Kids

ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు

How to boost kids confidence levels-Telugu kids news

ఏదైనా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలన్నా, ఏ పనినైనా విజయవంతంగా ముగించాలన్నా ఆత్మవిశ్వాసం ఉండాలి. మాటలోనే కాదు నడకలోనూ ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపించాలి. అప్పుడే వేసే ప్రతి అడుగు విజయం దిశగా నడిపిస్తుంది. అయితే ఆత్మవిశ్వాసం పెంచుకునే మంత్రదండం ఎక్కడోకాదు మన ఆలోచనల్లోనే ఉంది. అదెలాగంటారా…
*బాడీ లాంగ్వేజ్‌:
సరైన భంగిమలో నిల్చోవడం ఆత్మవిశ్వాసాన్ని రెండింతలు చేస్తుంది. దానివల్ల మీకు ఎన్నో అనుకూలతలు ఉంటాయి. మీరు లోపల ఏం అనుకుంటారో బయటకు అలానే కనిస్తారని చెబుతున్నారు నిపుణులు. నిటారుగా నిల్చోవడం ద్వారా, కుర్చీలో వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోవడం ద్వారా మీ ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. మిమ్మల్ని చూసిన వారు మీరు చేసే పని పట్ల స్పష్టత ఉన్నదని భావిస్తారు. అలాకాకుండా డీలాపడ్డట్టు, కూలబడినట్టు కూర్చున్నారంటే మీరు ఆత్మవిశ్వాసంగా లేరని అర్థమవుతుంది.
*విజయాల జాబితా:
మీరు గతంలో దాటివచ్చిన కష్టాల జాబితా రాసుకోండి. ఇలాచేయడం ద్వారా మీ ఆలోచనల్లో మార్పు వచ్చి దృఢంగా మారుతారు. భవిష్యత్తులో ఎదురయ్యే కష్టాలను గట్టెక్కేందుకు కావలసిన మానసిక ధైర్యం పోగవుతుంది.
*భయాన్ని వదిలేయండి:
మీరు భయపడి చేయకుండా వదిలేసిన పనుల్ని చేయండి. అలాచేస్తేనే వాటిపట్ల మీలోని భయం పోతుంది. ఎందుకంటే భయంతో ఆ పని చేయలేక పోయానని తరువాత బాధపడేకన్నా ఇప్పుడే ధైర్యంతో చేయడం మంచిది. కొత్త సవాళ్లను స్వీకరించడం ద్వారా మీ మెదడు మీకు అవసరమైనంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే పనిలో ఉంటుంది.