విశాఖ పర్యటనకు వెళ్లిన తెదేపా అధినేత చంద్రబాబును విమానాశ్రయంలో అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఎన్‌ఆర్‌ఐ తెదేపా నేత, అమెరికాలో ఏపీ ప్రభుత్వ మాజీ ప్రతినిధి కోమటి జయరాం అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తలపెట్టిన ప్రజాచైతన్య యాత్రను అడ్డుకున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు. ఈ మేరకు కోమటి జయరాం ఓ ప్రకటన విడుదల చేశారు. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా అన్ని అనుమతులు తీసుకుని విశాఖ పర్యటనకు వెళ్తే దాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. ఇలాంటి నియంతృత్వ విధానాలతో ఏపీ భవిష్యత్ ఆందోళనకరంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చర్యలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు.
ఆందోళనకరంగా ఏపీ పరిస్థితి
Related tags :