ఈ మధ్య ఇంటర్‌నెట్ బలపడింది. కానీ ఇంటర్‌నెట్ యూజ్ చేసే నెటిజెన్లు బలహీనపడ్డారు. అంటే- వారి సంఖ్య తగ్గిందని కాదు. ఇంటర్‌నెట్ వినియోగదారులు పెరగడమైతే పెరిగారు కానీ – వ్యక్తిగతంగా వారి సమాచారానికి భద్రత తగ్గింది. ఇందుకు ప్రప్రథమ కారణం – బ్రౌజర్లు. యూజర్లకి ఇంటర్‌నెట్‌ని అందిస్తూనే – బ్రౌజర్లు వారి అలవాట్లనూ, ఇష్టాలనూ తెలుసుకుంటూ ఉంటాయి. బ్రౌజింగ్‌లో సౌకర్యం అందించే నెపంతో – నిత్యం వ్యక్తిగత సమాచారం సేకరిస్తూ ఉంటాయి. అందుకే – ఇంటర్‌నెట్ బ్రౌజింగ్ చేసేటప్పుడు – వ్యక్తిగత సమాచార రక్షణ కోసం ఎన్నో టూల్స్ మీద ఆధారపడుతున్నారు జనం. అయితే త్వరలో ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్లు యూజ్ చేసేవాళ్లు – అలా వేరే టూల్స్ మీద ఆధారపడాల్సిన పని లేదు. బ్రౌజర్లోనే డిఎన్‌ఎస్ ఎన్‌క్రిప్షన్ తో మంచి సెక్యూరిటీ సదుపాయం అందజేయబోతోంది ఫైర్‌ఫాక్స్. వ్యక్తిగత భద్రతకి అత్యంత విలువ ఇచ్చే బ్రౌజర్‌గా – మొదటినుంచీ ఫైర్‌ఫాక్స్‌కి ఎంతో పేరుంది. ఇప్పుడు ఆ పేరుకి మరింత ప్రతిష్ఠ కల్పిస్తూ – డిఎన్‌ఎస్ ఎన్‌క్రిప్షన్ తో రాబోతోంది ఫైర్‌ఫాక్స్.
మీ బ్రౌజర్ వెంటనే ఫైర్‌ఫాక్స్‌కు మార్చుకొండి
Related tags :