*కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచ మార్కెట్లు షేక్ అవుతుండటంతో ఆ ప్రభావం క్రూడ్ ధరల పై కూడా పడింది. దీంతో ప్రపంచ దేశాల్లో పెట్ర్లోల్ డీజిల్ ఉత్పత్తుల ధరలు తగ్గ్గుతున్నాయి. కనీ భారత్ లో మాత్రం ఎలాంటి తగ్గింపు ఉండటం లేదు. కేవలం నలుగు, ఐదు పైసలు తగ్గిస్తూ వస్తున్నాయి ఆయిల్ సంస్థలు కరోనా ప్రభావంతో గత నెల రోజులుగా క్రూడ్ ధరలు తగ్గుతూనే వస్తునాయి. కాని వినియోగదారునికి కలిగిన ఊరట చాలా తక్కువ.
*భారతీ ఎయిర్‌టెల్ సంస్థ తన బాకీలో భాగంగా ఇవాళ 8004 కోట్ల సొమ్మును టెలికాంశాఖకు చెల్లించింది. ఏజీఆర్ బాకీలు చెల్లించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆదేశాల తర్వాత ఎయిర్‌టెల్ సంస్థ ఈమధ్యే పది వేల కోట్లను టెలికాంశాఖకు చెల్లించింది. దానికి తోడుగా ఇవాళ చివరి సెటిల్మెంట్‌లో భాగంగా ఎనిమిది వేల కోట్లను చెల్లించింది. భారతీ గ్రూప్ ఆఫ్ కంపెనీల తరపున ఈ పేమెంట్ జరిగింది. బాకీల కింద మూడు వేల కోట్లు, అడ్‌హక్ పేమెంట్ కింద మరో 5 వేల కోట్లు చెల్లించింది.
*కుబేరులకు కూడా కరోనా పోటు తప్పలేదు. గత వారం స్టాక్ మార్కెట్లు పడిపోవడం.. ఎగుమతులకు డిమాండ్ తగ్గడం.. ఇలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా(కొవిడ్-19) చూపించిన ప్రభావం వీరిపై కూడా పడింది. దీంతో వీరి సంపద భారీగా తగ్గింది.
*టెలికాం కంపెనీలకు ఉపశమనం కల్పించే అంశంపై జరిగిన డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) కీలక సమావేశం అర్ధంతరంగా ముగిసింది. టెలికాం విభాగానికి చెందిన అధికారులతో పాటు ఆర్థిక, వాణిజ్య, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు, నీతి ఆయోగ్ సీఈవో వంటి ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.
*హ్యుందాయ్ మోటార్స్పై కరోనా(కొవిడ్-19) ప్రభావం పడింది. ఆ సంస్థకు చెందిన ఒక కార్మికుడికి కరోనా వ్యాపించడంతో ఒక ఫ్యాక్టరీని మూసివేసింది. ఈ ఫ్యాక్టరీ ఉల్సాన్లో ఉంది. ఈ విషయాన్ని హ్యుందాయ్ శుక్రవారం ప్రకటించింది. ఈ కంపెనీ షేర్లు దాదాపు ఐదుశాతం వరకు కుంగాయి. మరోపక్క చైనాలో కొత్త కేసుల నమోదు తగ్గి విడిభాగాల తయారీ సంస్థలు కోలుకొంటున్న సమయంలో హ్యుందాయ్ కీలకమైన ప్లాంట్ మూసివేయడం గమనార్హం. దక్షిణ కొరియాలో కరోనా ఉద్ధృతంగా ద్యెగుకు ఉల్సాన్ కేవలం గంట ప్రయాణ దూరంలో ఉంది.
*ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా (కొవిడ్-19) వైరస్ ప్రభావంతో స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పలు సూచనలు చేశారు. వైరస్ వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడమే ఉత్తమమైన ఆర్థిక ఔషధమని, ప్రోత్సాహకాల గురించి తర్వాత ఆందోళన చెందవచ్చని అన్నారు. ఈ విషయంలో కేంద్ర బ్యాంకులు చేయగలింది కొంతేనని పేర్కొన్నారు.
*మౌలిక రంగం రాణించింది. 2019 ఆగస్టు నుంచి 2019 నవంబరు దాకా ప్రతికూల వృద్ధి నమోదు చేస్తూ వచ్చిన 8 కీలక పరిశ్రమలు వరుసగా రెండో నెలా సానుకూల వృద్ధి నమోదు చేశాయి. జనవరిలో 2.2 శాతం మేర వృద్ధిని కనబరచాయి. బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్ ఉత్పత్తులు మెరుగవడం ఇందుకు కలిసివచ్చింది. దీంతో జనవరి 2019లో నమోదైన 1.5 శాతం కంటే అధికంగానే నమోదైనట్లయింది. బొగ్గు 8 శాతం; రిఫైనరీ ఉత్పత్తులు 1.9%; విద్యుత్ 2.8 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. ముడి చమురు, సహజ వాయువు, ఎరువుల రంగాల ఉత్పత్తిలో మాత్రం ప్రతికూల వృద్ధి నమోదైంది.
కొరోనా దెబ్బకు చమురు ధరలు పతనం-వాణిజ్యం
Related tags :