NRI-NRT

EB5 రేటు పెరిగింది

EB5 రేటు పెరిగింది

ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఈబీ-5 వీసా పొందే భారతీయులు మరో 5శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దీని కింద పెట్టే పెట్టుబడి మొత్తాన్ని పెంచినట్లు నవంబర్‌లోనే అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి అమెరికా గ్రీన్‌కార్డ్‌ పొందడానికి దీన్ని మార్గంగా భావిస్తుంటారు. వ్యాపారవేత్తల వీసాగా భావించే దీనికి దరఖాస్తు చేసే సమయంలో అక్కడ పెట్టే పెట్టుబడిని వివరించాల్సి ఉంటుంది. దీంతోపాటు అక్కడ కనీసం 10 శాశ్వత ఉద్యోగాలు సృష్టిస్తామని డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. దీనిని సాధారణంగా స్టార్టప్‌ సంస్థలు ఉపయోగించుకొంటాయి. ఆ తర్వాత అమెరికా మార్కెట్లో వ్యాపారాన్ని విస్తరిస్తాయి. ‘ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి భారత్‌ నుంచి బయటకు వెళ్లే రెమిటన్స్‌పై 5 శాతం పన్ను అదనంగా చెల్లించాలి. దీనికి తోడు ఈబీ-5 వీసా పెట్టుబడి మొత్తాన్ని కూడా పెంచారు. ఇప్పుడు ప్రభుత్వం పెంచిన పన్ను ఈబీ-5 వీసాలపై ప్రభావం చూపిస్తుంది. భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లే ఈబీ-5 పెట్టుబడుల్లో అడ్డంకిగా మారుతుంది.’’ అని అమెరికన్‌ బ్యాంక్‌ బజార్‌ వెల్లడించింది. అమెరికా లీగల్‌ ఇమ్మిగ్రేషన్‌ ఏజెన్సీ ఈబీ-5 ఇన్వెస్ట్‌మెంట్‌ వీసా ప్రోగ్రామ్‌లో పెట్టుబడి మొత్తాన్ని 5లక్షల డాలర్ల నుంచి 9 లక్షల డాలర్లకు పెంచింది. 1990 తర్వాత పెంచడం ఇదే తొలిసారి. మరోపక్క భారత్‌లో రెమిటెన్స్‌పై 5శాతం అదనపు పన్ను పడనుడటంతో వీరు మరో 50వేల డాలర్ల వరకు భారత్‌లో చెల్లించాల్సి ఉంటుంది.