Movies

వరలక్ష్మిని వేధించిన నిర్మాతలు

Varalaxmi Saratkumar Speaks Of Casting Couch

క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి కోలీవుడ్‌ నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్యాస్టింగ్‌ కౌచ్‌కి అమ్మాయిలు నో చెప్పడం నేర్చుకోవాలని ఆమె అన్నారు. తాను క్యాస్టింగ్‌ కౌచ్‌ సమస్యను ఎదుర్కొన్నానని గతకొంతకాలం క్రితం వరలక్ష్మి శరత్‌కుమార్‌ స్పందించిన విషయం తెలిసిందే. కొంతమంది నిర్మాతలు తనని వేరే ఉద్దేశంతో కలిశారని ఆమె అప్పట్లో చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె మరోసారి క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘లైంగికంగా వేధించేవారి గురించి ధైర్యంగా బయటకు వచ్చి చెప్పడం మహిళలు నేర్చుకోవాలి.’ అని వరలక్ష్మి చెప్పారు.