రాతపరీక్ష వచ్చే నెల ఒకటిన జరగనుంది. మొత్తం 68 పోస్టులకు 20 వేల మంది పోటీపడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన అశోక్‌రెడ్డి, ఐత సాయి అనే వ్యక్తులు మాయమాటలతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారు.
*మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్న ఎల్గార్‌ పరిషత్‌ కేసులో నిందితులను పుణేలోని ఎరవాడ కేంద్ర కారాగారం నుంచి ముంబయిలోని ఆర్థర్‌ రోడ్డులో ఉన్న జైలుకు మార్చారు. ఈ కేసు దర్యాప్తును జాతీయ భద్రతా ఏజెన్సీ(ఎన్‌ఐఏ)కి అప్పగించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేసులో నిందితులుగా ఉన్న వరవరరావు, సురేంద్ర గాడ్లింగ్‌, మహేశ్‌ రౌత్‌, రోనా విల్సన్‌, సుధీర్‌ ధావళే, అరుణ్‌ ఫెరారీయా, సుధా భరద్వాజ్‌, షోమా సేన్‌, వెర్నాన్‌ గంజాల్వెస్‌లను ముంబయి తరలించినట్లు అధికారులు తెలిపారు. మహిళా నిందితులను బైకులా కారాగారానికి పంపారు.
*ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై సామాజిక మాధ్యమంలో అసభ్యకర పోస్టు చేసిన వ్యక్తిపై కడప జిల్లాలో బుధవారం కేసు నమోదైంది. మైదుకూరు పట్టణానికి చెందిన పుల్లయ్య సీఎంపై అసభ్యకరంగా మాట్లాడుతూ టిక్‌టాక్‌ చేశాడని దువ్వూరు మండలం పెద్దజొన్నవరానికి చెందిన వైకాపా నాయకుడు కానాల జయచంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ప్రకారం పుల్లయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దువ్వూరు ఎస్సై కుళ్లాయప్ప తెలిపారు.
*హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఇండియన్‌ గల్ఫ్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ కంపెనీ (పాత ఐడీఎల్‌)లో రసాయన విస్ఫోటం జరిగింది. డిటోనేటర్‌ పేలి ఓ కార్మికుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇద్దరు తీవ్రంగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు.
*రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై రౌడీ షీటర్‌ దారుణహత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం… రౌడీషీటర్‌ శివ ఈరోజు ఉదయం ద్విచక్రవాహనంపై వేములవాడలోని టాకీస్‌ రోడ్డులో వెళ్తుండగా ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. మాజీ కౌన్సిలర్‌ వెంకటేశంతో పాటు మరో వ్యక్తి ..శివను అడ్డుకుని కత్తులతో పొడిచి పరారయ్యారు.
*నగ్నంగా నృత్యం చేయాలని బెదిరిస్తూ ఒక మహిళపై నలుగురు యువకులు దాడి చేసిన ఘటన హైదరాబాద్‌ శివారు రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏసీపీ అశోక్‌ చక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో నివసించే ఓ మహిళ ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా పనిచేస్తోంది.
*రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుకలకు వెళ్తున్న ఓ బస్సు నదిలో పడి 24 మంది దుర్మరణం చెందారు. బూండీలోని కోట లాల్‌సాత్‌ మెగా హైవేపై బుధవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
*ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన దినసరి కూలీలు ముగ్గురు మట్టిపెళ్లల కింద సజీవ సమాధి అయ్యారు. మరో అయిదుగురు గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కుమురం భీం జిల్లా ఎస్పీఎం (సిర్పూర్ కాగజ్నగర్ పేపర్ మిల్లు)లో బాయిలర్(విద్యుదుత్పత్తి ప్లాంటు) నిర్మాణం రెండు నెలలుగా సాగుతోంది. చెన్నైకు చెందిన ఏసియన్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ పనులను చేస్తోంది.
*ఒడిశాలోని గంజాం జిల్లా ఖొయిరఛొటిలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు బాలురు, ఓ బాలిక ఉన్నారు.
*బాలికను గర్భవతిని చేసిన కేసులో హోంగార్డును సస్పెండ్ చేస్తూ కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్బాబు ఆదేశాలిచ్చారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నానికి చెందిన బాలికపై లైంగిక దాడికి పాల్పడి, గర్భవతిని చేసిన హోంగార్డు బి.ఫణీంద్రపై పోక్సో చట్టం కేసు పెట్టి, రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. బందరు డీఎస్పీ మహబూబ్బాషా విచారణ చేపట్టి ఎస్పీకి నివేదిక సమర్పించారు. ఈ మేరకు ఫణీంద్రను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆదివారం ఉత్తర్వులిచ్చారు. నిందితుడు మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ కారు డ్రైవర్గా పనిచేస్తుండటం గమనార్హం.
*ఒడిశాలోని గంజాం జిల్లా పొలసర ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొయిరాచొట్టలో నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్డిపై వేసిన మంచె (గడ్డితో చేసిన నిర్మాణం)లో నలుగురు చిన్నారులు ఆడుకుంటుండగా అగ్నిప్రమాదం జరిగింది.
*పెళ్లి విషయంలో ఇరుకుటుంబాలు అంగీకరించలేదనే మనస్థాపంతో ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అలీసాగర్ ఉద్యానవనం ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన నవనీత(21), జహీరాబాద్కు చెందిన మోహన్(23) గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వీరిద్దరూ వారి కుటుంబాల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.
*తల్లి తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కుమార్తెలు మృతిచెందగా.. తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బాంబు ఉందని, అర్థరాత్రి 12.30 గంటలకు అది పేలుతుందని ఓ అజ్ఞాత వ్యక్తి కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయడంతో..ఆదివారం పోలీసులు మెరుపు తనిఖీలు చేపట్టారు.
*భద్రతా దళాల సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో లష్కరేతోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్ రాష్ట్ర అనంతనాగ్ జిల్లా బిజ్బెహరాలోని సంగం వద్ద ఈ తెల్లవారుజామున చోటుచేసుకుంది. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు.
*జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి శివారులోని శ్రీవరసిద్ధి వినాయక పత్తి మిల్లులో గురువారం అర్ధరాత్రి తర్వాత అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతం కారణంగా చోటుచేసుకున్న ఈ ఘటనలో భారీగా పత్తి కాలి బూడిదైంది. భారతీయ పత్తి సంస్థ రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని స్థానికంగా జిన్నింగ్ చేయిస్తోంది. జిన్నింగ్ చేసే క్రమంలో మిషన్ లోపలికి పత్తి వెళుతుండగా యంత్రభాగంలో ఏదో అడ్డు పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు మిల్లు యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది.
*కాపురానికి పంపడం లేదన్న కోపంతో భార్య మేనమామ ప్రాణాలు బలిగొన్నాడు ఓ కర్కశ భర్త. శుక్రవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో చోటుచేసుకున్న ఈ దారుణం వివరాల్ని మృతుని కుటుంబ సభ్యులు, ఎస్సై బి.యాదవేంద్రరెడ్డి వెల్లడించారు. నేరేడుచర్లకు చెందిన వేముల యాదమ్మ కుమార్తె శ్రీదేవికి గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఆరెపడి సుజైరాజుతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.
*నకిలీ పత్రాలతో కువైట్ వెళ్లడానికి యత్నించిన ఇద్దరు నేపాల్ మహిళలను ఆర్జీఐఏ భద్రతాధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..నేపాల్కు చెందిన ఇద్దరు మహిళలు కువైట్ వెళ్లడానికి నకిలీ పత్రాలను సృష్టించి, ఎయిర్ అరేబియా ఎయిర్లైన్స్ విమానంలో టికెట్లు కొనుగోలు చేశారు. శుక్రవారం కువైట్ వెళ్లడానికి విమానాశ్రయానికి రాగా వారిని ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీచేసి అరెస్టు చేశారు.
*వరకట్న వేధింపుల నేపథ్యంలో కాలిన గాయాలతో అనుమానాస్పద స్థితిలో గర్భిణి మృతి చెందడానికి ఆమె భర్త, అత్తమామలే కారణమని పేర్కొంటూ వారికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.
*గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కోటప్పకొండకు ప్రభను తీసుకెళ్తున్న క్రమంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండల పరిధిలోని తిమ్మాపురం వద్ద కోటప్పకొండకు ప్రభను తీసుకెళ్తున్న ఎడ్లబండిని లారీ ఢీకొంది. పత్తిపాడు మండలం పెద్దగొట్టిపాడుకు చెందిన రైతులు ఎడ్లబండ్లపై ప్రభను కోటప్పకొండకు తీసుకెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
*మహారాష్ట్రలోని అకోలాలో యువ బాక్సర్ పవన్ రౌత్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అకోలాలో తన హాస్టల్ గదిలో శుక్రవారం ఉదయం రౌత్ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్టు కోచ్ సతీశ్చంద్ర భట్ వెల్లడించారు. ఇటీవల దిల్లీలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ ఛాంపియన్ పోటీల్లో పవన్ రౌత్ మహారాష్ట్ర తరఫున ప్రాతినిధ్యం వహించాడని ఆయన తెలిపారు.
*పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తాపడి గుంటూరు జిల్లాలో ఐదుగురు మృతిచెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. చుండూరు మండలం చినపరిమి వద్ద గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. చినపరిమికి చెందిన ఉన్నం ముకుందరావు కుమార్తె వివాహం నిమిత్తం బంధువులు తెనాలి పట్టణంలోని చినరావూరు తోటకు ట్రాక్టర్లో వెళ్లారు. పెళ్లి అనంతరం తిరుగు పయనమయ్యారు.
*విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బంగారంతో ఆభరణాలు తయారు చేసి నిబంధనలకు విరుద్ధంగా వాటిని స్థానిక మార్కెట్లో అమ్ముకున్న శ్రీకృష్ణ జ్యుయెలర్స్ అక్రమాలన్నీ హాంకాంగ్ కేంద్రంగా జరిగినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) గుర్తించింది. దీనికి సంబంధించి లావాదేవీలన్నింటిపైనా దర్యాప్తు ముమ్మరం చేసింది.
*మరుగుదొడ్డిలో ఉన్న విద్యార్థినిని సెల్ఫోన్ ద్వారా వీడియో తీసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- మద్రాస్ (ఐఐటీఎం) ఆచార్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఐఐటీఎం వసతిగృహంలో ఉంటూ ఓ విద్యార్థిని ఏరోస్పేస్ ఇంజినీరింగ్లో పీహెచ్డీ చేస్తున్నారు. బుధవారం విద్యాసంస్థ ప్రాంగణంలో ఉన్న మహిళల మరుగుదొడ్డిలోకి ఆమె వెళ్లినప్పుడు గోడకు ఉన్న రంధ్రం ద్వారా ఓ వ్యక్తి వీడియో తీసినట్లు ఆమె గుర్తించారు.
*అత్యంత మత్తును కలిగించే ఎఫెడ్రెన్ను బాబిన్ల మధ్యలో ఉంచి ఆస్ట్రేలియాకు తరలిస్తున్న చెన్నైకి చెందిన ఒకరిని అరెస్టు చేశామని బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయం పోలీసులు గురువారం వెల్లడించారు. నిందితుడి నుంచి స్వాధీనపరచుకున్న 5.115 కిలోల మాదకద్రవ్యాల విలువ రూ.5 కోట్లుగా లెక్కగట్టారు. ప్లాస్టిక్లో ప్యాక్ చేసిన మాదకద్రవ్యాన్ని 45 బాబిన్లు, అలంకరణ వస్త్రాలమధ్యఉంచి తరలిస్తూ నిందితుడు దొరికిపోయాడు
*అమెరికాలో గుండెపోటుతో తెలంగాణకు చెందిన కె.ప్రశాంత్ అనే యువకుడు మరణించాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడు సంతోష్ కుమార్ ట్విటర్ ద్వారా కేటిఆర్కి తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి హైదరాబాద్లోని కాన్సుల్ జనరల్, అమెరికాలోని భారత రాయబార కార్యాలయ అధికారులకు, ప్రశాంత్ కుటుంబాన్ని ఆదుకోవాలని ట్విటర్ ద్వారా కోరారు.
*సౌదీ అరేబియా నుంచి శంషాబాద్కు చేరుకున్న అంతర్జాతీయ విమానంలో ఒక ప్రయాణికుడు 932 గ్రాముల బరువు గల 8 బంగారం బిస్కెట్లను వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది
*రాష్ట్రంలోని అడవుల్లో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 15వ తేదీన ఒక్కరోజే 24 చోట్ల ప్రమాదాలు జరగ్గా.. గురువారం సైతం రాష్ట్రవ్యాప్తంగా 23 ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించి ఎస్ఎన్పీపీ, మోదీస్ ఉపగ్రహాల నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ వెంటనే అప్రమత్తమైంది. జగిత్యాల జిల్లా రాయికల్ రేంజ్ గోరేపల్లి అటవీ బీట్లో మాత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా 10 నుంచి 12 ఎకరాల్లో మంటలు వ్యాపించినట్లు సమాచారం.
*పదో తరగతి విద్యార్థుల మధ్య జరిగిన చిన్న గొడవ ఓ విద్యార్థి ప్రాణాలు తీసింది. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
*అభం శుభం తెలియని బాలుడు కిరోసిన్ తాగి మృతిచెందిన సంఘటన గురువారం నిజమాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి మండలం వల్లభాపూర్ గ్రామానికి చెందిన సాయిచరణ్, మీనా దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
*తిరుపతి రుయా ఆసుపత్రి ఆవరణలో నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. వారిని అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై వారిని ఆస్పత్రిలోకి ప్రవేశించకుండా అడ్డుకుని బయటకు నెట్టివేయడంతో వాళ్లకు వాళ్లే రాళ్లతో తలపై కొట్టుకుంటూ అక్కడ వీరంగం సృష్టించారు.
*సమోసా, పానీపూరి ఇప్పిస్తానని బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన ఎస్సార్నగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
*కుమారుడిపై అలిగిన తల్లి ఆత్మహత్య చేసుకుంది. రాయదుర్గం ఇన్స్పెక్టర్ రవిందర్ కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటికొండకు చెందిన పేటా పెంటయ్య భార్య మౌనిక(37), కమారుడు, కూతురితో మణికొండ చిత్ర పురికాలనీలో ఉంటున్నారు. పెంటయ్య డ్రైవర్. కుమారుడు ఏపని చేయడం లేదని మందలించగా బుధవారం రాత్రి ఇద్దరికీ గొడవైంది. దీంతో కుమారుడు ఇంటినుంచి వెళ్లాడు. తల్లి ఆరో అంతస్తుపైకెక్కి దూకింది. ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
* కాబోయే భార్యపై ఓ యువకుడు దాడికి పాల్పడిన సంఘటన కొరాపుట్‌ జిల్లాలోని పొట్టంగి సమితిలో ఉన్న చింతలగుడ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.
* అమెరికాలో మరోసారి కాల్పుల ఉదంతం చోటుచేసుకుంది. మిల్‌వాకీ నగరంలోని బీర్ల కంపెనీలో ఓ ఉద్యోగి జరిపిన కాల్పుల్లో తోటి ఉద్యోగులు ఐదుగురు మృతి చెందారు. నిందితుడు సైతం కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. బుధవారం మోల్సన్‌ కూర్స్‌ బీర్‌ కంపెనీలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.