DailyDose

పోలవరాన్ని పరిశీలించిన జగన్-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-Jagan Visits Polavaram

* పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం వైయస్‌.జగన్‌. స్పిల్‌ వే, కాఫర్‌ డ్యాం పరిశీలన. 2021 జూన్‌నాటికి ప్రాజెక్టును పూర్తిచేయడంపై అధికారులు, ఇంజినీర్లకు మార్గనిర్దేశం చేసిన సీఎం. ఈమేరకు కార్యాచరణ ప్రణాళికపై అధికారులతో నిశితంగా మాట్లాడిన సీఎం. ప్రాజెక్టు పరిశీలన తర్వాత అధికారులు, ఇంజినీర్లు, కాంట్రాక్టు సంస్థలు, స్థానిక ప్రజా ప్రతినిధులతో సీఎం సమీక్ష. పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యమైనది అని పేర్కొన్న జగన్. జూన్‌ 2021 నాటికి ప్రాజెక్టు పూర్తికావాలని ఆదేశం. ఆమేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశాలు. 2021 సీజన్‌కు అందుబాటులోకి తీసుకు వస్తేనే ప్రయోజనకరంగా ఉంటుంది అని అన్నారు.
* పోలీసుల తీరుపై వేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ.టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ వేసిన లంచ్ మోషన్‌పై విచారణ.చంద్రబాబు పట్ల పోలీసుల వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్.వైసీపీ కార్యకర్తలను నియంత్రించడంలో పోలీసులు, హోంశాఖ కార్యదర్శి, విశాఖ సీపీ, ఎస్పీలను ప్రతివాదులుగా చేర్చిన పిటిషనర్.విశాఖలో ప్రజాచైతన్య యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరిన శ్రవణ్ కుమార్.పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.చంద్రబాబు యాత్రకు అనుమతి తీసుకున్నామన్న పిటిషనర్ తరపు న్యాయవాది.సెక్షన్ 151 కింద చంద్రబాబుకు నోటీసు ఇవ్వడాన్ని తప్పుపట్టిన న్యాయమూర్తి.సెక్షన్ 151 కింద నోటీసు ఎలా ఇస్తారంటూ పోలీసులను ప్రశ్నించిన న్యాయవాది.దీనిపై సమగ్ర అఫడవిట్ ఫైల్ చేయాలని డీజీపీకి హైకోర్టు ఆదేశం.విచారణను మార్చి 2కి వాయిదా వేసిన న్యాయమూర్తి
*అసెంబ్లీ సీట్ల పెంపు అనేది దేశమంతటా ఒకేసారి జరుగుతుందని తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పెంచే అవకాశం ఉండదని కేంద్ర సహాయ మందరి కిషన్ రెడ్డి స్పష్తం చేసారు. గురువారమిక్కడ ఆయమ నీదియాతో మాట్లాడుతూ అసెంబ్లీ స్థానాల పెంపు అంశాన్ని ఏపీ విభజన చట్టంలో రాత్రికిరాత్రి పొందుపరిచారని తదుపరి పర్యవసరాల గురించి ఆలోచించలేదని ఆరోపించారు.
*శ్రీరామాయణ రైలు మార్చి 28వ తేదీన ఢిల్లీ నుంచి బయలుదేరుతుందని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. ఈ రైలులో ఐదు నాన్‌ ఏసీ స్లీపర్‌ క్లాస్‌, ఐదు మూడో తరగతి ఏసీ కోచ్‌లు ఉంటాయి. యాత్ర 17 రోజుల పాటు సాగనుంది. రామాయణంతో అనుబంధం ఉన్న ప్రాంతాలను చుడతూ యాత్ర కొనసాగుతోంది. ఢిల్లీ, సఫ్దర్‌గంజ్‌, గజియాబాద్‌, మోరదాబాద్‌, బైరేలీ, లక్నో తదితర ప్రాంతాల్లో బోర్డింగ్‌కు అవకాశం కల్పించారు.
* సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను సీబీఐ,ఈడీ కోర్టు మార్చి 6కి వాయిదావేసింది. ఈకేసులో నిందితులుగా ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి తదితరులు ఇవాళ కోర్టుకు హాజరయ్యారు.
*అహ్మదాబాద్ లో మోతెరా స్టేడియంలో ఈనెల 24న నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని భారతదేశ వ్యాప్తంగా 4.6 కోట్ల మంది వీక్షించారు.
* జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ)లో జ్యుడీషియల్‌ సభ్యులుగా నలుగురు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో జస్టిస్‌ కె.పి.పి. జ్యోతీంద్రనాథ్‌ (కేరళ హైకోర్టు), జస్టిస్‌ ప్రకాశ్‌ చంద్ర జైశ్వాల్‌ (పట్నా హైకోర్టు), జస్టిస్‌ షియో కుమార్‌ సింగ్‌ (అలహాబాద్‌ హైకోర్టు), జస్టిస్‌ వినోద్‌ గోయల్‌ (దిల్లీ హైకోర్టు) ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను పర్యావరణ, అటవీ శాఖకు పంపినట్లు కేంద్రం పేర్కొంది
* అవినీతి అధికారుల వివరాలివ్వండి: ఏసీబీ
ప్రభుత్వ శాఖల నుంచి అవినీతి ఆరోపణలున్న అధికారులు, సిబ్బంది వివరాలు ఇవ్వాలని అవినీతి నిరోధక శాఖ కోరింది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖకు అనిశా డీజీ లేఖ రాశారు. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామస్థాయి వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగుల వివరాలు తెలియజేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలతో అరెస్టయిన వారి వివరాలు, సస్పెండైన సిబ్బంది వివరాలు కూడా తెలపాలని ప్రభుత్వ శాఖలకు సూచించారు. 2019 జూన్‌ 1 నుంచి ఇప్పటి వరకు పూర్తిస్థాయి వివరాలు ఇవ్వాలని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులకు సాధారణ పరిపాలన శాఖ సర్క్యులర్‌ పంపింది.
* ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్శిటీల విషయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని యూనివర్శిటీలపై ఫోకస్‌ పెట్టిన సర్కార్.. సాంకేతికంగా అనుసంధానించాలని నిర్ణయించింది. ఆన్‌లైన్‌ ద్వారా అన్ని సేవలు అందించేందుకు సిద్ధం కావాలని ఉన్నతాధికారులకు ప్రభుత్వం సూచనలు చేసింది.
*పౌరసత్వ సవరణ చట్టం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తేల్చి చెప్పారు. ఆదయ పన్న్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ సర్క్యూట్ ప్రారంభోత్సవంలో నిన్న పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు.
* దిల్లీ పోలీసు కమిషనర్‌గా ఎస్‌.ఎన్‌.శ్రీవాస్తవను నియమిస్తున్నట్లు హోంశాఖ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ బాధ్యతల్లో ఉన్న అమూల్య పట్నాయక్‌ రేపు పదవీవిరమణ పొందనున్నారు. ఇప్పటికే ఆయన పదవీకాలాన్ని నెలరోజుల పాటు పొడగించారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన స్థానంలో రేపు శ్రీవాస్తవ అదనపు బాధ్యతలు తీసుకోనున్నారు. ఈశాన్య దిల్లీలో జరిగిన ఘటనల్ని అదుపు చేయడంలో పోలీసులు విఫలమైనట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.
* రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనలు 73వ రోజుకు చేరాయి. తాళ్లాయపాలెం, మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతలు దీక్షలు కొనసాగుతున్నాయి.మరో వైపు బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌పై కొన్నిరోజులక్రితం దాడి జరిగిందంటూ వైకాపా ర్యాలీ చేయడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.
* ఢిల్లీ అల్లర్లలో హత్యకు గురైన ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఉద్యోగి అంకిత్‌ శర్మ మృతదేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. శర్మ శరీరంలో పలుచోట్ల గాయాలయ్యాయని, పదునైన ఆయుధంతో శరీరంలోపల చాలా లోతుగా కోతకు గురైందని, ఆయనను పలుమార్లు కిరాతకంగా కత్తిపోట్లకు గురిచేయడంతో మరణానికి దారితీసిందని అటాప్సీ నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. ఐబీలో 2017 నుంచి సెక్యూరిటీ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అంకిత్‌ శర్మ కార్యాలయం నుంచి ఇంటికి వెళుతుండగా చాంద్‌బాగ్‌లో అల్లరిమూకలు ఆయనను పాశవికంగా హత్య చేసి మృతదేహాన్ని డ్రైనేజ్‌లో పడవేసివెళ్లినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కాగా, ఢిల్లీ అల్లర్లలో ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 39కు చేరింది.
* జాతీయ అక్రిడిటేషన్‌ బోర్డు (ఎన్‌బీఏ) గుర్తింపు ఉన్న కోర్సుల్లో ప్రవేశాలు పొందితేనే బోధన రుసుములు చెల్లించేలా నిబంధన విధించాలని ఇంజినీరింగ్‌ విద్యపై నియమించిన నిపుణుల కమిటీ పేర్కొంది. ఇంజినీరింగ్‌ విద్యపై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను ఏఐసీటీఈకి పంపేందుకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నిపుణుల కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ సమక్షంలో ఆ కమిటీ బుధవారం సమావేశమై పలు అంశాలను చర్చించింది. సైయెంట్‌ కార్యనిర్వాహక ఛైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, టీసీఎస్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు రాజన్న, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, పలువురు అధికారులు, నిపుణులు పాల్గొన్నారు.
*రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రూ.46 కోట్లతో వెంటిలేటర్లు, డిఫిబ్రిలేటర్లు, సక్షన్‌ ఆపరేటర్లు, సీటీ స్కాన్‌ తదితర వైద్య పరికరాలను కొత్తగా సమకూర్చుకోవడానికి తెలంగాణ సర్కారు అనుమతించింది. ఆసుపత్రి అభివృద్ధి నిధులతో పాటు ఆరోగ్యశ్రీ నిల్వ నిధుల నుంచి కొనుగోలు చేసుకోవడానికి పచ్చజెండా ఊపింది. ఇప్పటికే ఆసుపత్రుల వారీగా అవసరమైన పరికరాల జాబితాను ఆయా దవాఖానాల నుంచే వైద్యఆరోగ్యశాఖ స్వీకరించింది.
*ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలో మంగళవారం రాత్రి పులి సంచారంతో స్థానికంగా అలజడి మొదలైంది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దున ప్రవహిస్తున్న పెన్‌గంగ నదిని దాటి జైనథ్‌ మండలంలోకి అది ప్రవేశించినట్లు తెలుస్తోంది. రాత్రి 10.40 గంటల సమయంలో జైనథ్‌-నిరాల మధ్య అంతర్రాష్ట్రీయ రహదారిని పులి దాటుతుండగా.. కారులో ప్రయాణిస్తున్న బేల మండలానికి చెందిన అనిల్‌ అనే వ్యక్తి చూసి సెల్‌ఫోనులో బంధించారు.
*విశాఖపట్నంలో హుద్‌హుద్‌ బాధితులకు ఇచ్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో విశాఖలో నిర్మించిన ఇళ్లను ప్రారంభించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఆహ్వానించినట్లు నిర్మాతలు దగ్గుబాటి సురేష్‌, శ్యామ్‌ప్రసాదరెడ్డి తెలిపారు. తెలుగు సినీ ప్రముఖులు కొందరు ముఖ్యమంత్రిని బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. విశాఖపట్నంలో సినీ పరిశ్రమ తరఫున చేపట్టిన ఇళ్ల నమూనా చూపించి, నిర్మాణాల గురించి వివరించారు. తర్వాత సురేష్‌, శ్యామ్‌ప్రసాదరెడ్డి విలేకర్లతో మాట్లాడారు.
*బిహార్‌ నుంచి తెలంగాణ వరకూ వ్యాపించి ఉన్న ఉపరితలద్రోణి బలహీనపడిందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. ఈశాన్య భారతం నుంచి తెలంగాణ వైపు తేమగాలులు వీస్తున్నందున కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట సాధారణం కన్నా 5 డిగ్రీల వరకూ తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పారు. బుధవారం తెల్లవారుజామున ఆదిలాబాద్‌ జిల్లా అర్లి గ్రామంలో 11.4, మెదక్‌లో 15.8, హైదరాబాద్‌లో 21, రామగుండంలో 17.2 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటిపూట హైదరాబాద్‌, రామగుండంలలో 31.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని ఆయన వివరించారు.
*హెరిటేజ్‌ సర్క్యూట్‌లో భాగంగా పురావస్తు కట్టడాల పరిరక్షణ పనుల్ని వేగవంతం చేయాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారుల్ని ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో సిరిసిల్ల, మిడ్‌మానేరు ప్రాంతంలో పర్యాటక ప్రదేశాల అభివృద్ధి గురించి చర్చించారు. ఆయా ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆదేశించిన విధంగా డిజైన్లు రూపొందించి, అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
*ఎస్టీ, ఎస్టీ వేధింపులపై మార్చి 26న హైదరాబాద్‌లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. వేధింపులకు గురైన బాధితులు మార్చి 13 లోపు కమిషన్‌కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదుల్ని ‘రిజిస్ట్రార్‌ జాతీయ మానవ హక్కుల కమిషన్‌, మానవ్‌ అధికార్‌ భవన్‌, జీపీఓ కాంప్లెక్స్‌, ఐఎన్‌ఏ, న్యూదిల్లీ – 110023’ చిరునామాకి పోస్టులో లేదా కమిషన్‌ ఈ-మెయిల్‌ ఐడీ registrar-nhrc@nic.in కి పంపొచ్చని కమిషన్‌ వర్గాలు తెలిపాయి. ఫిర్యాదులో తప్పనిసరిగా ఫిర్యాదుదారు ఫోన్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీలను పొందుపర్చాల్సి ఉంటుంది. విచారించదగిన ఫిర్యాదులను గుర్తించి ప్రజాభిప్రాయ సేకరణ వేదికపై సమీక్షిస్తారు.
*పాలేరు జలాశయం చెంత ఉన్న చేపల చెరువులో ఒక మొసలి కలకలం సృష్టించింది. దాన్ని గుర్తించిన జాలర్లు వల వేయడంతో చివరకు అది చిక్కింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం ఉర్లుగొండ గ్రామ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సంబంధిత చేపల చెరువును నర్సింహాపురం గ్రామానికి చెందిన గంగరబోయిన వెంకన్న అనే మత్స్యకారుడు లీజుకు తీసుకున్నాడు. కొన్నాళ్లుగా చెరువులో చేపల అలికిడి లేకపోవడంతో.. స్థానికులు మరికొందరితో కలిసి మంగళవారం రాత్రి చెరువు వద్ద ఆయన కాపు కాశాడు. ఈ క్రమంలో చెరువులో మొసలి కదలికలను గుర్తించి వల వేయగా.. సుమారు 70 కేజీల బరువున్న మొసలి చిక్కింది. పాలేరు జలాశయం నుంచి జొరబడినట్లుగా భావిస్తున్న ఈ మొసలి.. చెరువులోని చేపలను పూర్తిగా తినేయడంతో రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లిందంటూ వెంకన్న చెబుతున్నాడు. బుధవారం ఉదయం మొసలిని అటవీశాఖ అధికారులకు గ్రామస్థులు అప్పగించారు.
*ఏపీఐఐసీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్న కేసులో 15 మంది రైతులకు బెయిల్‌ మంజూరైంది. బుధవారం రాత్రి గుంటూరు జిల్లా జైలు నుంచి వారు విడుదలయ్యారు. ఈ నెల 20న రాజధాని ప్రాంతంలోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి రోజా హాజరుకాగా పెదపరిమి గ్రామానికి చెందిన రైతులు అడ్డుకున్నారు. కళాశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రైతులను అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌ విధించారు. రైతుల పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన మంగళగిరి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి వీవీఎన్‌వీ లక్ష్మి వారికి బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
*ఏపీఐఐసీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్న కేసులో 15 మంది రైతులకు బెయిల్‌ మంజూరైంది. బుధవారం రాత్రి గుంటూరు జిల్లా జైలు నుంచి వారు విడుదలయ్యారు. ఈ నెల 20న రాజధాని ప్రాంతంలోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి రోజా హాజరుకాగా పెదపరిమి గ్రామానికి చెందిన రైతులు అడ్డుకున్నారు. కళాశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రైతులను అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌ విధించారు.
*అహ్మదాబాద్‌లోని మోతెరా క్రికెట్‌ స్టేడియం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రసంగానికి ఆతిథ్యమిచ్చి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ స్టేడియానికి విశాఖ ఉక్కు ఉత్పత్తులనే వినియోగించడం విశేషం. ఈ విషయాన్ని విశాఖలోని రాష్ట్రీయ్‌ ఇస్పాత్‌ నిగమ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌-వైజాగ్‌స్టీల్‌ప్లాంట్‌) అధికారులు వెల్లడించారు. ఈ స్టేడియం పనుల కోసం 1,230 టన్నుల ఉక్కు ఉత్పత్తుల్ని అహ్మదాబాద్‌ డాక్‌యార్డు ద్వారా అందించామని వివరించారు. స్టేడియానికి అతిముఖ్యమైన రీబార్స్‌ (పొడవాటి కడ్డీలు) ఇచ్చినట్లు అధికారులు వివరించారు. ఈ స్టేడియాన్ని ఎల్‌అండ్‌టీ సంస్థ రూ.667 కోట్లతో నిర్మించింది
*ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ జనరల్‌గా ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లికార్జునను ప్రభుత్వం నియమించింది.
*ఆయుష్‌ ఆధ్వర్యంలో నడిచే హోమియో, యునాని, ఆయుర్వేద ఆసుపత్రుల్లో 1,384 పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వివిధ కేడర్లలో కలిపి 1,179 మంది పనిచేస్తున్నారు. ఖాళీగా గుర్తించిన 1,384 పోస్టుల్లో అత్యవసర ప్రతిపాదికన 40% నుంచి 50% వరకు తొలి దశలో భర్తీ చేయవచ్చునని భావిస్తున్నారు. ఆయుర్వేద వైద్యుల పోస్టులు-96, హోమియో-79, యునానిలో 43 పోస్టులు, 255 కంపౌండర్ల పోస్టులు, ఇతర కేడర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
*మూడేళ్ల కిందట రహదారి ప్రమాదంలో మృతిచెందిన ఎస్సై సైదా నాయక్‌ కుటుంబాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. సైదానాయక్‌ కుమార్తె బి.దీప్తికి ప్రభుత్వం రూ.25లక్షలను మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సైదానాయక్‌ 2017లో పశ్చిమగోదావరిజిల్లా చింతలపూడిలో పనిచేస్తున్న సమయంలో కుటుంబసభ్యులతో కలిసి కారులో ఏలూరు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. సైదానాయక్‌తో పాటు అతడి భార్య మృతిచెందారు. ఈ నేపథ్యంలో మృతుడితండ్రి బి.కోటయ్య తన కుటుంబానికి ఆధారమైన కుమారుడు చనిపోయినందున రెండోకుమారుడైన లక్ష్మణుడికి కారుణ్య నియామకం కింద ఉద్యోగమిప్పించాలని కోరారు. దీనిపై చర్చించిన స్టాండింగ్‌ కమిటీ లక్ష్మణుడికి ఉద్యోగమివ్వడం సాధ్యం కాదని, సైదానాయక్‌ కుమార్తె దీప్తి చదువు, ఇతర అవసరాలనిమిత్తం రూ.25లక్షలు మంజూరుచేయాలని తీర్మానించింది
*పట్టణ ప్రగతి’ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమవుతున్నందున అందరూ దానికే ప్రాధాన్యం ఇవ్వాలని, వచ్చే పది రోజులూ జిల్లాల్లోనే ఉండాలని రాష్ట్ర మంత్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప హైదరాబాద్కు రావద్దని అన్నారు. ఆదివారం ఆయన మంత్రులతో ఫోన్లో మాట్లాడారు.
*ఏబీవీపీ రాష్ట్రీయ కళామంచ్ ఆధ్వర్యంలో సింగిడి-2020 రాష్ట్ర స్థాయి ద్వితీయ సాంస్కృతిక పోటీలు ఆదివారం కరీంనగర్లో ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 1200 మంది విద్యార్థులు తమ నైపుణ్యాల్ని ప్రదర్శించేందుకు హాజరయ్యారు. శాస్త్రీయ, జానపద నృత్యాలు, చిత్రలేఖనం, నాటిక, ఫొటోగ్రఫీ, కవి సమ్మేళనం, రంగోలి వంటి 10 అంశాల్లో రెండు రోజుల పాటు పోటీలు నిర్వహించనున్నారు.
*రాజ్యాంగ మౌలిక సూత్రాలపై దాడి చేసేలా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరపట్టిక (ఎన్ఆర్సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) ఉన్నాయని భారత న్యాయవాదుల సంఘం (ఐఏఎల్) అభిప్రాయపడింది. విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ అధ్యాపకులు, న్యాయ విద్యార్థులు ఒక్కటై రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని విజయవాడలో జరుగుతున్న ఐఏఎల్ జాతీయ సదస్సులో తీర్మానించారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులపై దాడిని ఖండిస్తున్నామని, వీటిపై ఉద్యమించేవారికి మద్దతు ప్రకటిస్తున్నామని ఐఏఎల్ జాతీయ అధ్యక్షుడు రాజేంద్రసింగ్ తెలిపారు.
*ప్రభుత్వం మోసపూరిత ప్రకటనలు మానుకొని తక్షణమే పీఆర్సీపై నివేదిక తెప్పించుకొని అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డిమాండ్ చేసింది. ఆదివారం హైదరాబాద్లోని ఎస్టీయూ భవన్లో నిర్వహించిన జాక్టో కార్యవర్గ సమావేశంలో ప్రాతినిధ్య సంఘాల బాధ్యులు ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై చర్చించారు. త్వరలో ఉపాధ్యాయ, ఉద్యోగ, పింఛనుదారులతో మహా ఐక్య వేదికను నిర్వహించబోతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సమావేశంలో జాక్టో ఛైర్మన్ జి.సదానందగౌడ్, కో ఛైర్మన్ కె.కృష్ణుడు, దేశ్పాండే, గీతాంజలి, కె.వెంకటి, ఎమ్.ఎ.అలీమ్, యూసుఫ్, ఎస్.విఠల్ తదితరులు పాల్గొన్నారు.
*భాగ్యనగరంలో మెట్రో రైలు ప్రయాణికులకు మొబైల్ పవర్ బ్యాంక్లు అందుబాటులోకి వచ్చాయి. స్టేషన్లలో వీటిని అద్దె ప్రాతిపదికన తీసుకోవచ్చు. ప్రస్తుతం 20 స్టేషన్లలో ప్రత్యేక కియోస్క్ల ద్వారా వీటిని అందుబాటులో ఉంచారు. క్రమంగా అన్ని స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు. ప్లగ్ అనే సంస్థ మెట్రో సౌజన్యంతో వీటిని ఏర్పాటు చేసింది. రూ.199 డిపాజిట్ చేసి పవర్బ్యాంక్ తీసుకెళ్లొచ్చు. గంటకు రూ.3 కనీస అద్దెగా నిర్ణయించారు.
*జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ(కన్నెపల్లి) పంపుహౌస్ నుంచి నీటి ఎత్తిపోతలను తిరిగి శుక్రవారం ప్రారంభించారు. గత శనివారం మూడోదఫా మోటర్లను ప్రారంభించగా రెండు రోజులపాటు ఏకకాలంలో 11 మోటార్లను.. తర్వాత రెండు రోజులపాటు ఐదింటిని నడిపారు. బుధవారం నుంచి పూర్తిస్థాయిలో మోటర్లను నిలిపివేశారు. మహాశివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలు చేసే భక్తులకు నిండు గోదావరి కనువిందు చేయాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం తిరిగి 11 మోటర్లను ప్రారంభించి నీటిని సరస్వతి బ్యారేజీకి తరలిస్తున్నారు.
*దక్షిణ భారతదేశంలో మూడు రాష్ట్రాల ప్రజలకు తాగు, సాగునీటిని అందించే గోదావరి నది కాలుష్య కోరల్లో చిక్కుకుంటోందని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, డాక్టర్ రాజేంద్రసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 1,465 కిలోమీటర్లు ప్రవహిస్తున్న ఈ నదిలో ప్లాస్టిక్ వ్యర్థాలు, పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత నీటిని వదిలేస్తున్నారని తెలిపారు. గోదావరి పరిరక్షణ లక్ష్యంగా నాసిక్లో రాజేంద్రసింగ్ చేపట్టిన యాత్ర తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది సాగర సంగమం వద్ద శుక్రవారం ముగిసింది.
*అభిషేక ప్రీతిపాత్రుడైన పరమేశ్వరునికి మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో హైదరాబాద్ లక్డీకాపూల్లోని మారుతీహాల్లో కోటి రుద్రాక్షలతో అభిషేకం నిర్వహించారు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
*గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజినీరింగ్(గేట్)లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కి, జనరల్ విభాగం అభ్యర్థులుతో సమానంగా కటాఫ్ ఉండనుంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఎటువంటి మినహాయింపు ఉండదని ఐఐటీ దిల్లీ స్పష్టం చేసింది. ఎంటెక్లో ప్రవేశాలకు మాత్రం ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రం సమర్పిస్తే, వారికి ఆ కోటా కింద ప్రవేశం కల్పిస్తారని సూచించింది. ఇటీవల జరిగిన ఆన్లైన్ పరీక్షలకు దేశవ్యాప్తంగా సుమారు 8.20 లక్షల మంది హాజరయ్యారు. ఫలితాలు మార్చి 16వ తేదీన .
*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సెలవును ఆ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7 వరకు సగం వేతనంతో కూడిన సెలవును మంజూరుచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
*వూహాన్లో తాను బస చేసిన స్టార్ హోటల్ నుంచి విమానాశ్రయానికి తీసుకువెళ్లమంటే కారులో పెట్రోలు లేదని సదరు హోటల్ యాజమాన్యం పేర్కొందని చైనా నుంచి క్షేమంగా తిరిగొచ్చిన గుంటూరువాసి ఒకరు పేర్కొన్నారు. ఇందుకు కొవిడ్-19(కరోనా వైరస్) విజృంభణతో ప్రజల రాకపోకలను నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వం పెట్రోల్ బంకులకు ఇంధన సరఫరా నిలిపివేయడమే కారణమని వెల్లడించారు.
*విశాఖపట్నం రుషికొండలోని పర్యాటకాభివృద్ధి సంస్థకు చెందిన హరిత రిసార్టును శుక్రవారం కలెక్టర్ వినయ్చంద్, జేసీ వేణుగోపాల్రెడ్డి, జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళికాధికారి (సీయూపీ) విద్యుల్లత పరిశీలించారు. అక్కడి వాతావరణం, గదులు, మౌలికవసతుల గురించి తెలుసుకున్నారు. రిసార్టు నుంచి కనిపించే మిలీనియం టవర్, ఐటీ హిల్స్, చుట్టుపక్కలున్న కొండలను పరిశీలించి ఆయా ప్రాంతాల్లో ఏఏ భూములున్నాయో ఆరా తీశారు.
*భారతీయులు మేధోసంపన్నులని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్మిత్తల్ అన్నారు. మారియట్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ప్రారంభమైన ‘ప్రపంచ విద్యా సదస్సు’కు హాజరైనా ఆయన మాట్లాడుతూ..త్వరలో చైనాను అధిగమించే శక్తి భారత్కు మాత్రమే ఉందన్నారు. మన దేశంలో చదువుకునేందుకు విదేశాల నుంచి వేలాది మంది విద్యార్థులు వస్తున్నారన్నారు.
*జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ(కన్నెపల్లి) పంపుహౌస్ నుంచి నీటి ఎత్తిపోతలను తిరిగి శుక్రవారం ప్రారంభించారు. గత శనివారం మూడోదఫా మోటర్లను ప్రారంభించగా రెండు రోజులపాటు ఏకకాలంలో 11 మోటార్లను.. తర్వాత రెండు రోజులపాటు ఐదింటిని నడిపారు. బుధవారం నుంచి పూర్తిస్థాయిలో మోటర్లను నిలిపివేశారు. మహాశివరాత్రి సందర్భంగా పుణ్యస్నానాలు చేసే భక్తులకు నిండు గోదావరి కనువిందు చేయాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం తిరిగి 11 మోటర్లను ప్రారంభించి నీటిని సరస్వతి బ్యారేజీకి తరలిస్తున్నారు.
*అమరావతి ఒక్కటే రాజధానిగా కొనసాగాలని కోరుతూ రాజధాని ప్రాంతంలో జరుగుతున్న దీక్షలకు సంఘీభావంగా రాష్ట్ర మహిళా ఐకాస సభ్యులు రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈనెల 22, 23వ తేదీల్లో దీక్షలకు మద్దతు తెలపనున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి మహిళా ఐకాస శుక్రవారం తెలిపింది. 22న కృష్ణాయపాలెం, ఎర్రుబాలెం, పెనుమాక, మందడం, వెలగపూడిలో, 23న రాయపూడి, తుళ్లూరు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డులోని దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం ప్రకటిస్తామని వెల్లడించారు.
*అంగన్వాడీలకు సరఫరా చేసే పాల ధరను ప్రభుత్వం లీటరుకు రూ.42 నుంచి రూ.47.25లకు పెంచింది. ప్రస్తుతం పాలను 500 మి.లీ./ 1000 మి.లీ. ప్యాకెట్లలో పంపిణీ చేస్తున్నారు. అయితే గిరిజన ప్రాంతాల్లోని అంగన్వాడీలకు 200 మి.లీ. ప్యాకెట్లలో సరఫరా చేయనున్నారు. వీటికి లీటర్కు రూ.53 చెల్లించనుంది. వీటిని ఆంధ్రప్రదేశ్ పాల అభివృద్ధి సహకార సమాఖ్య నుంచి సేకరించనుంది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.