దుస్తుల్లో ఎన్ని రకాల వెస్ట్రన్ వెరైటీలు వచ్చినా మన స్టయిల్ మనదే. పరికిణీ అంటే పదహారణాల తెలుగుదనానికి ప్రతీక. రోజువారీగా జీన్స్‌లు, చుడీదార్లు వేసినా.. పండుగొచ్చిందటే మన కట్టు.. మన బొట్టే.. హైలెట్టు. పండగ నాడే కాదు.. అకేషన్ ఏదైనా పరికిణీ కట్టేయండి. అందుకే ఈ వారం కొన్ని బెనారస్ పరికిణీలు మీకోసం. చిలుకపచ్చ రంగు బెనారస్ పట్టు లంగా ఇది. దీనిమీద మొత్తం చిలుకల గోల్డెన్ వీవింగ్ చూడముచ్చటగా కనిపిస్తున్నది. ఎర్రని కంచి పట్టు డబుల్ బార్డర్ సూపర్‌గా మ్యాచ్ అయింది. ఎర్రని బెనారస్ బ్లౌజ్‌కి కింద ఆకుపచ్చని రాసిల్క్ మెటీరియల్‌ని అటాచ్ చేశాం. దీని మీద జర్దోసీ, కుందున్స్తో నింపేశాం. నెక్లైన్ దగ్గర థ్రెడ్, జర్దోసీ లైన్ ఇచ్చాం. ఎర్రని నెట్ దుపట్టాకి జర్దోసీతో కట్‌వర్క్ బార్డర్ అదనపు ఆకర్షణగా నిలుస్తున్నది. గోల్డెన్ సెల్ఫ్ వీవింగ్ వచ్చిన బెనారస్ పట్టు లంగా సూపర్‌గా మెరిసిపోతున్నది. దీనికి బెనారస్ డబుల్ బార్డర్ ఇచ్చాం. బార్డర్ పైన ఆకుపచ్చని రాసిల్క్ మీద కుందన్స్‌తో బుటీస్ ఇచ్చాం. ఆకుపచ్చని రాసిల్క్ మీద జర్దోసీ, కుందన్స్‌తో వర్క్ చేశాం. ఎర్రని బెనారస్ స్లీవ్స్, దాని చివరన ఆకుపచ్చని రాసిల్క్ అటాచ్ చేశాం. దీనిమీద జర్దోసీ, కుందన్స్‌తో హెవీ వర్క్ చేశాం. ఆకుపచ్చని బెనారస్ పట్టు లంగాకి సిల్వర్ జరీతో చెక్స్ ప్యాటర్న్ వచ్చింది. కింద బార్డర్ మీద నెమళ్ల డిజైన్ వీవింగ్ వచ్చింది. దీనికి ఎర్రని బెనారస్ పెద్ద బార్డర్ని అటాచ్ చేశాం. ఎర్రని రాసిల్క్ బ్లౌజ్ షోల్డర్ మీద జర్దోసీ, కుందన్స్, థ్రెడ్ వర్క్‌తో పెద్ద బంచ్ కుట్టాం. 3/4 బెనారస్ స్లీవ్స్ అదనపు ఆకర్షణగా నిలిచింది. ఎర్రని జార్జెట్ దుపట్టాకి ముత్యాలు, గోల్డెన్ జరీ బార్డర్ కరెక్ట్‌గా మ్యాచ్ అయింది. గ్రాండ్‌గా కనిపించాలంటే ఈ పరికిణీ కట్టాల్సిందే! ఎర్రని నెమలి, ఏనుగు సెల్ఫ్ వీవింగ్ వచ్చిన బెనారస్ లెహంగా ఇది. దీనికి ఫుల్ జరీ వచ్చిన బార్డర్ని జత చేశాం. మధ్యలో ఎర్రని రాసిల్క్ మీద మిర్రర్ వర్చ్ చేశాం. ఎర్రని రాసిల్క్ బ్లౌజ్ నెక్లైన్ మీద కూడా ముత్యాలు, అద్దాలతో హెవీగా వర్క్ చేశాం. బెనారస్ స్లీవ్స్‌కి చివరన కూడా ఇదే వర్క్ ఇచ్చాం. ఎర్రని జార్జెట్ దుపట్టా బార్డర్‌గా కూడా ముత్యాలు, అద్దాలతో హెవీగా వర్క్ చేయడంతో మరింత సూపర్ లుక్ సొంతమైంది.
పరికిణి అందాలు చూద్దము రారండి
Related tags :