DailyDose

ముఖం చాటేసిన గంటా-రాజకీయ

Ganta Srinivas Skips TDP Meet-Telugu Political News Roundup Today

*తేదేపాకు చెందిన విశాఖ నార్త్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. చర్చల్లోకి వచ్చారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమత్న్రి చంద్రబాబు నాయుడు మాజీ మంత్రులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు విశాఖ విమానాశ్రయంలో అడ్డగించిన ఘట్నాలో గంటా శ్రీనివాసరావు ఎక్కడా కనిపించలేదు. తెదేపా ,వైకాపా నాయకుల మధ్య విఅస్ఖ విమానాశ్రయం వద్ద రణరంగం లాంటి పరిస్థితుల్లో కూడా ఆయన అటువైపు కన్నెత్తి చూడకపోవడం చర్చనీయంచం అయ్యింది.
* నో బ్యాగ్‌ డే’ వీడియోకు ప్రథమ బహుమతి అభినందనీయం
నో బ్యాగ్‌ డే’ వీడియోకు ప్రథమ బహుమతి లభించడం అభినందనీయమని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌ అన్నారు. కేరళలోని కొచ్చిలో నిర్వహించిన అఖిల భారత చిన్నారుల విద్య సంబంధిత ఆడియో, వీడియో ఫెస్టివల్‌, ఐసీటీ మేళాలో రాష్ట్ర పాఠశాల విద్యశాఖ రూపొందించిన ‘నో బ్యాగ్‌ డే’ వీడియోకు ప్రథమ స్థానం లభించడంతో అధికారులను ఆయన అభినందించారు. ప్రతి నెలా మూడో శనివారం విద్యార్థులు పుస్తకాలు తెచ్చుకోకుండా మానసికోల్లాసానికి ఆటలు, పాటలు, యోగా, నృత్యాలులాంటి వాటిని బోధించేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
*రాజ్యసభకు సీతారం ఏచూరి
వచ్చే నెల 26న పశ్చిమ బెంగాల్ లో ఐదు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపద్యంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఎచూరిని బరిలోకి దింపాలని సి పీఎం ఆదిస్థానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈమేరకు పార్టీ ఆయన పేరును ప్రతిపాదించింది. ఈవిషయంలో ఏచూరికి మద్దతుగా నిలవాల్సిన్డిగా కాంగ్రెస్ ను కోరనుంది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం. మరోవైపు నాలుగు స్థానాల నుంచి టీఎంసి బరిలోకి దిగుతుండగా సీపీఎం – కాంగ్రెస్ కాని టీఎంసీ కాంగ్రెస కాని ఉమ్మడి అభ్యర్ధిని బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ తో కలిసి ఎచూరిని నిలబెట్టాలని సీపీఎం భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్న్నాయి. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న భాజపాకి రాజ్యసభకు పోటీ పడే అవకాశం లేదని సమాచారం.
* అసెంబ్లీ రద్దుచేసే దమ్ముందా: తులసిరెడ్డి
‘‘మొనగాడివైతే మూడు రాజధానులపై తాజాగా ఎన్నికలకు వెళ్లు. శాసనసభను రద్దు చేసే దమ్ముందా! రైతులు రాజధానికి ఇచ్చిన భూములను పేదల ఇళ్ల స్థలాలకు ఇస్తామంటారా?’’ అని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి సీఎం జగన్మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. గురువారం ఆయన విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాజధాని అంశంలో గత టీడీపీ సర్కారు, ప్రస్తుత జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా వంచించాయన్నారు. ప్రజలను కన్నతండ్రిలా కాపాడాల్సిన సీఎం జగన్‌.. కసాయిలా మారారని ఆరోపించారు. రాజధాని మార్పు ప్రజల అభిమతం కాదని, అయినా అమరావతిని మార్చాలని జగన్‌ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఢిల్లీ హింసాత్మక ఘటనకు కేంద్ర వైఫల్యమే కారణమని తులసిరెడ్డి మండిపడ్డారు.
* జగన్‌ హయాంలో ఫ్యాక్షన్‌ వికేంద్రీకరణ: లోకేశ్‌
చంద్రబాబు హయాంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే .. జగన్‌ హయాంలో ఫ్యాక్షన్‌ వికేంద్రీకరణ జరుగుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దుయ్యబట్టారు. నిన్న విశాఖ విమానాశ్రయంలో పెయిడ్‌ ఆర్టిస్టులు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వైకాపా నాయకులు, కార్యకర్తలు ఉత్తరాంధ్రకు ఫ్యాక్షన్‌ రాజకీయాలను పరిచయం చేశారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడి ప్రజాచైతన్య యాత్రకు అనుమతులు ఇచ్చి అరెస్టు చేశారంటే … పోలీసు వ్యవస్థను ఎంత నిష్పక్షపాతంగా నడిపిస్తున్నారో అర్థమవుతోందని ఆక్షేపించారు.
* తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు లేదు: కిషన్‌
నిర్ణీత గడువులోగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచే అవకాశమే లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, సీట్ల పెంపు అంశాన్ని విభజన చట్టంలో రాత్రికి రాత్రి చేర్చారని విమర్శించారు. గతంలో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ జరిగినప్పుడే ఉమ్మడి ఏపీలో కూడా జరిగిందని, ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఒకేసారి జరుగుతుందని తెలిపారు. గురువారం ఢిల్లీలో జమ్మూ కశ్మీర్‌ మండల స్థాయి ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు
* జగదాంబ సెంటర్‌లో తేల్చుకుందాం:బొండాఉమా
విశాఖలో జగన్‌ భూకబ్జాలు బయటపడతాయనే తెదేపా అధినేత చంద్రబాబును అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్‌ రౌడీయిజానికి భయపడేది లేదని స్పష్టం చేశారు. విశాఖ జగదాంబ సెంటర్‌లో తేల్చుకుందాం.. అని జగన్‌కు సవాల్‌ విసిరారు. ‘‘త్వరలో విశాఖకు చంద్రబాబు వస్తారు .. అప్పుడు అడ్డుకోండి చూద్దాం. నిన్న పోలీసుల అండతోనే రౌడీయిజం చేశారు. విశాఖలో ప్రజాస్వామ్యం ఖూనీపై కోర్టుకెళ్తాం. విశాఖ ఘటనపై ఇవాళ గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం’’ అని బొండా ఉమా తెలిపారు.
* విశాఖకు ఒక్క పరిశ్రమైనా తీసుకొచ్చారా?: మంత్రి శ్రీనివాసరావు
టీడీపీ హయాంలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ విశాఖకు తీసుకొచ్చారా అని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ లులు చూపించి పరిశ్రమ అంటున్నారని విమర్శించారు. విశాఖలో ప్రజలు రాజధాని అడగలేదని చంద్రబాబే చెబుతున్నారని అన్నారు. విశాఖలో టీడీపీకి చెందిన నలుగురు శాసనసభ్యులు ముందు విశాఖకు రాజధానికి అనుకూలమని చెప్పి ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. పోలీసులు లేకపోతే చంద్రబాబు కదలలేని పరిస్థితి అని, వారే సంపూర్ణ రక్షణ ఇచ్చారని చెప్పారు. పోలీసులు సక్రమంగా విధి నిర్వహణ చేశారన్నారు. ఏసీపీ స్వరూప దళిత మహిళ అని, చాలా నిజాయతీ నిబద్ధతతో వ్యవహరించారని మంత్రి తెలిపారు. ప్రజలు స్వచ్చంధంగా విమానాశ్రయానికి వచ్చి ప్రతిపక్షనేతను అడ్డుకున్నారని తెలిపారు. పోలీసులు ప్రతిపక్ష నేతకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు.
* వైసీపీ నుంచి ఇద్దరు నేతలు సస్పెన్షన్
వైసీపీ నుంచి ఇద్దరు నేతలను అధిష్టానం సస్పెండ్ చేసింది. ఆ ఇద్దరు నేతలూ రాజోలు నియోజకవర్గనికి చెందిన వైసీపీ నాయకులే. పార్టీ క్రమశిక్షణను ఉల్లంగించినందుకు గాను ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి నల్లి డేవిడ్, రాజోలు వైసీపీ నాయకుడు నేతల నానీపై అధిష్టానం చర్యలు తీసుకుంది. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే.. ఈ ఇద్దరు నేతల నియోజకవర్గంలో త్వరలోనే క్రమశిక్షణా సంఘం సభ్యులు పర్యటించనున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
* విశాఖకు ఒక్క పరిశ్రమైనా తీసుకొచ్చారా?: మంత్రి శ్రీనివాసరావు
టీడీపీ హయాంలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ విశాఖకు తీసుకొచ్చారా అని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ లులు చూపించి పరిశ్రమ అంటున్నారని విమర్శించారు. విశాఖలో ప్రజలు రాజధాని అడగలేదని చంద్రబాబే చెబుతున్నారని అన్నారు. విశాఖలో టీడీపీకి చెందిన నలుగురు శాసనసభ్యులు ముందు విశాఖకు రాజధానికి అనుకూలమని చెప్పి ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. పోలీసులు లేకపోతే చంద్రబాబు కదలలేని పరిస్థితి అని, వారే సంపూర్ణ రక్షణ ఇచ్చారని చెప్పారు. పోలీసులు సక్రమంగా విధి నిర్వహణ చేశారన్నారు. ఏసీపీ స్వరూప దళిత మహిళ అని, చాలా నిజాయతీ నిబద్ధతతో వ్యవహరించారని మంత్రి తెలిపారు. ప్రజలు స్వచ్చంధంగా విమానాశ్రయానికి వచ్చి ప్రతిపక్షనేతను అడ్డుకున్నారని తెలిపారు. పోలీసులు ప్రతిపక్ష నేతకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు.
*కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యల ఫలితంగానే అల్లర్లు-కేంద్ర మంత్రి జావడేకర్‌ ఆరోపణ
దిల్లీలో ఘర్షణలు జరగడానికి ప్రతిపక్షాల రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని భాజపా ఆరోపించింది. పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా గత ఏడాది ఒక సభలో సోనియా గాంధీ మాట్లాడుతూ ‘అంతం చేసేవరకు పోరాటం’ (ఆర్‌ పార్‌ కి లడాయి) అని పిలుపునిచ్చారని గుర్తు చేసింది. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంకలు చేసిన మరి కొన్ని వ్యాఖ్యలను కూడా ఉటంకిస్తూ భాజపాకు చెందిన కేంద్ర మంత్రి జావడేకర్‌ కాంగ్రెస్‌ పార్టీపై విమర్శల దాడి చేశారు. ‘మనం ఇప్పుడు నిర్ణయించుకోవాలి. మీరు ఎటో చూసుకోండి’ అని సోనియాగాంధీ అనడం రెచ్చగొట్టడం కాదా? సీఏఏ గురించి మాట్లాడుతూ ‘వందల మందిని జైళ్లలో పెడతారు’ అని ప్రియాంక అనడమంటే వక్రీకరించడం కాదా? ‘భయపడకండి..మీ వెంట మేము ఉంటాం’ అని రాహుల్‌గాంధీ మాట్లాడటమంటే ప్రజలను రెచ్చగొట్టడం కాదా అని జావడేకర్‌ ప్రశ్నించారు. ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌)పై కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఆప్‌కు చెందిన ఒక నాయకుడి ఇంట్లో భారీగా రాళ్లు పెట్రోలు బాంబులు దొరికాయన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో శాంతి పునరుద్ధరణకు గట్టిగా కృషి జరుగుతోందన్నారు.
*కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల ప్రత్యేక భేటీ 29న
రైతు సమస్యలపై చర్చించేందుకు కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఈ నెల 29న ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కాంగ్రెస్‌ కిసాన్‌సెల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో ఉదయం 10 గంటలకు ఈ భేటీ జరుగుతుంది. దీనికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలపై చర్చించడంతో పాటు త్వరలో జరగబోయే రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు, అనుసరించాల్సిన వ్యూహంపై ప్రణాళికలు రూపొందిస్తారు.
*షా రాజీనామా చేయాలి-సీపీఐ నారాయణ డిమాండ్‌
దేశ రాజధానిలో ఇటీవల జరిగిన అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్‌ చేశారు. దిల్లీ అల్లర్లకు నిరసనగా గురువారం హైదరాబాద్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల్లో ముసుగులతో దాడులకు తెగబడింది అమిత్‌ షా ఆధీనంలోని బృందమేనని ఆరోపించారు. ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో అల్లర్లు జరగడం కుట్రలో భాగమేనన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.
*అసెంబ్లీ సీట్ల పెంపు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఉండదుకిషన్‌రెడ్డి
అసెంబ్లీ సీట్ల పెంపు అనేది దేశమంతా ఒకేసారి జరుగుతుందని, తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పెంచే అవకాశం ఉండదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ స్థానాల పెంపు అంశాన్ని ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో రాత్రికిరాత్రి పొందుపరిచారని, తదుపరి పర్యవసనాల గురించి ఆలోచించలేదని ఆరోపించారు. 1976 తర్వాత జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ సీట్లను పెంచలేదని, కానీ దేశమంతా జరిగినపుడు తెలుగు రాష్ట్రాల్లో జరిగిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి సీట్ల పెంపు ఉండబోదన్నారు.
*చివరి కంది గింజా ప్రభుత్వమే కొనాలి
రైతులు పండించిన కంది పంట చివరి గింజ వరకు పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివేదికలు తెప్పించుకొని రెండు రోజుల్లో సమస్యపై స్పందించకుంటే ‘రైతు గోస’ పేరుతో తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం సీఎంకు బహిరంగ లేఖ రాశారు. రైతుల వద్ద కందులు కొనుగోలు చేయడానికి అధికారులు చెబుతున్న నిబంధనలు చిత్రవిచిత్రంగా ఉన్నాయని, అనేక ప్రశ్నలతో రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారన్నారు. కంది పంట విస్తీర్ణం, దిగుబడిపై ప్రభుత్వం వద్ద సరైన అంచనాలు లేవన్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదికలు పంపడం వల్లే 47,500 మెట్రిక్‌ టన్నులనే కొనాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు, మార్కెట్‌ యార్డుల్లో రైతులు పడిగాపులు పడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు
*రైతుబంధును ఎన్నికల బంధుగా మార్చారు-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ విమర్శ
ఎన్నికల సమయంలో మాత్రమే అమలుచేస్తూ రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం ఎన్నికల బంధుగా మార్చిందని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని, కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. అధికార దుర్వినియోగంతో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి పురపాలక ఎన్నికల్లో తెరాస గెలిచిందని ఆరోపించారు. మిషన్‌ భగీరథను కమీషన్ల కోసమే ప్రారంభించారని.. మూడేళ్లలో ఇంటింటికీ తాగునీరందిస్తామని చెప్పి ఐదేళ్లయినా 10 శాతం ఇళ్లకైనా అందించలేదన్నారు. పాత ట్యాంకులకే రంగులు వేసి మిషన్‌ భగీరథ ట్యాంకులు అంటున్నారని విమర్శించారు. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని.. సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
*అమెరికాతో ఒప్పందం.. భారత్‌కు నష్టం- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
అమెరికాతో వాణిజ్య ఒప్పందం భారత ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ చూపిన అత్యుత్సాహం అర్థరహితమని ఆయన విమర్శించారు. బుధవారం కొండాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఆ దేశం నుంచి పాల ఉత్పత్తులు, కోడికాళ్లను దిగుమతి చేసుకుంటే భారత్‌లోని పాడి, కోళ్ల పరిశ్రమ తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
*అమిత్‌షా సభను విరమించుకోవాలి: నిరంజన్‌
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆద్వర్యంలో మార్చి 15న ఎల్బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభను విరమించుకోవాలని భాజపా రాష్ట్ర నాయకత్వానికి టీపీసీసీ అధికార ప్రతినిధి జి.నిరంజన్‌ విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సమావేశాల వల్ల దిల్లీ తరహాలో హైదరాబాద్‌లో కూడా శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అందుకే సభకు అనుమతి ఇవ్వొద్దని నగర పోలీసు కమిషనర్‌ను కోరారు.
*6న దిల్లీలో ధర్నా: వీహెచ్‌
పంజాగుట్ట సర్కిల్‌లో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో మార్చి 6న దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేపడతామని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు తెలిపారు. బుధవారం గాంధీభవన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. మార్చి 4న పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తాలని కోరుతూ అన్ని పార్టీల ఎంపీలకు వినతిపత్రాలు అందిస్తానన్నారు. అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌కు లేఖ రాసినందుకు ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీకి కృతజ్ఞతలు తెలిపారు.
*హామీలు అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించండి
ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తెరాస పార్టీ అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని గవర్నర్‌ తమిళిసైకి తెలుగుదేశం పార్టీ విన్నవించింది. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు రమణ, సీనియర్‌ నేతలు రావుల చంద్రశేఖరరెడ్డి, నన్నూరి నర్సిరెడ్డి కె.దయాకర్‌రెడ్డి, తెలుగు మహిళ అధ్యక్షురాలు జ్యోత్స్న తదితరులు బుధవారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. గత ఆరేళ్లుగా సంక్షేమానికి బడ్జెట్‌ కేటాయింపుల్లో కోతలు విధిస్తున్నారని, వచ్చే బడ్జెట్‌లో అయినా సరైన కేటాయింపులు జరిగేలా చూడాలని వారు కోరారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని విస్మరించారని, రైతుబంధు పథకాన్ని కొందరికే పరిమితం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు అబ్దుల్‌కలాం, దాదాసాహెబ్‌ ఫాల్కేపై రచించిన రెండు పుస్తకాలను తెదేపా నేతలు బహూకరించారు.
*ట్రంప్‌తో విందుకు జగన్‌ను ఆహ్వానించకపోవడంపై మంత్రి బొత్స వివరణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో విందుకు దేశంలో బలమైన నాయకత్వమున్న ముఖ్యమంత్రులను పిలవలేదని, ఆ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను పిలవలేదని తాము భావిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇదికాకపోతే వేరే కారణాలూ ఉండొచ్చు అన్నారు. ట్రంప్‌తో విందుకు జగన్‌ను పిలవలేదని ఏవేవో ఆరోపణలు చేస్తున్నారని, పార్టీపరంగా భాజపా లెక్కలు, సమీకరణలు ఆ పార్టీ వారికుంటాయని తెలిపారు. ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విందుకు దేశంలోని ఎనిమది మంది ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్రపతి భవన్‌ నుంచి ఆహ్వానం అందలేదు
*రాజకీయ లబ్ధికే
సీఏఏపై మజ్లిస్‌ తప్పుడు ప్రచారం: లక్ష్మణ్‌
రాజకీయ లబ్ధి కోసం మజ్లిస్‌ పార్టీ పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏకు) మతం రంగు పులుముతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా మజ్లిస్‌ నేతలు మాట్లాడుతుంటే సీఎం కేసీఆర్‌ ఏం చేస్తున్నారని..మంత్రి కేటీఆర్‌ ఎందుకు స్పందించట్లేదని ఆయన ప్రశ్నించారు. బుధవారమిక్కడ శ్యామాప్రసాద్‌ముఖర్జీ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దిల్లీలో జరుగుతున్న పరిణామాలు యావత్‌ దేశ ప్రజల్ని కలవరపరుస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటనతో ప్రధాని నరేంద్రమోదీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని శక్తులు సీఏఏను అడ్డంపెట్టుకుని హింసాత్మక ఘటనల్ని సృష్టించాయన్నారు
*పోలీసుల నైతిక ధైర్యాన్ని దెబ్బతీస్తున్నారు- కేంద్రమంత్రి జావడేకర్‌
దేశ రాజధానిలో జరిగిన హింసాత్మక ఘటనలకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతంటూ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చేసిన విమర్శలను భాజపా తిప్పికొట్టింది. కాంగ్రెస్‌వి నీచ రాజకీయాలని ఆరోపించింది. దిల్లీలో అమాయక సిక్కుల ఊచకోతకు కారణమైన వారు ఇప్పుడు శాంతిని కాపాడలేకపోయామని ఆరోపిస్తున్నారని భాజపాకు చెందిన కేంద్ర మంత్రి జావడేకర్‌ ఎద్దేవా చేశారు. శాంతి భద్రతలు నెలకొల్పేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పోలీసులతో కలిసి శ్రమిస్తున్నారని, ఆయనను రాజీనామా చేయమని కాంగ్రెస్‌ నాయకులు కోరడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో నిందారోపణలు తగవు. హింసాత్మక చర్యలకు రాజకీయాలు అంటగట్టడం మంచిది కాదు. కాంగ్రెస్‌ ఎప్పుడూ ఇదే పని చేస్తుంది’’ అని విమర్శించారు.
*రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోందని పలు రాజకీయ పార్టీలు, ప్రజా, కుల సంఘాలు ఆరోపించాయి. పదోన్నతుల్లో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పట్టించుకోకపోవడమే దీనికి నిదర్శనమని దుయ్యబట్టాయి. ఆదివారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ‘రిజర్వేషన్ల పరిరక్షణ- అమలులో వ్యవస్థల పాత్ర’ అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ సామాజిక అసమానతలు, కులతత్వం ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పరిరక్షణకు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ పిలుపునిచ్చారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ పోరాటానికి కాంగ్రెస్ సహకారం ఉంటుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు.
*తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఛైర్మన్గా ప్రీతమ్
తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఛైర్మన్గా నగ్రిగారి ప్రీతమ్ను నియమించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలం మోత్కూరు గ్రామానికి చెందిన ప్రీతమ్ గతంలో ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.
*యూపీపై ఆప్ దృష్టి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఉత్తర్ప్రదేశ్ (యూపీ) రాష్ట్రంపై దృష్టి సారించింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. రాబోయే తొమ్మిది నెలల్లో యూపీలో 25 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకునేలా లక్ష్యం పెట్టుకున్నట్లు ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ చెప్పారు. 2022లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దిల్లీ అభివృద్ధి నినాదంతో బరిలోకి దిగుతామని తెలిపారు.
*ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకే ట్రంప్ పర్యటన=సీసీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపణ
దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటనకు వస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. మంచిర్యాలలో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలలో ఆదివారం ఆయన మాట్లాడారు. విమానాలు, యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు, పాల పొడి, ఐస్క్రీమ్ల లాంటి అమెరికా ఉత్పత్తులను ఇక్కడ విక్రయించాలనే కుట్రతో వస్తున్నారని విమర్శించారు. అమెరికా ఉత్పత్తులను మన దేశ మార్కెట్లో అమ్మడానికి అంగీకరిస్తే ఇక్కడి పాలు, చక్కెర పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉందన్నారు. ట్రంప్ పర్యటనను వ్యతిరేకిస్తూ మంగళవారం(ఈ నెల 25న) సికింద్రాబాద్లో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి ఇచ్చే విందుకు వెళ్లవద్దని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, రాష్ట్ర నాయకులు చాడ వెంకట్రెడ్డి, సాంబశివరావు పాల్గొన్నారు. సోమవారంతో సీపీఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలు ముగియనున్నాయి.
*సీఏఏపై అసెంబ్లీ తీర్మానం దేశం కోసమా? ఎంఐఎం కోసమా?
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై తెరాస, మజ్లిస్లు పనిగట్టుకొని విష ప్రచారం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్రెడ్డి మండిపడ్డారు. సీఏఏపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని.. ఆ ప్రయత్నం దేశం కోసమా? ఎంఐఎం కోసమా? అనేది స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ.. యాభై ఏళ్ల కిందట పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ల నుంచి కట్టుబట్టలతో శరణార్థులుగా భారతదేశానికి వచ్చిన హిందువులు, బుద్దులు, క్రైస్తవులు నేటికీ దేశంలో రేషన్ కార్డు, ఓటరుకార్డు, ఆధార్ కార్డులకు నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ నాయకులే దీనికి కారణమని దుయ్యబట్టారు. అలాంటి వారి సంక్షేమం కోసం భాజపా ప్రభుత్వం సీఏఏ అమలు చేస్తోందని కిషన్రెడ్డి చెప్పారు. దేశంలోని 130 కోట్ల మందిలో ఈ చట్టం ఒక్కరికైనా నష్టం కలిగిస్తుందని నిరూపిస్తే, మార్పులు తీసుకొచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
*వైకాపా పాలనపై విచారణ చేయించండి
యనమల రామకృష్ణుడి డిమాండు
తొమ్మిది నెలల వైకాపా పాలనలో అవినీతి, అక్రమాలపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ చేయించాలని శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. అవినీతి కేసుల్లో విచారణ ముగింపు దశకు చేరిన నేపథ్యంలో.. ప్రజల దృష్టి మరల్చేందుకే గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ ఏర్పాటుచేశారని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన విమర్శించారు. ‘హత్యల కన్నా ఆర్థిక నేరాలు ప్రమాదకరం’ అని సుప్రీంకోర్టు పేర్కొందన్నారు. తొమ్మిది నెలల వైకాపా పాలనలో అనేక విచారణలు, మూడు సిట్లు, ఆరు కమిటీలు, మంత్రివర్గ ఉపసంఘం, విజిలెన్స్ విచారణలు చేసినా గత తెదేపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ రుజువు చేయలేకపోయారని స్పష్టం చేశారు. జగన్ తన సన్నిహిత సహచరుడి నేతృత్వంలో సిట్ వేయడం దురుద్దేశపూరితమని రామకృష్ణుడు మండిపడ్డారు.
*వ్యవస్థల్ని చెప్పుచేతల్లో పెట్టుకునేందుకే సిట్-కళావెంకటరావు
ప్రభుత్వం సిట్ పేరుతో వ్యవస్థల్ని చెప్పు చేతల్లో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారులతో తమ పనులు చేయించుకొనేందుకు, వారిని భయభ్రాంతులకు గురి చేసేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ హయాంలో తప్పు చేసిన అధికారులు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. వారిలో పలువురు ఐఏఎస్లూ ఉన్నారని గుర్తు చేశారు. దావోస్ వెళ్లి అన్ని రాష్ట్రాలూ పెట్టుబడులు ఆహ్వానిస్తాయని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇప్పటి దాకా దావోస్ ఎందుకు వెళ్లలేక పోయారని ఎద్దేవా చేశారు. 9 మాసాల పాలన రద్దులు, కూల్చివేతలు, కక్ష సాధింపులతోనే గడిచిపోయిందని దుయ్యబట్టారు.
*భారతీయ సంస్కృతులు అందరికీ ఆదర్శం: మోదీ
మన దేశంలోని విభిన్న సంస్కృతులు ప్రతి భారతీయుడిని గర్వించేలా చేస్తాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆదివారం నిర్వహించిన 62వ ‘మన్ కీ బాత్’లో మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ ఇటీవల దేశ రాజధాని దిల్లీలో తాను సందర్శించిన ‘హునార్ హాత్’ ప్రదర్శన గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ‘వైవిధ్యభరితమైన మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు పౌరులకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆ ప్రదర్శనలో దేశంలోని విభిన్న సంప్రదాయాలు, వంటరుచులు, భావోద్వేగాలు ఉట్టిపడ్డాయి. వివిధ రకాల హస్తకళలు, సంగీత వాయిద్యాలు దేశ సంస్కృతిని కళ్లకు కట్టినట్లు చూపాయి’ అని మోదీ పేర్కొన్నారు.
*కమ్యూనిస్ట్ మేనిఫెస్టోతో ఆర్థిక సంక్షోభాలకు పరిష్కారం
ప్రపంచంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు ఎదురైన ప్రతిసారీ వాటిని పరిష్కరించేందుకు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఆయుధంగా ఉపయోగపడిందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కమ్యూనిస్టు మేనిఫెస్టో ప్రచురితమై 172 సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు, హిందీ, ఇంగ్లిషులో ముద్రించిన ప్రతులను సీపీఐ జాతీయ కార్యాలయం అజయ్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ ప్రతులను విజయవాడ, హైదరాబాద్లో కూడా సీపీఎం, సీపీఐ, ఇతర వామపక్ష నేతలు ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ కేవలం 40 పేజీలున్న ఈ పుస్తకం ప్రపంచ గతినే మార్చివేసిందన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ కమ్యూనిజాన్ని దెబ్బకొట్టేందుకు ఇప్పుడు మతం, కులం, ప్రాంతాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
*జగన్కు ఎవరు సలహాలిస్తున్నారో?: రాజా
మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి సృష్టించిన రాజకీయ అనిశ్చితి ఏపీని రాజకీయం సంక్షోభంలోకి నెట్టిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా అన్నారు. విజయవాడలో పర్యటిస్తున్న ఆయనను అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు కలిసి అమరావతి సంక్షోభాన్ని వివరించారు. ప్రజలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలకు విలువ ఇవ్వని రీతిలో ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని రాజా అభిప్రాయపడ్డారు. మూడు రాజధానులపై సీఎం జగన్కు ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియడంలేదన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధానాలు ఏపీలో ఎందుకని ప్రశ్నించారు.
*బీసీల ఎదుగుదల చూసి జగన్కు కడుపుమంట
ముఖ్యమంత్రి జగన్కి బీసీలంటే చిన్నచూపని, బీసీ వర్గానికి చెందిన నాయకులు ఎదగడాన్ని ఆయన సహించలేరని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లకు ప్రజల్లో ఉన్న ఆదరణ చూడలేకే వారిపై వైకాపా బురద జల్లుతోందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. జగన్ అవినీతి బురదలో పూర్తిగా కూరుకుపోయారని, దాన్ని తెదేపా నేతలకూ అంటించేందుకు కుతంత్రాలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బీసీల గొంతు నొక్కడమే జగన్ లక్ష్యం. శాసనమండలి సభ్యుల్లో 20 మంది బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలు, ముగ్గురు ముస్లింలు ఉండటం జగన్కు కడుపుమంట. అందుకే శాసనమండలి రద్దుకి తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. బీసీలపై ద్వేషంతోనే ‘ఆదరణ’ పథకం రద్దు చేశారు.
*సిరిసిల్లలో అఘాయిత్యాలపై అధ్యయనం చేశాం
సిరిసిల్ల ఎస్సీ వసతిగృహంలో అమ్మాయిలపై గుత్తేదారు దేవయ్య లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలుగుదేశం నిజనిర్ధారణ కమిటీ విచారణలో తేలిందని ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు టి.జ్యోత్స్న వెల్లడించారు. శుక్రవారం ఆమె ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. గత 8 నెలల నుంచి వేధింపులకు పాల్పడుతున్నాడని, గత జూన్లో వార్డెన్కు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆమె పేర్కొన్నారు.
*కమ్యూనిస్ట్ మేనిఫెస్టోతో ఆర్థిక సంక్షోభాలకు పరిష్కారం
ప్రపంచంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు ఎదురైన ప్రతిసారీ వాటిని పరిష్కరించేందుకు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఆయుధంగా ఉపయోగపడిందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కమ్యూనిస్టు మేనిఫెస్టో ప్రచురితమై 172 సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు, హిందీ, ఇంగ్లిషులో ముద్రించిన ప్రతులను సీపీఐ జాతీయ కార్యాలయం అజయ్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ ప్రతులను విజయవాడ, హైదరాబాద్లో కూడా సీపీఎం, సీపీఐ, ఇతర వామపక్ష నేతలు ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ కేవలం 40 పేజీలున్న ఈ పుస్తకం ప్రపంచ గతినే మార్చివేసిందన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ కమ్యూనిజాన్ని దెబ్బకొట్టేందుకు ఇప్పుడు మతం, కులం, ప్రాంతాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
*కేసులు తక్షణమే ఉపసంహరించాలి:పవన్
రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెంలో రెవెన్యూ అధికారుల ఎదుట నిరసన తెలిపిన రైతులపై పలు సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించాలని జనసేన అధినేత పవన్కల్యాణ్ డిమాండ్ చేశారు. నిరసన తెలిపిన రైతులపై కేసులు నమోదు చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వెల్లడిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అమరావతి పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 426 మందిపై కేసులుపెట్టి రైతాంగాన్ని భయభ్రాంతులకు గురి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన ఆరోపించారు.
*కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించండి: థరూర్
పార్టీ కార్యకర్తల్లో శక్తి నింపేందుకు, ఓటర్లకు చేరువయ్యేందుకు అధ్యక్ష ఎన్నికలను నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)ని ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ కోరారు. పార్టీ అధ్యక్ష పీఠం గురించి ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడంలో పార్టీ సీనియర్లు విఫలమమయ్యారని ఆరోపించారు. పిల్లి మెడలో గంట కట్టేందుకు భయపడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో శశి థరూర్ ట్వీట్ చేశారు.
*భరించలేని స్థితిలో జగన్ పాలన:చంద్రబాబు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సాగిస్తోన్న నియంతృత్వ పాలనను భరించే స్థితిలో భవిష్యత్తు తరం లేదన్నది స్పష్టంగా తెలుస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. నాటి తుగ్లక్ కంటే నేటి జగన్ తుగ్లక్ ఎంతో ప్రాచుర్యం పొందుతున్నారంటూ ఎద్దేవా చేశారు. పీపీఏల పట్ల వైకాపా ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రముఖంగా కథనం ప్రచురించిందని.. హైకోర్టు కూడా ఇదే అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని చంద్రబాబు గుర్తు చేశారు. పెట్టుబడిదారులు ఏపీ ప్రభుత్వ వ్యవహారం పట్ల ఆందోళనతో ఉన్నారన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై భద్రత కల్పించాలని కేంద్రాన్ని జపాన్ దేశం కోరినట్లు చంద్రబాబు వెల్లడించారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా ముఖ్యమంత్రి జగన్ వ్యవహారశైలిలో ఎలాంటి మార్పు రాలేదని చంద్రబాబు ఆక్షేపించారు.
*ఉద్యోగులు, నిరుద్యోగుల్ని వంచిస్తున్న ప్రభుత్వం: లక్ష్మణ్
ఎన్నికల ముందు హామీలిచ్చి, ఆ తర్వాత విస్మరించడం సీఎం కేసీఆర్కు పరిపాటిగా మారిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్ర ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే అమలు చేయకుంటే భాజపా ప్రత్యక్ష ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు. గురువారమిక్కడ ఆయన మాట్లాడారు. ఉద్యోగ సంఘాల నేతల స్వార్థాలకు ఉద్యోగులు బలవుతున్నారని.. ఆ సంఘాల నుంచి వచ్చిన మంత్రి కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఏఏకు మద్దతుగా మార్చి 15న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్షా ముఖ్య అతిథిగా హాజరవుతారని లక్ష్మణ్ అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను కూడా ఆహ్వానిస్తామని తెలిపారు.నార్సింగి సహకార సంఘానికి వైస్ఛైర్మన్గా ఎన్నికైన పార్టీ కార్యకర్త సత్యనారాయణను లక్ష్మణ్ సన్మానించారు. భాజపా నేతలు మోత్కుపల్లి నర్సింహులు, చింతా సాంబమూర్తి తదితరులుపాల్గొన్నారు.
*ఆరేళ్లు గడిచినా దక్కని హోదా: తులసిరెడ్డి
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా హామీ ఇచ్చి ఆరేళ్లు గడిచాయని.. ఇప్పటికీ అది అమలుకు నోచుకోలేదని, కేంద్రంలో ఉన్న భాజపా ఈ అంశాన్ని పట్టించుకోవటం లేదని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. గురువారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. . కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానన్న జగన్ ఇప్పుడు కేంద్రం వద్ద సాష్టాంగ పడుతున్నారని ఎద్దేవాచేశారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా అమలుపై కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలకు హోదా తెచ్చే శక్తి లేదని స్పష్టంచేశారు.