Movies

తాపీగా వకీల్‌సాబ్

Pawan Kalyan Vakeel Saab First Look

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రానికి సంబంధించిన పవన్‌ లుక్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. దాదాపు రెండేళ్ల తర్వాత పవన్‌ తిరిగి సినిమాల్లో నటిస్తుండటం, ఆయన లుక్‌ విడుదల కావడంతో ఇటు అభిమానులు, అటు సినిమా పరిశ్రమలోని నటీనటులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘వకీల్‌సాబ్‌’లోని పవన్‌ లుక్‌ను చూసి ఎవరేమన్నారంటే.