తన అందం, అభినయం, గాత్రంతో కోట్లాదిమంది అభిమానుల మనసు దోచేసింది పాప్‌స్టార్ లేడీగాగా. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఏదో ఒక బలహీనత ఉంటుంది కదా..! లేడీగాగాకున్న అలవాటు ఏంటనుకుంటున్నారా..? పొగతాగడం. అయితే ఇది ఆమెకు ఒకప్పుడున్న అలవాటు. ఇదే విషయంపై గాగా యాపిల్ మ్యూజిక్ సంస్థ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో చెప్పింది. నేను ఒకప్పుడు రోజుకు 40 సిగరెట్లు తాగేదాన్ని. కానీ ఇప్పుడు పొగతాగడం లేదు. ప్రామిస్ చేసి చెప్తున్నా..ఇక నా జీవితంలో సిగరెట్ తాగను. కానీ ఇలా ఉండటం చాలా కష్టమైన విషయం. మీకు పొగతాగే అలవాటు లేకుంటే..ఇక ముందు కూడా తాగొద్దు. ఎందుకంటే పొగతాగే అలవాటు పూర్తిగా మానేయాలంటే చాలా కష్టంగా ఉంటుందని తన అనుభవాలను షేర్ చేసుకుంది.
అప్పట్లో 40…ఇప్పుడు 0
Related tags :