బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే తెలంగాణకు చెందిన 24 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్ కేసు.
ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసు వ్యక్తి గాంధీ హాస్పిటల్ ఐసోలాషన్ వార్డ్ లో ఉన్నాడు.
ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది.
కరోనా సోకిన వ్యక్తి
ఫిబ్రవరి 17న దుబాయి వెళ్లి నాలుగు రోజులపాటు హాంకాంగ్ వ్యక్తులతో పని చేశారు.
ఆ తర్వాత దుబాయ్ నుంచి బెంగళూరు ఫ్లైట్ లో వచ్చాడు
బెంగుళూరు నుండి బస్సులో హైదరాబాద్ వచ్చాడు.
కరోనా పాజిటివ్ కేసు వ్యక్తికి సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరిగింది.
ఆ బస్సులో 27 మంది ప్రయాణించినట్టు తెలిసింది.
ఆ 27 మందిని ట్రేస్ చేస్తున్నాం.
ఆ 27 మందికి సంబందించిన కుటుంబ సభ్యుల్లో ఇప్పటికి 80 మందిని గుర్తించాం. వారికందరికి టెస్టులు చేస్తాం.
నిన్న 5 గంటలకు గాంధీలో టెస్ట్ చేసి, పుణే ల్యాబ్కు టెస్ట్ కోసం పంపితే కరోనా పాజిటివ్ గా వచ్చింది
పాజిటివ్ కేసుగా నమోదైన వ్యక్తిని ఐసోలేషన్ వార్డులో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారు.
మున్సిపల్ శాఖ అధికారులతో మీటింగ్ పెట్టి ప్రికాషన్స్ తోసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
వ్యాధి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ను సంప్రదించి, టెస్టులు చేయించుకోవాలి.
గాంధీ , చెస్ట్, ఫీవర్ హాస్పిటల్స్ లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసాం.
బహిరంగ ప్రదేశాల్లో దగ్గడం, తుమ్మడం లాంటివి చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రజలకు అవగాహన కల్పించేందుకు బ్రోచర్స్ ప్రింట్ చేసి జనసమ్మర్థ ప్రదేశాల్లో ఉంచుతాం.
కరోనా స్ప్రెడ్ అవ్వకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
కరోనాకు స్పెషల్ గా ఫండ్ కావాలంటే తీసుకోండని చెప్పిన సీఎం కేసీఆర్.