* నేటి సాయంత్రంలోగా కేవైసీ సమర్పించాకుంటే వారి బ్యాంకు ఎకౌంట్లను నిలిపివేస్తామని ప్రభుత్వ రంగ బ్యాంకు దిగ్గజం ఎస్బీఐ సాకింగ్ న్యూస్ చెప్పింది. అసంపూర్తిగా కేవైసీ పత్రాలు ఇచ్చిన వారు వెంటనే బ్యాంకు సఖ వద్దకు రావాలని తద్వారా లావాదేవీలో అసౌకర్యాన్ని నివారించుకోవచ్చని బహిరంగ నోటీసులు జారీ చేసారు.
* మొబైల్ యాప్‌లతోని బాకీలు తీస్కునుడు హైదరాబాద్‌లో ఎక్కువైంది. పర్సన్ టు పర్సన్ (పీ టు పీ)గా పిలిచే ఈ అప్పుల వ్యవహారం ఈ మధ్యన సిటీలో బాగా పెరిగింది. తీస్కునుడే కాదు అప్పులిచ్చుడులో కూడా మన సిటీ ముందే ఉన్నది. అప్పులిచ్చుడు, తీస్కునుడు రెండింటిలో దేశంలోని సిటీలల్లో మూడో ప్లేస్‌లో నిలిచింది. పీ టు పీ రుణాలపై ‘లెన్‌డెన్ క్లబ్’ అనే లెండింగ్ ప్లాట్‌ఫామ్ దేశవ్యాప్తంగా చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. జనవరి 2019 నుంచి జనవరి 2020 వరకు 4 లక్షల మంది యూజర్ల ఫీడ్ బ్యాక్ ఆధారంగా రిపోర్టును రెడీ చేసి గురువారం సంస్థ విడుదల చేసింది.
*స్టాక్ మర్కేంట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి కరోనా వైరస్ భయాల నేపద్యంలో ఈవారమంతా మార్కెట్లు నస్తాలనే చవి చూసాయి. భారత్ ఆసియా ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి .
* కొత్తగా తయారైన హెలికాప్టర్లను నిలిపి ఉంచే హ్యాంగర్ (గోదాము)ను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్)లో గురువారం ప్రారంభించారు. యుద్ధ అవసరాలకు, నిఘా కోసం తేలికపాటి హెలికాప్టర్లను తయారు చేస్తున్న హెచ్‌ఏఎల్… ఇప్పుడు మల్టీ రోల్ హెలికాప్టర్‌ను రూపొందించడం పట్ల ఆయన హర్షం వ్యక్తంచేశారు. ఓ హెలికాప్టర్ ఎక్కి, లోపల కూర్చుని సదుపాయాలను పరిశీలించారు. హెచ్‌ఏఎల్ ఛైర్మన్ ఆర్.మాధవన్, హెలికాప్టర్ల విభాగం ముఖ్య కార్యనిర్వహణాధికారి జి.వి.ఎస్.భాస్కర్ రాజ్‌నాథ్‌సింగ్‌తోపాటు ఉన్నారు.
* ప్రధాని నరేంద్ర మోదీ 2016 నవంబరు 8న డీమానిటైజేషన్ ప్రకటించిన వెనువెంటనే కస్టమర్లకు భారీ స్థాయిలో బంగారు ఆభరణాలు విక్రయించిన 12 మందికి పైగా ఆభరణాల వర్తకులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఆ రోజున నెక్లె్‌సలు, ఉంగరాలు వంటి ఆభరణాలతో పాటుగా బంగారం కూడా భారీ పరిమాణంలో విక్రయించినట్టు జైన్ అనే వ్యాపారి ఒకరు చెప్పారు. వాస్తవ ధర కన్నా చాలా ప్రీమియం ధరకు తాను ఒక్క రోజులోనే మొత్తం బంగారం అమ్మేశానని, రెండు నెలల పాటు కష్టపడితే తప్ప రాని ఆదాయం అందుకున్నానని తెలిపారు. మూడు నెలల క్రితం తనకు ఐటీ నోటీసు అందిందని ఆయన చెప్పారు. నల్లధనంతోనే ప్రజలు బంగారం కొన్నారని, అందుకే ఆ రాత్రి తాను ఆర్జించిన ఆదాయం మొత్తం తిరిగి చెల్లించాలని ఆ నోటీసులో ఆదేశించారని జైన్ తెలిపారు.
* తమ ఆర్థిక కష్టాలను వినియోగదారులపైకి నెట్టేందుకు టెలికాం కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి డేటా, ఔట్ గోయింగ్ కాల్స్‌కు కనీస చార్జీలు నిర్ణయిస్తే తప్ప.. మనుగడ కష్టమని వొడాఫోన్ ఐడియా స్పష్టం చేసింది.
* ప్రధాని నరేంద్ర మోదీ 2016 నవంబరు 8న డీమానిటైజేషన్ ప్రకటించిన వెనువెంటనే కస్టమర్లకు భారీ స్థాయిలో బంగారు ఆభరణాలు విక్రయించిన 12 మందికి పైగా ఆభరణాల వర్తకులకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఆ రోజున నెక్లె్‌సలు, ఉంగరాలు వంటి ఆభరణాలతో పాటుగా బంగారం కూడా భారీ పరిమాణంలో విక్రయించినట్టు జైన్ అనే వ్యాపారి ఒకరు చెప్పారు. వాస్తవ ధర కన్నా చాలా ప్రీమియం ధరకు తాను ఒక్క రోజులోనే మొత్తం బంగారం అమ్మేశానని, రెండు నెలల పాటు కష్టపడితే తప్ప రాని ఆదాయం అందుకున్నానని తెలిపారు. మూడు నెలల క్రితం తనకు ఐటీ నోటీసు అందిందని ఆయన చెప్పారు. నల్లధనంతోనే ప్రజలు బంగారం కొన్నారని, అందుకే ఆ రాత్రి తాను ఆర్జించిన ఆదాయం మొత్తం తిరిగి చెల్లించాలని ఆ నోటీసులో ఆదేశించారని జైన్ తెలిపారు.
* స్కోడా ఆటో ఇండియా తన ఆక్టావియా మోడల్‌లో లిమిటెడ్ ఎడిషన్ ఆక్టావియా ఆర్‌ఎస్ ను గురువారం నాడు మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. లక్షలు (ఎక్స్‌షోరూమ్). మార్చి వ తేదీ నుంచి దీనికి ఆన్‌లైన్ బుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభించనుంది. రూ.లక్ష చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుం ది. కేవలం కార్లను మాత్రమే విక్రయించనున్నట్టు కంపెనీ తెలిపింది.
* హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎ్‌సఐ) బీఎస్- ప్రమాణాలతో కూడిన యునికార్న్ బైక్‌ను మార్కెట్లోకి తీసుకు వచ్చింది. దీని ప్రారంభ ధర ఉంది. సీసీ ఇంజన్ కలిగిన ఈ బైక్ మంచి పనితీరును కలిగి ఉండటమేకాకుండా ఎక్కువ ఇంధన సామర్థ్యం కలిగి ఉన్నట్టు కంపెనీ తెలిపింది.
*టెక్నాలజీ రంగంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ వినూత్న ఆలోచనలు, ఉత్పత్తులను పరీక్షించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ‘ప్రాజెక్ట్ తేజ్’ పేరుతో ఒక వేదికను కల్పిస్తోంది. మెడికల్ టెక్ వినూత్నాల అభివృద్ధి వేగంగా పెరగడానికి ఇది దోహదం చేస్తుంది. ఇందుకోసం మెడ్టెక్ కనెక్ట్తో ప్రభుత్వం చేతులు కలిపింది. సైయెంట్, జింటియోకు చెందిన ఇండియా 2022 కొలీషన్లు మెడిటెక్ కనెక్ట్ను ఏర్పాటు చేశాయి
*మెడికవర్ గ్లోబల్ నెల్లూరులో 250 పడకల ఆసుపత్రిని ప్రారంభించింది. దీంతోపాటు మెడికవర్ అంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఎంఓఐ)ను ఏర్పాటు చేయనున్నట్లు మెడికవర్ గ్లోబల్ సీఈఓ ఫెడ్రిక్ రాగ్మార్క్ తెలిపారు. మెడికవర్ గ్లోబల్ వ్యాపారంలో భారత్ కేంద్ర బిందువుగా మారిందని, ఈ మార్కెట్లో పెట్టుబడులు కొనసాగిస్తామని ఫెడ్రిక్ తెలిపారు
*సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థ (ఎంఎ్సఎంఈ)లకు నిధుల సమీకరణ, రావాల్సిన బకాయిల రికవరీ వంటి సేవలను అందించడం కోసం బిజినెస్ డాక్టర్ ‘ఫండింగ్ డాక్టర్’ పేరుతో సేవలను ప్రారంభించింది. చిన్న సంస్థలు రుణాలు, ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ, క్యాపిటల్ మార్కెట్లో లిస్టింగ్ ద్వారా నిధుల సమీకరణకు ఫండింగ్ డాక్టర్ సాయపడుతుందని, హైదరాబాద్లో ఈ సేవలను ప్రారంభించామని ఫండింగ్ డాక్టర్ సహ వ్యవస్థాపకుడు ఎం శ్రీనివాసరావు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని ఎంఎ్సఎంఈలకు నిధుల సమీకరణ, బకాయిల రికవరీకి సాయం చేస్తామని చెప్పారు. త్వరలో హైదరాబాద్తో పాటు ఇతర పట్టణాలకు సేవలను విస్తరించనున్నట్లు తెలిపారు.
*సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిల చెల్లింపులు జరపలేక నానా తంటాలుపడుతున్న టెలికాం కంపెనీలు ఎయిర్టెల్, వొడాఫోన్ ప్రభుత్వ ఊరట కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్, వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగ ళం బిర్లా బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. అయుతే, మంత్రితో ఏం చర్చించారనే విషయాన్ని వెల్లడించేందుకు ఇరువురూ నిరాకరించారు. గడిచిన మూడున్నరేళ్ల నుంచి టెలికాం రంగం తీవ్ర ఒత్తిడిలో ఉందని సునీ ల్ మిట్టల్ అన్నారు. టెలికాం రంగ స్థిరత్వంపై ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థిక మంత్రి కంటే ముందు టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాశ్తో మిట్టల్ సమావేశమయ్యారు
*టాటా మోటార్స్కు చెం దిన జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్ఆర్) డ్రైవర్ రహిత విద్యుత్ కారును ఆవిష్కరించింది. సెంట్రల్ ఇంగ్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ వద్దనున్న తన నూతన ఇన్నోవేషన్ సెంటర్లో దీన్ని కంపెనీ అభివృద్ధి చేసింది. దీన్ని ప్రాజెక్టు వెక్టార్గా కంపెనీ చెబుతోంది. ఇది అడ్వాన్స్డ్, ఫ్లెక్సిబుల్, మల్టీ యూజ్ ఎలక్ర్టిక్ వెహికిల్ అని పేర్కొంది.
*కోట్లాది మందికి ఆరోగ్య సంరక్షణ సేవలు అందించాలంటే.. టెక్నాలజీ ఒక్కటే మార్గం. కరోనా వైరస్ వంటి అత్యవసర పరిస్థితులు అధిగమించాలన్నా.. వాటిని ముం దుగా అంచనా వేయాలన్నా టెక్నాలజీ వల్లే సాధ్యమవుతుందని ఇంటెల్ ఇండియా అధిపతి నివృతి రాయ్ అన్నారు. ప్రస్తుతం కంప్యూటింగ్ సామర్థ్యాలు పెరిగా యి.
*ప్రభుత్వ హెచ్చరికలతో ప్రముఖ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్) దిగివచ్చింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) బకాయిల్లో భాగంగా ఈ రోజు రూ.1000 కోట్లు చెల్లించింది. ప్రభుత్వానికి వీఐఎల్ మొత్తం రూ.56,709.49 కోట్ల ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉంది.
*టెక్ మహీంద్రాతో కలిసి ఎస్ఆర్ ఇన్నోవేషన్ ఎక్స్ఛేంజ్ (ఎస్ఆర్ఐఎక్స్) ‘యాక్సిల రేట్’ పేరుతో యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఐఒటీ, ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీల్లో వినూత్న ఉత్పత్తులు, సొల్యూషన్లు కనుగొనే వారికి మద్దతునిచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. అగ్రిటెక్, హెల్త్కేర్టెక్ రంగాల్లో ఉన్న అనుభవంతో స్టార్ట్పలకు మెంటారింగ్ చేయాలని భావిస్తున్నామని టెక్ మహీంద్రా గ్లోబల్ అధిపతి జార్జ్ మండస్సెరీ తెలిపారు. ఎస్ఆర్ఐఎక్స్ వంటి ఇంక్యుబేటర్లు ఆలోచన నుంచి ప్రోటోటైప్ స్థాయి ప్రొడక్ట్ను అభివృద్ధి చేయడం వరకూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాయం చేస్తున్నాయన్నారు.
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు-వాణిజ్యం
Related tags :