75రోజులుగా పట్టు వదలకుండా పోరాటం సాగిస్తున్నారు
అమరావతి కోసం మహిళా మూర్తులు పోరాటానికి ధన్యవాదాలు
అధికారంలోకి వచ్చి నాటి నుంచి తొమ్మిది మాసాల పాలన గమనిస్తే
2014 లో అధికారం ఇవ్వలేదనే అక్కసుతో ప్రధాన ప్రజల పై కక్ష తీర్చుకుంటున్నారు
2019లో వచ్చిన తిరుగులేని విజయం పట్టడం లేదు
చాక్లెట్ ఇచ్చి నక్లెస్ తీసుకెళ్లినట్లుగా ఉంది జగన్ పాలన
మద్యం, ఆర్టీసి, విద్యుత్, పెట్రో ఛార్జీలు పెంచి ప్రజల పై భారం వేశారు
నవరత్నాలు పేరుతో ముష్డి వేసి.. రెట్టింపు భారాలు మోపారు
రాష్ట్రం లో ఇసుక మాఫియా ను మీ నాయకులు సాగిస్తున్నారు
సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా ఇసుక ధర పెంచారు
మీ మట్టి మాఫియా దెబ్బకి ఇటుకలు కూడా కొనలేని స్థితి
మీ నాయకత్వం లో ఇళ్లు పట్టాలు ఇచ్చినా, నిర్మాణాలు చేసే పరిస్థితి లేదు
ఇప్పటికే వేలాది గృహాలు కట్టి ఉన్నా ఇవ్వకుండా రాజకీయం చేస్తున్నారు
పేదవాడికి పార్టీ ఏంటి.. మరో పార్టీ అయితే ఇల్లు ఇవ్వరా
పేదలకు పార్టీ అంటగట్టి న పాలకులను తొలిసారిగా చూస్తున్నాను
ఈ రాష్ట్రం లో కూల్చడం తప్ప.. పాడు పెట్టడం తప్ప చేసిందేమిటి
అవినీతి రహిత ఆలన అన్నావు.. నీ అండ దండ లతో అవినీతి పెరిగిపోయింది
.రాష్ట్రం లో అవినీతి లేదని చెప్పే ధైర్యం నీకు ఉందా
నెల రోజుల పాలనతోనే జగన్ కు తన యంత్రాంగం పై పట్టు పోయింది
నో అండదండలు లేకుండా అవినీతి జరుగుతుందా
లేదంటే మీ పార్టీ నాయకుల అవినీతి కి అడ్డుకట్ట వేయి
2014-19 మధ్య అవినీతి జరిగింది.. దాని పై విచారించి చర్యలు తీసుకో
ఆ పేరు చెప్పి ఇంతమంది ప్రజలను ఇబ్బందులు పెడతావా
ఆనాడు జగన్ తో సహా అన్ని పార్టీ లు అమరావతి కి అంగీకరం తెలిపారు
ప్రభుత్వం పై నమ్మకం తో మీరంతా 34వేల ఎకరాలు ఇచ్చారు
ఆ ప్రభుత్వాన్ని నమ్మి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు
ఎంతోమంది విరాళాల రూపంలో అమరావతి నిర్మాణానికి ఇచ్చారు
నేను వస్తే అమరావతి ఇక్కడే ఉంటుంది.. మంచి రాజధాని చేసి చూపిస్తా అన్నావు
ఎన్నిసార్లు మాట తప్పావు.. మడమ తిప్పావు
ఇప్పుడు మడమ నీకు ఉందా లేదా చెప్పాలి
వైయస్సార్ మాట మీద నిలబడ్డారు.. ఆయన డైలాగ్ వాడుకుని.. అధికారం లోకి వచ్చావు
నీ మాటలకు, నువ్వు చేసే దానికి ఏమాత్రం పొంతన లేదు
నీ అవినీతి కోసం ఏ స్థాయికైనా దిగజారి వ్యవహరిస్తున్నావు
ఇప్పుడు ఎన్నికలు పెడితే టిడిపి వచ్చిన అన్ని సీట్లు కూడా నీకు రావు
స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి భయం పట్టుకుంది
ఇటీవల కొత్తగా చట్టంలో మార్పులు తెచ్చింది దేనికి
మూడేళ్లు తర్వాత అయినా చర్యలు తీసుకుంటాడంట
ఎవరు మాట్లాడినా వారి పై కేసులు పెట్టిస్తున్నావు
144, 30సెక్షన్ పెట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు నొక్కుతున్నారు
అమరావతి అనేది ఐదు కోట్ల ఆంధ్రుల సమస్య
ఎపిలో పెట్టుబడులు పెట్టడానికి ధైర్యం చేయడం లేదు
ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని సంకన పెట్టుకుంటే ఎలా
రేపు మరొకరు వచ్చి రాజధాని మార్పు అంటారు
ఇలా ఉంటే ఎపి లో ఎవరూ పెట్టుబడులు పెట్టరు
నేడు విశాఖలో కూడా మీరొస్తున్నారని భయపడుతున్నారు
విజయనగరం లో కూడా జనం జగన్ వస్తే మా ఆస్తులు కబ్జా అవుతాయని భయపడుతున్నారు
ప్రశాంతంగా మేము బతుకుతున్నాం అంటున్నారంటే .. జగన్ సిగ్గు తో తలదించుకోవాలి
బీజేపీనే రాజధాని అమరావతి ని కాపాడాలని ఉత్తరాంధ్ర ప్రజలు చెబుతున్నారు
మూడు రాజధానులు కావాలని ఎవరు అడిగారు
అందుకే విశాఖ రాజధాని పేరుతో దోచుకోవాలని చూస్తున్నారు
అమరావతి ఎపికి ఏకైక రాజధానిగా ఉండాలనే బిజెపి చెబుతుంది
రాష్ట్రం కోసమే తప్ప.. మాకు ఎటువంటి లబ్ది అక్కర్లేదు
రాష్ట్రం లో రెండు పార్టీ లు ప్రజలను మోసం చేశాయి
త్వరలో అమరావతి కోసం బిజెపి, జనసేన కలిసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం
అమరావతి కోసం అసువులు బాసిన వారికి నివాళిగా ఒక్క నిమిషం మౌనం పాటించిన బిజెపి నాయకులు, రైతులు